నిజానికి అది ఫిల్మ్ ఫెస్టివల్… ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో జరిగే ఈ ఫెస్టివల్‌ను ప్రపంచ సినిమా ఓ ప్రిస్టేజియస్ ఈవెంట్‌గా గుర్తిస్తుంది… ఇక్కడ ప్రదర్శించే చిత్రాలకు అంతర్జాతీయ గుర్తింపు… డాక్యుమెంటరీలు, ఫీచర్ ఫిల్మ్స్ ఈ ఈవెంట్‌లో ప్రదర్శనకు ఎంపికైతేనే ఓ గౌరవంగా భావిస్తారు…
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా సెలబ్రిటీలు హాజరవుతారు… ప్రత్యేకించి ఫిమేల్ స్టార్స్ దీన్ని ఫ్యాషన్ పరేడ్ చేసేశారు కొన్నేళ్లుగా… కొత్త కొత్త ఫ్యాషన్ దుస్తుల్ని కోట్ల ఖర్చుతో తయారు చేయించుకుని రెడ్ కార్పెట్ మీద నడుస్తారు… మీడియాలో పేజ్‌త్రీ బాపతు కేరక్టర్లు ఉంటాయి కదా… ఎంతసేపూ ఆ దుస్తులెలా ఉన్నయ్, లుక్కు ఎలా ఉంది వంటివి విశ్లేషిస్తారు…
సరే, ఫ్యాషన్ ప్రపంచం పూర్తిగా మరో ప్రపంచం… ఈసారి కేన్స్‌లో మన శ్యామ్ బెనెగల్ అప్పట్లో అమూల్ పాలప్రస్థానం మీద నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ సినిమా మంథన్‌ను ప్రదర్శిస్తారు, గుడ్, అదొక విశేషం,.. స్మితాపాటిల్ మరుపురాని సినిమాల్లో ఇదొకటి… మంచు కన్నప్ప టీజరో, ట్రెయిలరో ప్రదర్శిస్తారనీ చదివినట్టు గుర్తు…
Ads
ఈసారి రెండు భారతీయ సినిమాలు పోటీలో ఉంటున్నాయి… రాధికా ఆప్టే ప్రధాన పాత్రధారిగా చేసిన ‘సిస్టర్ మిడ్‌నైట్’ సినిమా డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ విభాగంలో ప్రదర్శించబడుతుంది… కోటి ఆశలతో కొత్త కాపురంలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయి అనుకోని సమస్యల్లో ఇరుక్కొని.. దానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఏం చేసిందో ఇందులో చూపించారు… కాస్త కామెడీ, కాస్త రొమాన్స్… నిర్మాణంలో కూడా రాధిక భాగస్వామి…
మరొకటి ‘తార’… హిమాలయ పర్వత సానువులు, సిక్కిం రాష్ట్రంలోని ప్రజల సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ సోషల్ డ్రామాని తెరకెక్కించారు… సినిమాలో అందరూ స్థానిక నటీనటులే… ఇవీ ఈసారి ఇండియాకు సంబంధించిన విశేషాలు… కాగా అసలు విశేషం ఐశ్వర్యారాయ్ లుక్కు…
అదేదో ఫ్లోర్ ఊడ్చే పిచ్చి గౌను… పైగా చేయి విరిగింది కదా, అదే కట్టుతో కార్పెట్ మీద క్యాట్ వాక్ చేసింది… అబ్బో, ఎంత ప్రొఫెషనలిజం అని చాలా సైట్లు ఊదరగొట్టాయి… ఆమె డ్రెస్ ఎలా హ్యాండిలింగ్ చేయాలో కూతురు ఆరాధ్య సూచనలు ఇచ్చిందని కూడా రాసిపారేశారు కొందరు… ఏం, విరిగిన చేయితో ఈసారి వెళ్లకపోతే ఏం పోయింది అంటారా..? 21 సార్లు వరుసగా ప్రతి ఏడాదీ వెళ్తున్నదట… మరి ఆనవాయితీ, సంప్రదాయం బ్రేక్ కావా ఏం..? కానీ చాలామంది పెదవి విరిచారు… ఆమె ఎన్నిసార్లు నిరాశపరిచిందో కూడా కొందరు రాసుకొచ్చారు, ఆమె ఈసారి అవాయిడ్ చేయాల్సింది…
దీనికన్నా మించిన మరో విమర్శ… ఆమె మొహం మీద ట్రోలింగ్… చాలా తేడా కనిపిస్తోంది… తనెవరో సినిమా క్రిటిక్ ఉన్నాడు కదా, ఉమైర్ సంధూ అని… ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది, చెత్తగా మారింది మొహం అనేశాడు… చాలామంది బొటాక్స్ ఫెయిల్డ్ అని ట్రోల్ చేశారు… సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈసారి ఆకర్షించింది నీహారిక… అఫ్‌కోర్స్, ఆ ట్రాన్స్‌పరెంట్ డ్రెసు కాస్త ఇబ్బందికరంగా ఉంది కానీ…
ఇండియన్ యూట్యూబ్ టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్లలో ఒకరు… చిన్నగా యూట్యూబ్ వీడియోలు చేయడం స్టార్ట్ చేసి, తన మాటలు, తను తీసుకునే పాయింట్లు, సరదా వ్యాఖ్యానాలతో ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఎక్స్ తదితర సోషల్ వేదికల్లో ఎక్కడికో వెళ్లిపోయింది… పలు సినిమాలకూ ప్రమోషన్ వీడియోలు చేసింది, సూపర్ హిట్… బిగ్ మౌత్ అనే నెట్‌ఫ్లిక్స్ సినిమాలో ఓ అతిథి పాత్రతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది… మొత్తం హాలీవుడ్ మీదే కాన్సంట్రేట్ చేస్తోంది… కేన్స్ షోలో ఆమె క్యాట్ వాక్ ఇది మూడోసారి బహుశా… ఇంట్రస్టింగు ఎదుగుదల…!!
Share this Article