నిన్నో మొన్నో ఓ స్టోరీ… కొందరు మరీ ఫస్ట్ పేజీలో వేసుకున్నట్టున్నారు… అదేమిటంటే… ఐటీ ఉద్యోగుల్లో 61 శాతం మందికి హైకొలెస్ట్రాల్ ఉందట, 37 శాతం మందికి ఏదో ఓ దీర్ఘకాలిక రుగ్మత ఉందట… పాతికేళ్లలోపు వారిలో కొవ్వు స్థాయులు అస్తవ్యస్తంగా ఉన్నాయట… 25-40 లోపు ఉన్న 56 వేల మందిపై ఈ అధ్యయనం జరిగిందట… 8 అంశాలపై హెచ్‌సీఎల్ అనే సంస్థ పరీక్షలు జరిపిందట… యాంత్రిక జీవనశైలితో 40 ఏళ్ల లోపే ఇబ్బందులు వస్తున్నాయట… చాలామందిలో సంతానలేమి అట…
గుడ్… ప్రజల ఆరోగ్య స్థితిగతులపై జరిగే ఏ సర్వేనైనా ఆహ్వానిద్దాం… కానీ ఐటీ ఉద్యోగులపైనే ఎందుకు..? నాన్సెన్స్… చాలామంది చిన్న పిల్లల్లో కూడా, స్కూలింగులో ఉన్నవాళ్లకూ గుండెపోట్లు వస్తున్నాయి గమనించారా..? అలాంటివి కదా సర్వే చేసి, కారణాల అన్వేషణ జరగాల్సింది… కరోనా వేక్సిన్లపై చాలామందికి అనుమానాలున్నయ్… వాడెవడో ఏదో దేశంలో 280 వేక్సిన్ డోసులు వేసుకున్నాడట… ప్రపంచమంతా అలుముకున్న భయం తీవ్రత అది… అది కరోనాను మించి ప్రమాదకరం…
మన దేశంలోనూ నాలుగు, ఐదు… కొందరు ఇంకా ఎక్కువగా రకరకాల ఫోన్ నంబర్లతో వేయించుకున్నారు… వాటి దుష్ప్రభావాల మీద అధ్యయనాలు ఏవి..? ఐటీ ఉద్యోగుల ఆరోగ్యస్థితిపై బోలెడు సర్వేలు జరిగాయి, వాళ్ల మీద సోకాల్డ్ ఆరోగ్య నిపుణులు ఇంకా ఇంకా పడుతూనే ఉన్నారు… మరి ఈ సర్వే కొత్తగా ఉద్దరించింది ఏముంది..? ఇది ఫస్ట్ పేజీ వార్త ఎలా అయ్యింది..?
Ads
అసలు రోజూ పని ఒత్తిడితో, అసలు ఏమాత్రం దైహిక వ్యాయామం, శ్రమ లేకుండా ఉద్యోగాలు చేస్తున్న రంగాలు వేరే లేవా..? బోలెడు… అంతెందుకు..? కడుపులో చల్ల కదలకుండా పనిచేసుకోవచ్చునని అందరూ భావించే ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి లేదా..? బీపీ, థైరాయిడ్, సుగర్ వంటివి నిజంగా లైఫ్ స్టయిల్ వ్యాధులేనా..? జనరేషన్‌తోపాటు వేగంగా మారుతున్న ప్రజల బాడీ కాన్‌స్టిట్యూషన్ కారణమా..?
రోజూ పద్ధతిగా యోగా చేస్తూ, ఆర్గానిక్ ఫుడ్ తింటూ, సమయానికి నిద్ర పోతూ, రోజూ అయిదారు లీటర్ల నీళ్లు తాగుతూ, ప్రతి ఆరోగ్య చిట్కాను, జాగ్రత్తను పాటించేవాళ్లలో బోలెడు మంది హఠాత్తుగా కొలాప్స్ అయిన కేసులు ఎన్ని లేవు..? మరి వాటినేమందాం..? ఫుల్లుగా నాన్ వెజ్ లాగిస్తూ, రోజూ ఐదారు పెగ్గులు దట్టించి, రైలింజన్ పొగల్ని వదిలేవాళ్లలో బోలెడు మంది గుండ్రాయిల్లాగా హాయిగా బతికేస్తున్నారు, మరి వాళ్లనేమందాం..?
ఎస్, నిజంగా లైఫ్ స్టయిల్ రుగ్మతలపై శాస్త్రీయ అధ్యయనం అంటే, సమాజంలోని పలు సెక్షన్ల మీద జరగాలి… తద్వారా మన చుట్టూ సమూహం, సమాజం ఆరోగ్యపరంగా ఏ సవాళ్లను ఎదుర్కొంటున్నదో తెలుస్తుంది… పొరపాటున కాస్త బుర్రలో గుజ్జున్న ప్రభుత్వాలు గనుక ఉంటే, పరిష్కారానికి ఏం చేయాలో ఆలోచిస్తుంది… అంతే తప్ప ఒక రంగంలోని ఉద్యోగులంతా ఆరోగ్యపరంగా వేస్ట్ అనే ముద్రలెందుకు..? వాళ్లూ ఈ సొసైటీలో భాగమే… అసలు శారీరక శ్రమ బాగా కనిపించే పల్లెల్లోనూ ఈ రుగ్మతలు ఎందుకు పెరిగాయి..? ప్రత్యేకించి గ్రామీణ మహిళల ఆరోగ్యస్థితి ఎందుకు బాగా దిగజారిపోయింది..? ఎండలో తిరిగే వాళ్లకూ డీ విటమన్ లోపం ఎందుకొస్తోంది..? ఇలాంటివి ఎన్ని లేవు అధ్యయనానికి..?
ఆమధ్య మరో సర్వే… పునరుత్పత్తి రేటు బాగా పడిపోయిందని..! దాంతో అంగస్థంభన సమస్యలతో యువత బేజారైపోతుందని ఒకడు రాస్తాడు… ఎస్, ఆ సమస్య కూడా ఉండొచ్చు, స్పెరమ్ రేటు పడిపోతూ ఉండవచ్చు… కానీ అవే కారణాలు కావు… మహిళల్లో అబార్షన్లు, లేట్ కన్సీవింగ్ కారణాంగా మిస్ క్యారేజీలు, ఓ వయస్సు దాటాక పడిపోయే పునరుత్పత్తి సామర్థ్యం, చాలా లేట్ పెళ్లిళ్లు, ఒకరు చాలు అనుకునే ధోరణి, పెరిగిన జీవనవ్యయాలతో చైనా వంటి దేశాల్లో అసలు పెళ్లి, సంతానం పట్ల విముఖత… అనేక కారణాలున్నయ్… సో, ఆరోగ్య సర్వేలను కేవలం ఒకటీరెండు రంగాలకు వర్తింపజేయడం కూడా ఓ అనారోగ్యమే… హెచ్‌సీఎల్ ఏ ప్రయోజనం కోసం ఈ సర్వే చేయించిందో నాకు తెలియదు..! ఈ సబ్జెక్టు నిజానికి మూడునాలుగు పేరాలతో ఒడిశేది కాదు… చాలా విస్తృతమైన సబ్జెక్టు… సో, ఇక్కడ ఆపేద్దాం…
Share this Article