Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కమర్షియల్ యాడ్..! కానీ ఆమె అందమైన ఆ చిరునవ్వు గుర్తుచేస్తూ..!

May 25, 2026 by M S R

.

టూత్‌పేస్ట్ యాడ్ అనగానే గుర్తొచ్చేవి… అందమైన పళ్లవరుసలు… దుర్వాసనను నిర్మూలిస్తుందనే భరోసాలు… దంత సౌభాగ్యాలు, దంత దృఢత్వాల గురించి క్లాస్ పీకుతాయి… లేదా మీ టూత్ పేస్టులో ఉప్పుందా, బొగ్గుందా అని అదరగొడుతూ ప్రశ్నిస్తుంటాయి… కొన్ని ఆయుర్వేదాన్ని, భారతీయ సంప్రదాయ మూలికలను చూపించి, ఓ మెడికల్ లుక్ కూడా ఇస్తాయి… కానీ ఓ కోల్‌గేట్ యాడ్ భిన్నంగా… జ్ఞాపకాలు, ఉద్వేగాలతో కూడి ఇంట్రస్టింగుగా ఉంది…

కోల్‌గేట్ రూపొందించిన ఒక సరికొత్త ప్రకటన, నటుడు ప్రతీక్ బబ్బర్ (స్మితా పాటిల్ కుమారుడు) జీవిత విశేషాలతో ఓ మామూలు వాణిజ్య ప్రకటనలాగా గాకుండా… అతని బాల్యపు జ్ఞాపకాల గుండా సాగిపోయే ఒక ‘వీడియో వ్యాసం’ (video essay) అనిపిస్తుంది… ఈ ప్రకటన 90 ల నాటి ఒక పాత టీవీ సెట్‌పై స్మితా పాటిల్ ఐకానిక్ చిరునవ్వుతో ప్రారంభమవుతుంది… దానిపై “బాలీవుడ్‌లోనే అత్యంత అందమైన చిరునవ్వులలో స్మితా పాటిల్ ది ఒకటి” అనే అక్షరాలు కనిపిస్తాయి…

Ads

కోల్‌గేట్ వారి “ది బాయ్ హూ లెర్న్ట్ టు స్మైల్” (నవ్వడం నేర్చుకున్న అబ్బాయి) అనే ఈ ప్రకటన, స్మితా పాటిల్ పై భారతదేశానికి ఉన్న nostalgia మాత్రమే కాదు, ఆమె కొడుకు ప్రతీక్‌ జ్ఞాపకాలను కూడా మనకు చూపిస్తుంది… ఈ రెండు నిమిషాల వీడియోలో ప్రతీక్ చెప్పే మొదటి డైలాగ్ చాలా హృద్యంగా ఉంటుంది… ఒక ఎక్స్‌ట్రీమ్ క్లోజప్ షాట్‌లో అతను – “నాకు జన్మనిస్తూనే ఆమె చనిపోయింది” అని చెప్తాడు…

జ్ఞాపకాల పందిరిలో ప్రతీక్ …. కేవలం తన తల్లి ఫోటోలు, ఆమె చిరునవ్వు జ్ఞాపకాలతోనే తను ఎలా పెరిగాడో ప్రతీక్ పంచుకుంటాడు…. స్మితా పాటిల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో నిండిన ఒక ఇంట్లో కెమెరా అతన్ని చూపిస్తున్నప్పుడు… అతని ముఖంలో బాధ, తపన, నిరాశ, ఆనందం వంటి ఎన్నో హావభావాలు కనిపిస్తాయి…

‘ఓగిల్వీ ఇండియా’ (Ogilvy India) నిర్మించిన, అమిత్ మిశ్రా దర్శకత్వం వహించిన ఈ ప్రకటనలో… ప్రతీక్ థియేటర్ స్క్రీన్‌పై తన తల్లిని చూస్తుంటాడు… ఇది అతనికి ఒక వ్యక్తిగత అనుభవం అయితే, స్మితా పాటిల్‌ను ఆరాధిస్తూ పెరిగిన తరానికి ఇదొక మధురమైన జ్ఞాపకం…

