Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికా కక్కలేక, మింగలేక..! సాయపడిన వేలాది అప్ఘన్లు గజగజ…!!

September 10, 2021 by M S R

……….. By…. పార్ధసారధి పోట్లూరి ……… చాలా పెద్ద మొత్తంలో బయో మెట్రిక్ డాటా తాలిబాన్ల చేతిలోకి చిక్కింది ! ఇది చాలా పెద్ద దెబ్బ అటు CIA కి కానీ ఇటు RAW కి కానీ! ఏమిటీ ఈ బయోమెట్రిక్ డాటా ? Afghan Automated Biometric Identification System (AABIS). వెల్..! 2001 లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి తాలిబన్లని తరిమేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని స్థానిక భాషలు,సంస్కృతుల మీద పెద్దగా అవగాహన లేదు కానీ తమతో పాటు పష్టూన్,ఇంగ్లీష్ తెలిసిన కొంత మంది దుబాసీ [Translaters ] ని వెంటబెట్టుకొని వచ్చింది. వాళ్ళ సహాయంతో ముందు నిలదొక్కుకోగలిగింది. తరువాతి కాలం ప్రస్తుతం పాంజీషీర్ లో ఉన్న ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లాహ్ సలేహ్ ని CIA తరుపున ఏజెంట్ గా నియమించుకుంది. అమృల్లాహ్ సలేహ్ సహాయంతో ఆఫ్ఘనిస్తాన్ లోని వివిధ ప్రాంతాలలో ఉంటున్న స్థానికుల్లో కొందరిని నియమించుకుంది. అలా అమెరికన్ సైన్యంతో పాటు 2015 లో RAW ని విస్తృతంగా నెట్వర్క్ పటిష్ట పరిచే చర్యలో భాగంగా కొంతమందిని నియమించుకుంది. ఎవరు ఎవరికి [CIA-RAW] పనిచేస్తున్నారో గుర్తించడం కోసం రెండు గూఢచార సంస్థలు కలిసి బయో మెట్రిక్ సిస్టమ్ వ్యవస్థని నెలకొల్పాయి. దానిలో భాగంగా తమకి సహకరిస్తున్న వారి డాటా సేకరించడానికి పేరు, అడ్రస్ తో పాటు వాళ్ళ వేలి ముద్రలు, కంటి రెటీనాని స్కాన్ చేసి ఒక డాటాబేస్ ని సృష్టించి దానిని అమెరికాలో కల CIA డాటా బేస్ సెంటర్ తో అనుసంధానం చేశారు. ఇదంతా దేని కోసం ?

