Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేవంత్ చెబుతున్నట్టు… ‘కాళ్లే’శ్వరం కోసమేనా హరీష్ ఢిల్లీ రహస్య పర్యటన..?!

April 21, 2026 by M S R

.

జగిత్యాల సభకు హరీష్ రావు డుమ్మా కొట్టి, పొద్దున్నే ఢిల్లీలో తేలడం మీద, ఒక్కసారిగా జనంలో రకరకాల ఊహాగానాలు స్టార్టయ్యాయి కదా… ఇక్కడ రేవంత్ రెడ్డి ఓ పాయింట్ భలే పట్టుకున్నాడు… ఎక్కడ, ఎలాగంటే కాస్త ఎక్కువ వివరాల్లోకి వెళ్దాం…

కేసీయార్ జనంలోకి రీఎంట్రీగా పార్టీ గొప్పగా ప్రచారం చేసుకున్న జగిత్యాల సభకు హాజరు గాకుండా హరీష్ రావు పొద్దున్నే ఢిల్లీ వెళ్లిపోయాడు… వాట్సప్, షార్ట్ న్యూస్ వేదికల మీద ఈ వార్త చదివాక… రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం… హరీష్ రావుకు జీవన్ రెడ్డి రాక ఇష్టం లేదనీ, హరీష్ రావును పార్టీలో సైడ్ చేసేస్తున్నారనీ, తను బీజేపీ నాయకులతో చర్చల కోసం వెళ్లాడనీ, తను బీజేపీలో చేరతాడనీ… రకరకాలుగా…

Ads

దీన్ని కౌంటర్ చేయడానికి బీఆర్ఎస్ క్యాంప్ విఫల ప్రయత్నం చేసింది… హరీష్ రావు కాళేశ్వరం కేసు మీద లాయర్లతో మాట్లాడటానికి ఢిల్లీ వెళ్లాడని చెప్పసాగింది… బుధవారం హైకోర్టులో విచారణ ఉంటే, సోమవారం ఢిల్లీ ఎందుకు వెళ్లినట్టు అని మరో ప్రశ్న మొదలైంది… దీంతో హరీష్ టీమ్ ఓ లాయర్‌ను కలిసిన ఫోటో కూడా రిలీజ్ చేశారు… అంతకుముందు అనేకసార్లు, అనేక విషయాల్లో ఢిల్లీలో లాయర్లను కలవలేదా..? ఒక్కసారైనా ఇలా ఫోటో రిలీజైందా..?

ఇక్కడ రేవంత్ రెడ్డి పట్టుకున్న పాయింట్ ఏమిటంటే..? ఆల్రెడీ వాదనలు, విచారణలు పూర్తయి, జడ్జిమెంట్ రిజర్వయింది కదా, ఇంకా విచారణేముంది, దానిపై ఢిల్లీలో లాయర్లతో చర్చలేమిటి అని..!! అంటే, తన రహస్య పర్యటన కాళేశ్వరం కేసు కోసమే, కానీ లాయర్లతో భేటీకి కాదు, ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుని, కేసు నుంచి రక్షించమని వేడుకోవడం కోసమే అని మరో బాంబు విసిరాడు రేవంత్ రెడ్డి…

  • ఇక్కడ తను వన్ షాట్, సో మెనీ బర్డ్స్ అన్నట్టుగా…. 1) కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తే 24 గంటల్లో అరెస్టు చేస్తామని ప్రగల్భాలు పలికారు కదా, ఏమైంది, ఇప్పటికీ కేసే పెట్టలేదు అని బీజేపీని టార్గెట్ చేయడం, సమాధానం చెప్పుకోలేని స్థితికి నెట్టేయడం… 2) బీజేపీ- బీఆర్ఎస్ రహస్య దోస్తీని ఎక్స్‌పోజ్ చేయడం… 3) కాళేశ్వరం కేసులో తమకు హైకోర్టులో చుక్కెదురు కానుందని బీఆర్ఎస్ భయపడుతోందని చెప్పడం… 4) హరీష్ రావు ఢిల్లీలో ఎవరెవరిని కలిశాడో అన్నీ బయటపెడతాను అనీ మరో బాంబ్ వేశాడు… అంటే హరీష్ రావు కాళేశ్వరం కేసే గాకుండా ఇంకా ‘‘ఏదో ఇతర అంశం’’ మీద రహస్యంగా ఢిల్లీ వెళ్లాడనే భావనను ప్రజల్లోకి వదలడం పరోక్షంగా..!

