సైఖోమ్ మీరాబాయ్ చాను… టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు మొదటి పతకాన్ని… వెయిట్ లిఫ్టింగులో రజతపతాకాన్ని గెలిచి… తొలిరోజే భారతీయ జాతీయ పతాకను సగర్వంగా ఎగరేసింది… అభినందనలు… ఇప్పుడంటే అందరూ ఆహా ఓహో అంటున్నారు గానీ… కొన్నేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో విఫలమైనప్పుడు నానా మాటలూ అన్నారు… సోషల్ మీడియా కూడా విరుచుకుపడింది… వెక్కిరించింది… ఒక దశలో చాను, ఆమె కోచ్ కూడా ఇక ఆటకు ఫుల్ స్టాప్ పెట్టేయాలన్నంతగా ఫ్రస్ట్రేట్ అయిపోయారు… ఇదీ లోకరీతి…!! అందుకే ఆమె లేచిపడిన కెరటం కాదు, పడిలేచిన కెరటం… నిజానికి ఈ మణిపురి అమ్మాయికి ఈ గెలుపు కొత్తేమీ కాదు, ఆమె ఆల్‌రెడీ వరల్డ్ ఛాంపియన్… 2017 లోనే, అమెరికా, అనాహెమ్‌లో జరిగిన పోటీల్లో వరల్డ్ ఛాంపియన్ షిప్ కొట్టింది… అయితే ఒలింపిక్ పతకం అంటే, దాని విలువ వేరు కదా, ఇప్పుడది కూడా ఆమె మెడలో పడింది… పడిలేచిన ఈ కెరటం పక్కుమని నవ్వింది…
చిన్నప్పుడు ఆమె సొంత ఊరు Nongpok Kakching (మణిపూర్)లో పెద్ద పెద్ద కట్టెలమోపులను సోదరుడు ఎత్తడానికి, మోసుకుంటూ ఇంటికి తీసుకురావడానికి నానా యాతనా పడుతుంటే… ఈమె సునాయాసంగా వీపు మీద వేసుకుని అలవోకగా ఇల్లు చేరేది… అప్పటి నుంచే ఆమెకు వెయిట్ లిఫ్టింగ్ మీద ఇష్టం… 2014 కామన్ వెల్త్ గేమ్స్‌లో రజతం పొందినప్పటి నుంచీ రియో ఒలింపిక్స్ దాకా ప్రతి పోటీలోనూ సక్సెస్… రియో తరువాత కొన్నాళ్లు బ్యాక్ పెయిన్… ఐనా ఆమె పట్టుదలగా ప్రాక్టీస్ చేసింది… ఫలితం తను ఆరాధించే శివుడు, హనుమంతుడికి వదిలేసింది… ఇప్పుడీ పతకం కొట్టింది… భారత ప్రభుత్వం కూడా ఆమె ప్రతిభకు మంచి పురస్కారాల్నే ఇచ్చి సత్కరించింది… పద్మశ్రీ ఇచ్చింది, క్రీడల్లో అత్యున్నత అవార్డుగా పరిగణించే రాజీవ్ ఖేల్‌రత్న ఇచ్చింది… నగదు బహుమతులు, రైల్వేలో కొలువు… ప్రతి అడుగులోనూ ప్రభుత్వం ఆమెకు అండగా నిలిచింది… ఈ ఒలింపిక్స్‌లో ఆమె పతకం ఊహించిందే… నిజానికి ఊహించింది బంగారు పతకమే…
Ads
వెయిట్ లిఫ్టింగ్ అనగానే ఇన్నేళ్లూ మనకు వినిపించిన ఏకైక ఇండియన్ ప్లేయర్ పేరు కరణం మల్లీశ్వరి… ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడామె పక్కన ఇలా మరో పేరు జతచేరింది… ‘‘నిజానికి రియో ఒలింపిక్స్‌లో ఫెయిల్యూర్ నాకు చాలా పాఠాలు నేర్పించింది, నేనెక్కడ తప్పులు చేశానో తెలిసొచ్చింది… అవన్నీ దిద్దుకుని, అయిదేళ్లుగా ఈ ఒలింపిక్స్ కోసం ఎదురుచూస్తున్నాను… ఆ అపజయమే ఇప్పుడు ఈ విజయాన్ని అందించింది’’ అంటున్నది ఆమె పాజిటివ్‌గా… ‘‘మీ మణిపూర్‌కు మీరు గర్వకారణం’’ అని ఓ విలేకరి ప్రశంసిస్తే… ‘‘కాదు, ఇది నా ఇండియా గర్వ పతకం’’ అని నవ్వుతూ చూపించింది పతకాన్ని, పతాకాన్ని… గ్రేట్… కీపిటప్ చానూ…!!
Share this Article