afghan news

అమెరికన్ సైన్యం మొదట్లో స్థానికులకి $500 నుండి $1000 వరకు కాష్ రూపంలో ఇస్తూ వచ్చింది కానీ కాలక్రమంలో… వాళ్లకే మొత్తం ఇచ్చి, మీరే పంచుకొమ్మన్నారు…  అయితే వాటిలో హస్త లాఘవాలు జరుగుతున్నాయని తెలుసుకొని డాటా బేస్ ని ఏర్పాటు చేసింది. దాని ప్రకారం చెల్లింపులు జరిగినప్పుడల్లా వేలి ముద్రలు తీసుకునేవారు దాంతో ఎవరికి చెల్లింపులు జరిగింది సెంట్రల్ డాటాలో తెలిసిపోయేది. అయితే ఇది కేవలం చెల్లింపులకే కాదు తాలిబాన్ల నుండి ప్రాణాలకి తెగించి సహాయం చేస్తున్నారు కనుక వీళ్లలో చాలా మందికి అమెరికా పౌరసత్వం ఇవ్వడానికి నిర్దేశించింది. దీనివల్ల తాము ఎవరికయితే వాగ్ధానం చేశామో వాళ్ళ డాటా తన దగ్గర ఉంటుంది కాబట్టి ముందు ముందు ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం ఉండదు. గతంలో ఇరాక్, లిబియాలలో ఉగ్రవాదులు కూడా శరణార్ధుల రూపంలో అమెరికాకి వెళ్లారు రాజమార్గంలో. ఇప్పుడు అలా జరగకూడదు అనే ఈ ఏర్పాటు. మొత్తం 2 కోట్ల 50 లక్షల ఆఫ్ఘాన్ల వివరాలు ఈ డాటాలో ఉన్నాయి. వీళ్లలో దాదాపు 3 లక్షల మందికి అమెరికాలో ఉద్యోగంతో పాటు అక్కడి పౌరసత్వం ఇస్తామని ఒప్పుకుంటూ ఇచ్చిన అనుమతి పత్రాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కాబూల్ లోని అమెరికన్ రాయబార కార్యాలయంతో పాటు బ్రిటన్ ఎంబసీలో అక్కడి కంప్యూటర్ లలో ఉన్నాయి. మొత్తం డాటా ఎప్పటికప్పుడు అమెరికాలోని సిఐఏ ప్రధాన కార్యాలయ సెర్వెర్స్ లో అప్డేట్ అయి ఉన్నాయి.
afghan news
1. ఆగస్ట్ 14 న తమ ఆఫీసులని ఖాళీ చేసే హడావుడిలో దాదాపు 7 వేల ఐరిస్ స్కానర్లు చోరీకి గురయ్యాయి .అలాగే అక్కడి కంప్యూటర్ లలోని హార్డ్ డిస్క్ లు మాయం అయ్యాయి. అమెరికా, బ్రిటన్ రాయబార కార్యాలయాలలో కాబూల్ స్థానికులు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. హక్కాని నెట్వర్క్ వాళ్ళు వీళ్ళని భయపెట్టి వాళ్ళ చేత దొంగతనంగా స్కానర్లు, HDD లని తెప్పించుకున్నట్లు తెలుస్తున్నది.
2. కొన్ని కంప్యూటర్లు కాబూల్ లోని ఆఫ్ఘన్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసులో ఉన్నాయి. అయితే ఈ ఆఫీసులో ఉన్న సమాచారం కూడా హక్కాని చేతిలోకి వెళ్ళిపోయింది.
3. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న వైర్ సర్వీస్ ప్లాట్ఫామ్ జెంగర్ న్యూస్ [Zenger News ] ఈ వార్తని రిపోర్ట్ చేసింది ఆగస్ట్ 16 న. తాలిబన్లు అల్ ఇషా [Al-Isha] పేరుతో ఒక ప్రత్యేక యూనిట్ ని ఏర్పాటు చేసి బయో మెట్రిక్ డేటాని చేజిక్కించుకొని వాటిని విశ్లేషించడానికి. అయితే వీటి గురించి తెలిసింది కేవలం ISI కి మాత్రమే. ISI చెప్పడం వల్లనే ముందు వీటిని చేజిక్కించుకొని వేట మొదలుపెట్టింది హక్కాని. డేటాని విశ్లేషించడానికి ISI పాకిస్థాన్ నుండి మనుషుల్ని పంపించింది.