ఇక్కడ బీఆర్ఎస్ క్యాంప్ చేసిన మరో పొరపాటు ఏమిటంటే..? హరీష్ రావు టీమ్ కాళేశ్వరం కేసులో సుప్రీంకోర్టును అప్రోచయ్యే విషయంలో చర్చించడానికి ఢిల్లీ లాయర్లతో భేటీకి వెళ్లారని చెప్పడం… అంటే, తప్పకుండా హైకోర్టులో తమకు చుక్కెదురు కాబోతోందని ఫిక్సయినట్టేనా..? అవునూ, హరీష్ రావు సంగతి సరే,  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ – జగిత్యాల గైర్హాజరు కథేమిటో…!

‘‘జీవన్ టోన్ (జీవన్ రెడ్డి) తో మస్తు బలం వస్తుందని బీఆర్ఎస్ భ్రమపడుతోంది అని రేవంత్ రెడ్డి విమర్శిస్తే… దానికి కౌంటర్ అన్నట్టుగా కేసీయార్ తన ప్రసంగంలో ‘‘జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్‌కు మస్తు బలం వస్తుందని సర్వేలో తేలింది, తనకు ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తున్నాను’’ అని ప్రకటించాడు… ఎమ్మెల్యేగా ఓడించినా తనను ఎమ్మెల్సీగా గెలిపించారు అన్నాడు, అంటే మెచ్చుకున్నాడా..? దెప్పుతున్నాడా..?




చివరగా… ప్రచారంలో ఉన్నట్టుగా హరీష్ రావు బీజేపీలోకి వెళ్తాడనేదే నిజం అనుకుందాం కాసేపు… మరి అదే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి కదా… అవి ఫలిస్తే మరి హరీష్ రావు సిట్యుయేషన్ ఏమిటి..? లేక హరీష్ రావును కేసీయారే ఓ పొలిటికల్ ఎత్తుగడగా తనే బీజేపీలోకి పంపించే పనిలో ఉన్నాడా..?

లేదు, లేదు, హరీష్ రావు తన దారి తాను చూసుకుంటున్నాడనే అనుకుందాం… మరి బీఆర్ఎస్‌తో పొత్తు కుదిరితే, తనను వదిలేసి వెళ్లాడని హరీష్ రావు మీద కేసీయార్ కోపం ప్రదర్శించాలీ అనుకుంటే… అప్పుడు హరీష్ స్థితేమిటి..? తనకు నచ్చకపోతే సొంత బిడ్డనే పార్టీ నుంచి, కుటుంబం నుంచి తరిమేశాడు… హరీష్ రావు ఎంత..? సో, కేసీయార్ చెబితే హరీష్ రావును బీజేపీ అగాధంలోకి పడేస్తుందా..? ఇన్ని ప్రశ్నలు ఎందుకంటే..?

అన్నాడీఎంకే పళనిస్వామి ఆదేశిస్తే తమిళనాట బీజేపీ అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచే పీకేసింది, చివరకు అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వలేదు… అలాంటిది కేసీయార్ గనుక ఉరిమితే హరీష్ రావు మరో అన్నామలై అయిపోడా..? సో, ‘‘బీజేపీ- హరీష్ రావు’’ కథ అంత వీజీ యవ్వారం అయితే కాదు..!!




 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇక్కడ ఒక్క బొద్దింక కూడా మాట్లాడదు ! ఎందుకో మీకు తెలుసా !?
  • గంజి వంపేద్దాం ! ఇప్పుడు WHO చెప్పిందే మన బామ్మలూ చెప్పారు !!
  • తెలంగాణపై ఇదీ ‘పెద్దన్న’ ప్రేమ ! పెద్ద దొర చెప్పినట్టే అడుగులు !!
  • మళ్లీ హృతిక్ – కంగనా పంచాయితీ – వీళ్ల పాత కథ తెలుసా మీకు !
  • హీరోయిన్ల రెమ్యునరేషన్లలో పాత రికార్డులన్నీ బద్దలు ! ఈమె టాప్ !!
  • ఎవరి తప్పో, ఎవరి పొరపాటో – నవ్వులపాలైంది మాత్రం పత్రికే !!
  • ఆడు జీవితం ! ఇది దుబయ్ వెట్టిచాకిరీ కథ కాదు – మన పంజాబ్‌లోనే !!
  • ఇండియన్ సినిమా మునుపెన్నడూ ఎరుగని అత్యంత భారీ పందెం !!
  • GenZ – ఇది జంతర్‌మంతర్ బ్యాచ్ కాదు – దేశం తలెత్తుకునే టార్చ్ బేరర్స్ !!
  • ‘పొంతన’ కుదరని ‘గుణాలు ! అన్నీ బాగున్నా ఇన్ని విడాకులేమిటి మరి !?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions