Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రియాంక, మాయావతి కూలిపోయినచోట… ఈమె రెండు సిక్సర్లు కొట్టింది…

March 11, 2022 by M S R

ఈమె గురించి ఓసారి చదవాలి… ఒక మహిళ నేత, యూపీ ఎన్నికల్లో ది గ్రేట్ ప్రియాంక గాంధీ ఎన్ని సీట్లు గెలిచింది..? జస్ట్, రెండు..! 136 సంవత్సరాల పార్టీ, దేశాన్ని ఏళ్లపాటు పాలించిన పార్టీ దురవస్థ అది… సరే, దాన్ని కాసేపు వదిలేయండి… మరో మహిళ… బీఎస్పీ మాయావతి… ఒకప్పుడు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి… అవకాశం దొరికితే తనూ ప్రధాని కావాలనేంత ఆశలుండేవి… ఆమె గెలిచిన సీట్లు ఎన్ని..? జస్ట్, ఒకటి..! ఇక్కడే ఇంకో మహిళ గురించి చెప్పాలి… ఆమె పేరు అనుప్రియ పటేల్…

ఆమె పార్టీ అప్నాదళ్ (సోనేలాల్)… ప్రస్తుతం కేంద్ర మంత్రి… ఎన్డీయేలో భాగస్వామి… ఆమె గెలిచిన సీట్లు తెలుసా..? 12… ఓ చిన్న పార్టీ… కాదు, కాదు… యూపీ అసెంబ్లీలో ఇప్పుడు బీజేపీ, ఎస్పీ తరువాత పెద్ద పార్టీ ఆమెదే… ఆశ్చర్యపోకండి… మజ్లిస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, లోకజనశక్తి, ఫార్వర్డ్ బ్లాక్, ముస్లింలీగ్, ఎన్సీపీ, జేడీయు తదితర పార్టీలు కొట్టుకుపోయినచోట… 18 సీట్లలో పోటీచేసిన ఈమెకు 12 సీట్ల గెలుపు ఖచ్చితంగా ఓ విశేషమే… అందుకే ఓసారి ఆమె పార్టీ కథ ఓసారి చదవాలి… ‘ముచ్చట’ గత జూలైలో ప్రచురించిన ప్రొఫైల్ ఇదుగో….

అనుప్రియ

Ads




రాజకీయాల్లో అన్నీ బాగుంటేనే… కొడుకు, బిడ్డ, అల్లుడు, బావమరిది ఎట్సెట్రా కుటుంబగణమంతా సుహృద్భావంతో కలిసిమెలిసి సాగుతూ అన్నీ దండుకుంటారు… ఎక్కడ తేడా వచ్చినా సరే, ఇక తమ్ముడు లేదు, బిడ్డ లేదు, బంధుగణం లేదు… తన్నుకోవడమే… అంతపుర కుట్రలుంటయ్, వెన్నుపోట్లు ఉంటయ్, కూలదోయడాలు, బొందపెట్టడాలూ ఉంటయ్… కులపార్టీలు, కుటుంబపార్టీలు అయితే ఈ జాడ్యాలు మరీ ఎక్కువ…

ప్రతి ఒక్కడూ తమ పార్టీల్లో తమ కుటుంబసభ్యుల నీడను చూసి కూడా భయపడాల్సిందే… మన దేశంలో పార్టీల యవ్వారాన్ని అర్థం చేసుకోవడానికి ఓ చిన్న పార్టీ కథ, ఆ పార్టీ ఓనర్ ఫ్యామిలీ కథ ఓసారి చదవాలి… ఉదాహరణ కోసం అన్నమాట… ఈ పార్టీ పేరు అప్నాదళ్… ఎహె, సవాలక్ష పార్టీలున్నయ్ దేశంలో, ఈ సోది పార్టీ గురించి మాకెందుకు అని తీసిపారేయకండి… ఇదొక ఇంట్రస్టింగు స్టోరీ… జాగ్రత్తగా చదవండి…

anupriya patel

పాతికేళ్ల క్రితం సోనేలాల్ పటేల్ అనే పెద్దమనిషి అప్నాదళ్ అని ఓ పార్టీ పెట్టాడు… ఉత్తరప్రదేశ్ రాష్ట్రం… కుర్మి కులస్థుడు… పలు ప్రాంతాల్లో ఈ సామాజికవర్గానికి బలముంది… సామాజికంగా ప్రభావం చూపించే కులమే… (ఈయన వాజపేయి అభిమాని, బీఎస్పీకి పోటీగా కావాలనే ఈ పార్టీని బీజేపీ పెట్టించింది అనే ప్రచారం కూడా ఉంది…) సోనేలాల్ పోటీలు చేస్తూనే ఉండేవాడు, ఓడిపోతూ ఉండేవాడు… ఒకే ఒక్కసారి మాఫియా డాన్ కమ్ పొలిటిషియన్ అతీక్ అహ్మద్ గెలిచాడు, అంతే… వేరే ఏ విజయాలూ లేవు…