4. ఇప్పుడు హాక్కాని కి హోమ్ మంత్రిత్వ శాఖ దొరికింది కాబట్టి బయోమెట్రిక్ డేటాలో ఎవరెవరు అమెరికా, నాటోలతో పాటు భారత ఇంటెలిజెన్స్ అధికారులకి సహకరించారో తెలుసుకోవడానికి ఇంటింటికీ వెళ్ళి ఐరిస్ స్కాన్ చేసి వాళ్ళని హింసించడం లేదా చంపడం లాంటి చర్యలకి దిగబోతున్నది హాక్కానీ.
5. ఇప్పటికే హాక్కానీ తీవ్ర హెచ్చరికలు చేసింది : మా దగ్గర అమెరికాకి ఎవరెవరు సహాయం చేశారో వివరాలున్నాయి. మాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ ప్రాణాలు మా చేతుల్లో ఉన్నాయి. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ… ఆ లిస్ట్ లో కొందరి జర్నలిస్టు ల పేర్లు కూడా ఉన్నాయి. హాక్కానీ మరో దారుణమయిన ప్రకటన చేసింది ఎవరిదగ్గర అయితే అమెరికన్ డాలర్లు బాగా ఉన్నాయో, వాళ్ళు మాకేమీ కాదు అనే భావనలో ఉంటే అది తప్పు. వాళ్ళని కూడా వదిలే ప్రసక్తి లేదు.
6. అల్ ఇషా యూనిట్ గురించి తాలిబన్ నాయకులని ప్రశ్నించగా అసలు అలాంటిది ఏదీ లేదు అని జవాబు వచ్చింది కానీ హాక్కానీ మాత్రం ఖండించలేదు అంటే చాలా రహస్యంగా కొద్ది మందికి మాత్రమే ఈ అల్ ఇషా యూనిట్ గురించి తెలుసు.
7. అల్ ఇషా యూనిట్ లో మొత్తం 2000 మంది ఫైటర్స్ ఉన్నారు. వీళ్ళకి శిక్షణ ఇచ్చింది. ISI అదీ పాకిస్థాన్ లోనె. వీళ్ళకి ప్రధానంగా అమెరికన్, నాటో దళాలని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం, అమెరికన్ , నాటో దళాలకి సహకరిస్తున్న ఆఫ్ఘన్ పౌరులని గుర్తించి చంపడం అనే బాధ్యత అప్పచెప్పింది ISI. ఇప్పుడు బయోమెట్రిక్ డేటా ప్రకారం కీలకమైన ఆఫ్ఘన్ పౌరులని గుర్తించి చంపడం అనే బాధ్యతని అప్పచెప్పింది ISI.
8. ఆఫ్ఘన్ లోని మొత్తం 34 ప్రావిన్స్ లలో అల్ ఇషా మనుషులు విస్తరించి ఉన్నారు. ఖలీల్ హాక్కానీ కింద మూడు గ్రూపులు పనిచేస్తున్నాయి. ఖలీల్ హక్కాని మీద అమెరికా $50 లక్షల డాలర్లు బహుమతి ప్రకటించింది గతంలో. ఖలీల్ హాక్కానీ చనిపోయిన జలాలుద్దీన్ హాక్కానీ తమ్ముడు. జలాలుద్దీన్ హాక్కానీ ఒసామా బిన్ లాడెన్ కి అత్యంత సన్నిహితుడు.
9. రాబోయే రోజుల్లో తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తుంది, అలాగే హక్కాని మీద నిషేధం కూడా ఎత్తివేస్తుంది అమెరికా ! ఈ లోపు మరో అరడజను ట్రాన్స్పోర్ట్ విమానాలని కాబూల్ పంపిస్తుంది మిగిలిన ఆఫ్ఘన్ ప్రజలని ఎయిర్ లిఫ్ట్ చేయడానికి ! ఇప్పటికీ మరో 200 మంది అమెరికన్ పౌరులు కాబూల్ లోనె ఉన్నారు! ముందుగానే RAW కి సహకరించిన వారిని భారత్ కి తీసుకొచ్చింది కాబట్టి ఇందులో రా కి పోయేది ఏమీ లేదు. ఎందుకు అన్నీ వేల మంది అమెరికా వెళ్లిపోవడానికి ప్రాణాలకి తెగించి కాబూల్ ఎయిర్ పోర్ట్ లో పడిగాపులు కాస్తున్నారో అర్ధమవుతున్నదా ? తాలిబాన్ల చేతిలో చచ్చే కంటే అమెరికాలో కూలి పని చేసుకొని బ్రతకవచ్చు అనే ఆశ వాళ్ళది ! ఇంకా లక్షకి పైగానే అమెరికా ఇచ్చిన అనుమతి పత్రాలు ఉన్నవారు కాబూల్ లో ఉన్నారు. ఇలా అమెరికా చేసిన తప్పు పాకిస్థాన్ పాలిట వరం అయి కూర్చున్నది !

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions