ముందు నుంచీ చెప్పుకుంటున్నదే కదా… చిన్న సినిమా, వాడికేం బ్యాక్ గ్రౌండ్ ఉంది, తొక్కితే పాతాళానికి పోతడు, మా సినిమాలకే పోటీకి వస్తాడా, ఛల్, థియేటర్లే ఇవ్వబోం, ఎవడైనా అడిగినా రాసినా తాటతీస్తాం, అసలు మీడియా రివ్యూలను ఎవడు దేకిండు, వాటినెవడు చదివిండు, వుయ్ డోన్ట్ కేర్, మా సినిమా పాత రికార్డులన్నీ బద్దలు బద్దలు కొట్టింది తెలుసా….. ఇదుగో ఇలాంటి కూతలు కూసిన మొహాలు మాడిపోయినయ్…
‘సినిమాలో దమ్ముండాలిర భయ్, కుర్చీలు మడతపెట్టడు కాదు, బూతు సైగలు చేసుడు కాదు’ అంటున్నాడు సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు… అఫ్‌కోర్స్, హిందీ ప్రేక్షకుడు కూడా… ఎక్కడో అమెరికాలో కూడా కుమ్మేస్తోంది హనుమాన్ సినిమా… మేం తోపులం, మేం తురుములం, 300 కోట్లు పక్కా… ఇప్పటికే 200 దాటిపోయినయ్ అంటూ ప్రకటనలు సరేసరి… కానీ సదరు గుంటూరుకారం వెలవెలపోతుండగా, హనుమాన్ దాన్ని దాటేసింది…
(source :: sacnilk)
Ads
ఇదుగో ఇవీ నిన్నటివరకు లెక్కలు… హనుమాన్ 209 కోట్లు దాటడమే కాదు… ఈజీగా 250 క్రాస్ కావడం పక్కా… ఓవర్సీస్ రద్దీ బలంగానే నడుస్తోంది… మొదట్లో థియేటర్లు ఇవ్వక తొక్కడానికి ట్రై చేశారు గానీ లేకపోతే ఇప్పటికే 250 క్రాసయ్యేది… అదీ హనుమంతుడి పవర్… నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావల్సింది… సరే, కారణాలేవైనా లేట్ కావడం నిర్మాతకే నయమైంది… సరిగ్గా అయోధ్య ప్రాణప్రతిష్ఠ, సంక్రాంతి పండగ కలిసొచ్చాయి…
వీళ్లకు కలిసొచ్చిన అదృష్టం ఏమిటంటే… గ్రాఫిక్స్, కథ, కథనం బాగా కుదిరాయి… (గ్రాఫిక్స్ కోసం ఒక్కొక్కడు బయటి దేశాలకు వెళ్లి వందల కోట్లు ఎందుకు పెడతారో, ఆ ఖర్చులో స్కాం ఏమిటో తెలియదు గానీ… 15- 20 కోట్లతో హైదరాబాద్ కంపెనీయే అద్భుతంగా చేసి ఇచ్చింది… మరీ ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర సినిమాల గ్రాఫిక్స్ ఖర్చు మాత్రం పక్కా స్కాం…)
మరోవైపు గుంటూరుకారం సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడం, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పరాజయంతో, ఈ పరాభవంతో ఇప్పటికీ మళ్లీ పత్తాజాడా లేకుండా పోయాడు… కొద్దిలోకొద్దిగా నాసామిరంగ సినిమా నయం… ఆ సినిమా రేంజుకు ఆ వసూళ్లు చాలు… వరుస డిజాస్టర్ల నాగార్జునకు ఇదొక కంటితుడుపు… అడ్డగోలుగా ఫ్లాపయింది మాత్రం వెంకటేష్ సినిమా సైంధవ… మొత్తానికి ఈ సినిమాలు చెబుతున్న నీతి ఏమిటయ్యా అంటే… ఉండాల్సింది, చూపించాల్సింది మాఫియా పోకడలు కాదు… నాణ్యమైన సరుకు..!!
Share this Article