ఈలోపు ఆయన పెద్ద కూతురు అనుప్రియ బాగా చదువుకుని, తండ్రికి చేదోడువాదోడుగా ఉండసాగింది… సైకాలజీలో మాస్టర్స్ చదివింది.., ఎంబీఏ కూడా చేసింది… టీచర్, ఫెమినిజం, సోషల్ జస్టిస్ కోణాల్లో యాక్టివిస్ట్… పార్టీ వ్యవహారాలన్నీ తన గుప్పిట్లోనే ఉండేవి… తండ్రి 2009లో ఏదో యాక్సిడెంటులో చనిపోయాడు… సందేహాస్పద మరణమే అంటారు మరి… తండ్రి మరణం తరువాత సరిగ్గా 20 రోజుల్లో ఆమె పెళ్లి చేసుకుంది… భర్త పేరు ఆశిష్ సింగ్ పటేల్… ఇద్దరూ తెలివైన వాళ్లే…

anupriya1

అనుప్రియ పార్టీ అధ్యక్షురాలిగా తల్లి కృష్ణసింగ్‌ను పెట్టి, పార్టీ వ్యవహారాలు తను చూసుకోసాగింది… వారణాసి దగ్గరలో రోహనియా అనే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని, 2012 లో, పీస్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఓ ముస్లిం పార్టీ సాయం తీసుకుంది, గెలిచింది… తరువాత 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, ఎన్‌డీయేలో చేరింది… మిర్జాపూర్ లోకసభ స్థానం నుంచి అనుప్రియ తనే పోటీచేసింది… బీజేపీ హవాలో గెలిచింది…

కానీ అప్పటికే తల్లికి, చెల్లెకు ఈమె పెత్తనం, ఆధిపత్యం మీద గుర్రుగా ఉంది… ఇంట్లో గొడవలు… ఈలోపు తను రాజీనామా చేసిన అసెంబ్లీ సీటు మరో చిచ్చుపెట్టింది… అక్కడ ఉపఎన్నికలో భర్త ఆశిష్‌ను నిలబెట్టాలని అనుప్రియ ప్లాన్… అల్లుడిని కాదని, అనుప్రియ తల్లి, అంటే ఆశిష్ అత్తగారు, పార్టీ అధ్యక్షురాలి హోదాలో నిర్ణయం తీసుకుని తనే సొంతంగా నిలబడింది… వేరే ఎవరిని నిలబెట్టినా అనుప్రియ కుట్ర చేసి ఓడిస్తుందనే భావనతో తనే పోటీచేసింది…

anupriya

రాజకీయాల్లో అవ్వేంది, బిడ్డేంది, అల్లుడేంది..? అనుప్రియ తల్లి ఓడిపోయేలా చేసింది… దీంతో తల్లికి కోపమొచ్చి బిడ్డను, అల్లుడిని, మరికొందరు ముఖ్యుల్ని పార్టీ నుంచి బహిష్కరించింది… ఓసోస్ అని తేలికగా తీసుకున్న అనుప్రియ అప్నాదళ్ (సోనేలాల్) అని కొత్త పార్టీని స్టార్ట్ చేసింది… బీజేపీతో దోస్తీ అలాగే ఉంది, కేంద్రంలో కొన్నాళ్లు మంత్రిగా కూడా చేసింది… ఇక 2019 ఎన్నికల్లో ఆమె దశ తిరిగింది… మిర్జాపూర్, ప్రతాప్‌గఢ్ ఎంపీ సీట్లలో పోటీ చేసింది, రెండూ గెలిచారు… గత ఎన్నికల్లో యూపీ అసెంబ్లీలో 11 పోటీచేసి, ఏకంగా 9 సీట్లు గెలిచారు… మండలిలో ఒక సీటు ఉంది… యూపీ పాలిటిక్స్‌లో అందరూ చాలా లైట్ తీసుకున్న ఓ చిన్న కుటుంబపార్టీ ఇప్పటి స్థితి ఏమిటో తెలుసా..?…

అసలు విషయం చెప్పుకుందాం… మొన్నటి ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ గెలుచుకున్న ఎమ్మెల్యే సీట్లు కేవలం ఏడు… ఇప్పుడు రెండు… మాయవతి పార్టీకి దక్కింది ఒకే ఒక సీటు… కానీ ఈ చిన్న పార్టీ గెలుచుకున్నవి ఏకంగా 12… ఇదీ మన రాజకీయాల్లోని వైచిత్రి… ఇప్పుడు ఈ పార్టీ కథ, ఈమె కథ పునశ్చరణ దేనికీ అంటారా..? మోడీ ఆమధ్య కేబినెట్ విస్తరించాడు కదా… ఈమెకూ చాన్స్ దక్కింది… ఇప్పుడు ఆమె వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి… ఈ ఎన్నికల్లో ఆమెకు 12 సీట్లు దక్కగా బీజేపీ, ఎస్పీ తరువాత ఆమెదే యూపీలో పెద్ద పార్టీ…!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions