Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హేపీ మెన్స్ డే బావా… ఇక్కడ పులుసు మరుగుతోంది, తరవాత కాల్ చేస్తా…

November 19, 2022 by M S R

Gottimukkala Kamalakar…… సరికొత్త సీసాలో పాత సింగిల్ మాల్టు:

నేను: బావా..! ఇవాళేదో ఇంటర్నేషనల్ మెన్స్ డే అటగా..? సాయంత్రం కలుద్దామా..?
వాడు: చూస్తాలేరా..! ఇప్పుడే చెప్పలేను.
నేను: ఏం చేస్తున్నావ్..?
వాడు: పనిమనిషి స్కూటీ సర్వీసింగ్ కి ఇచ్చిందట. రాలేనని మా ఆవిడకి వాట్సాప్ లో మెసేజెట్టింది..!
నేను: నీకెందుకు చెయ్యలేదు…?
వాడు: నా దగ్గర తన జియో సిమ్ నంబరుందిరా..! అది మా ప్రైవేట్ చాట్ కే. అపార్టమెంట్ వాట్సాప్ గ్రూపులో ఎయిర్ టెల్ సిమ్ము వాడుతుంది. నేనా గ్రూపులో లేను..!
నేను: ఐతే…?
వాడు: పొద్దుణ్నుండీ ఇల్లూడవడం, తుడవడం అయ్యింది. ఓ స్పెల్ బట్టలు మిషన్లో ఆడించి ఆరేసాను. ఇప్పుడే గిన్నెలన్నీ కడిగేసాను.
నేను: వాటిని నీళ్లుపోయేదాకా పట్టుకుని బోర్లించి ఫాన్ వెయ్యరా బాబా…! వీలైతే ఓ సాఫ్ట్ కాటన్ బట్టతో శుభ్రంగా తుడిచేయ్…! లేకపోతే ఆ సబ్బుమచ్చలు అలాగే గిన్నెల మీద ఉండిపోతాయి. మీ బతుక్కి ఒక్క పనీ సరిగ్గా చేయడం రాదంటూ, మనల్ని కడిగేస్తూ, గిన్నెల్ని మళ్లీ కడిగిస్తారు..!

వాడు: థాంక్స్ రా బావా..! నువ్వనుభవజ్ఞుడివీ, అదృష్టవంతుడివినీరా బా.., నీ పిల్లలు పెద్దైపోయారు. మా గాడిదల రూం సర్దాలి.
నేను: అదృష్టమా, ఆవకాయ్ బద్దా..? నీ పిల్లలు పిల్ల గాడిదలు. మా పిల్లలు ముదురు గాడిదలు. నువ్వు సర్దితే సరిపోతుంది. నేను మా పిల్లల రూం పునర్నిర్మించాలి..!

Ads

వాడు: అద్సరే, వంటేం చేశావు బావా..?
నేను: వంకాయ కొత్తిమీర కారం; పెద్ద మెంతికూర పప్పూ, ముక్కల పులుసు.., మరి నువ్వో…?
వాడు: మీ చెల్లి కూరలు తేడం మర్చిపోయింది బావా..! పులిహోర కలిపా..!
నేను: నిమ్మకాయదా..? చింతపండుదా..?
వాడు: తను నిమ్మకాయది అస్సలు తిందు బావా..! పాచ్చింతపండు పులిహోరే..! బాగా ఆవపిండీ, ఇంగువా, పల్లీలు, పచ్చిమిర్చీ దట్టించాలి. ఫుడ్డు చప్పగా ఉంటే తను గరమైపోతుంది..!

నేను: మరి మా అల్లుడూ, కోడలూ పులిహోర తింటారా..?
వాడు: ఆల్లు బర్గర్లు తెప్పించుకున్నారు బా…!
నేను: వంట గురించి మాటాడితే గుర్తొచ్చింది. #కార్తీకదీపం సూత్తన్నావా బావా..? పాపం ఆ వంటలక్కకు ఎన్ని కష్టాలో..!
వాడు: నేను #కార్తీకదీపం వంటలక్క కోసం చూడను బావా..!
నేను: మరీ…?
వాడు: డాక్టర్ బాబు కోసం చూస్తా..!

నేను: యేం..?

వాడు: డీయెన్నే టెస్టు ఛేయించుకుని నిజం బయటపడితే, ఆ వంటలక్క వాడి దగ్గరికి వచ్ఛేస్తే వాడికి వాడు #వంటలన్న ఐపోతాడనే జ్ఞానం ఉంది చూసావా..? ఆముక్క నాకు తెగ నచ్చింది బావా..!

నేను: సూపర్రో…!

వాడు: మరి #స్త్రీ సూత్తన్నావా..?

నేను: అయ్యబాబో.., మాయావిడ చీర ఇస్త్రీకి పెట్ఠొచ్చి నీతో సొల్లేస్తన్నా..! అది కొంచెం కాలినా మాడిపోతా..! పెట్టేయ్.. పెట్ఠేయ్..

వాడు: ఈ పాటి బతుకు బాగోతానికి మెన్స్ డే, బొంగూబోశాణం అని ముచ్చట్లు..! ఏం చేద్దాంరా బా..?

నేను: ఏవుందీ, చేతుల్లోకి దాన్ని తీసుకుని, సవరదీసుకుంటూ “నీవల్లే మాకీ కష్టాలం”టూ దిగులడిపోవడమే..!

వాడు: దేన్ని బా..?

నేను: మీసాన్ని రా, అదొహటేడ్చింది కదా..!

****

వాడు: ఇప్పుణ్నేను హఠాత్తుగా ఫేమస్సవ్వాలంటే యేంచేమంటావు…?

నేను: గరికపాటినీ, ఆఫ్తాబ్ పూనావాలానీ, కెవిన్ స్పేసీనీ కలిపి తిట్టు…!

వాడు: అంటే…?

నేను: మాంసం మింగుతూ, వీగనిజం విశిష్టత గురించి పోస్టు పెట్టడమే నేటి నీతి.

#MENSDAY

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions