సరే, రాహుల్… నీ పరిపక్వత, నీ టీం విజ్ఞత, నీ కోటరీ పరిణతి ఎలా ఉన్నా సరే… సేమ్ శామ్ పిట్రోడాలే కదా అందరూ… నువ్వేమన్నావు..? ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు, బీజేపీకి ఎన్నికల సంఘం పక్షపాత మద్దతు ఉంది, అందుకే ఈ ఫలితాలు, లేకపోతే మోడీ అనేవాడు ఏ 240 దగ్గరో ఆగిపోయేవాడు… ఇదే కదా నీవాదన… అదీ ఏదో విదేశీ గడ్డపై…
సరే, నీకు విజ్ఞత అనేది ఊహించలేని కేరక్టర్… విదేశీ గడ్డపై మాత్రమే గానీ, నీ దిక్కుమాలిన కోటరీ కారణంగా అంగారక గ్రహం వెళ్లినా నువ్వు అవే మాట్లాడతావు… నీకంటూ ఓ సొంత పరిజ్ఞానం ఏడవలేదు కాబట్టి… నువ్వు కూడా ఆ నెహ్రూ ఫ్యామిలీకి వారసుడు అని చచ్చినట్టు ఈ దేశం, ప్రత్యేకించి కాంగ్రెస్ నమ్మి చావాలి కాబట్టి…
నీ జాతీయత ఓ మిస్టరీ… నీ పౌరసత్వం ఓ మిస్టరీ, నీ వైవాహిక స్థితి ఓ మిస్టరీ.., సరే, ఎన్నికల సంఘం బీజేపీకి మద్దతు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించింది సరే… నువ్వు ఉపన్యాసాలు దంచుతున్న ఆ ప్రవాసాంధ్రుల్లో వోటు హక్కు ఉన్నది ఎంతమందికి..? ఆ దంచుడు అక్కడ దేనికి..? ఆమాత్రం ఆలోచించే సోయి లేదెందుకు..?
Ads
అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా తాజా ఆక్రమణలట… వెళ్లు… చేతకాదు… మళ్లీ మణిపూర్ ఘర్షణలట… వెళ్లు… చేతకాదు… వరదలు ముంచెత్తిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించు… చేతకాదు… కనీసం పైసా సాయమూ చేతకాదు… బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతలు, స్పందించు, చేతకాదు… మన ఆర్మీ త్యాగాలు, మన కర్చు, మన సాహసం మాత్రమే కాదు, మీ నానమ్మ ఇందిర అపూర్వమైన తెగువ… ఐనా సరే, ఆ జాతీయులకు కృతజ్ఞత లేదు… నీకేమో ఏదీ విజ్ఞతతో స్పందించే గుణం లేదు, నీ కోటరీకి తెలివి లేదు…
సరే, ఎన్నికల సంఘం ఇష్టారాజ్యం, పక్షపాతం… అంగీకరిద్దాం… మరి బీజేపీవాడికి అంత సీన్ ఉంటే… మోడీకి అంత చేతనైతే… యూపీలో సగం సీట్లు ఎందుకు పోయాయి..? రాజస్థాన్ గతేమిటి..? చివరకు ఆ జంపర్లు, ఏమాత్రం నైతిక ప్రమాణాలు లేని రాజకీయ నేతలు నితిశ్, చంద్రబాబుల మీద ఆధారపడే దురవస్థ దేనికి..? తమిళనాడు, కేరళలో ఎందుకు ఎక్కువ సీట్లు రాలేదు మరి బీజేపికి..? ఆ మమతకూ షాక్ ఇవ్వలేదెందుకు..?
ఎన్నికల సంఘానికి బీజేపీ ఫాయిదాయే ముఖ్యం ఐనప్పుడు ఎవరో దరిద్రుల మీద ఆధారపడే దురవస్థ ఎందుకొచ్చింది అంటావు మరి..? ఒక సిక్కు తన తల పాగా, కాడాను ధరించేందుకు అనుమతిస్తారా? అన్న దానిపై వివాదం ఉందని వ్యాఖ్యానించారు… ఏదీ ఎక్కడ నిరోధించారో, ఎవరు కారకులో ఒక్క ఉదాహరణ చూపించు… అది చేతకాదు… ఓబీసీ, దళితులకు సమాజంలో భాగస్వామ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశావుట… మరి మీ దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఏ సిస్టమ్ డెవలప్ చేసింది..?
‘‘దేశంలో కొన్ని రాష్ట్రాలకంటే కొన్ని రాష్ట్రాలు తక్కువ అని, కొన్ని భాషల కంటే ఇంకొన్ని భాషలు తక్కువ అని.. కొన్ని మతాల కంటే మరికొన్ని మతాలు గొప్పవని ఆరెస్సెస్ చెబుతోంది… తమిళం, మరాఠీ, బెంగాలీ, మణిపురి.. ఇవన్నీ తక్కువ ప్రమాణాలు కలిగిన భాషలని అంటోంది…’’ అంటున్నావు కదా… అవి తక్కువ ప్రమాణాల సంస్కృతులనీ, నాసిరకం భాషలనీ ఆర్ఎస్ఎస్ ఎక్కడ చెప్పింది..? నోటికొచ్చినట్టు కాదు, కాబోయే ప్రధానివి కదా, ఆధారాలు ఏవి..? మరీ శామ్ పిట్రోడాకు మరోరూపంగా మారిపోతే ఎలా..? రాహుల్ గాంధీ నిజంగానే ఎక్కడ ప్రధాని అయిపోతాడేమో అనేదే ఈ దేశానికి పెద్ద కన్సర్న్… రియల్లీ…!!
అన్నింటికన్నా ఘోరమైన వ్యాఖ్య, ఇండియాలో తలపాగా ధరించడానికి ఆంక్షలు, భద్రత లేదనే వ్యాఖ్య… తనకు వీసమెత్తు సోయి లేదనడానికి ఇదే తార్కాణం… ఒక్కటంటే ఒక్క ఉదాహరణ చూపించగలడా..? సిక్కు సంఘాలు దీంతో కినుక చెంది ఏకంగా రాహుల్ గాంధీ ఇంటి ఎదుట నిరసనకు దిగాయి… పిచ్చి కూతలు కూస్తే సహించేది లేదని హెచ్చరించాయి… నిజంగానే రాహుల్ గాంధీకి ఏదో అయ్యింది, ఏదో బాగా తేడా కొడుతోంది… గతంలోకన్నా..!!
Share this Article