తాను చిన్నప్పుడు ఎలా నవ్వేవాడో చూపిస్తూ, “ఆమెలాగే నవ్వమని” తన తాత (అమ్మ తరుపు తండ్రి) ఎలా అడిగేవారో ప్రతీక్ గుర్తు చేసుకుంటాడు… “నా నరనరాల్లో ఆమె రక్తమే ప్రవహిస్తోంది నిజమే, కానీ నేను ఆ స్త్రీని ఎప్పుడూ చూడలేదు, తెలుసా” అంటాడు…

తర్వాత, తాను “నిజంగా నవ్వడం నేర్చుకున్న రోజు” గురించి ప్రేక్షకులను తీసుకెళ్తాడు… అది అతని మొదటి సినిమా ‘ఏక్ దీవానా థా’ (2012) విడుదలైన తర్వాత. ఆ సినిమా రివ్యూల హెడ్‌లైన్స్ స్క్రీన్‌పై కనిపిస్తూ, ప్రతీక్‌ను అతని తల్లితో పోలుస్తాయి…

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతీక్ ఎక్కడా బ్రాండ్ పేరు (కోల్‌గేట్) ఎత్తడు… కానీ దానికి బదులుగా, పళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలనే కోల్‌గేట్ ముఖ్య సందేశాన్ని పరోక్షంగా చెప్తాడు… చివరగా, స్మితా పాటిల్ ఫోటో పక్కన టూత్‌పేస్ట్ బాక్స్ కనిపిస్తుంది…

ప్రతీక్ ఇలా అంటాడు… “నేను ఒకటి చెప్పనా..? అమ్మది నిజంగానే చాలా అద్భుతమైన చిరునవ్వు… దాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి…”

స్మిత

సైన్స్ కంటే కథనానికే ప్రాధాన్యత … ఈ ప్రకటన బ్రాండ్ ప్రత్యేకతలను (USP) అతిగా ప్రదర్శించడానికి బదులుగా, జ్ఞాపకాలను, భావోద్వేగాలను ఉపయోగించి ప్రేక్షకులను బ్రాండ్‌తో కనెక్ట్ చేస్తుంది…

తెల్లటి ల్యాబ్ కోట్లు వేసుకుని, “క్యా ఆప్కే టూత్‌పేస్ట్ మే నమక్ హై?” (మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పు ఉందా?) అని అడిగే మిగతా కోల్‌గేట్ ప్రకటనలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా నిలుస్తుంది… ఇక్కడ వారు సైన్స్ కంటే కథనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు… ప్రతీక్ మాటల ద్వారా, స్మితా పాటిల్ ఇక లేరు అనే భావన పోయి, ఆమె ఆ జ్ఞాపకాల్లో ఇంకా బతికే ఉన్నట్లు అనిపిస్తుంది…

ఇలాంటి ప్రకటనలు వస్తువులను అమ్మడం కంటే, బ్రాండ్ ఇమేజ్‌ పెంచడానికి ఉపయోగపడతాయి… అందుకే, టూత్‌పేస్ట్ గురించి తక్కువగా మాట్లాడి…. కథల ద్వారా, ఫోటోల ద్వారా, మిగిలిపోయిన మనుషుల ద్వారా ఒక చిరునవ్వు ఎలా అమరత్వాన్ని పొందుతుందో చూపించడమే ఈ ప్రకటన విజయం…

గతాన్ని గుర్తుచేసే కథనాలు (Nostalgic storytelling) ప్రకటనల్లో తరచూ వాడే వ్యూహమే అయినప్పటికీ, అన్ని సార్లు అది సరిగ్గా కుదరదు… కానీ ప్రతీక్ కథ ఇక్కడ బాగా వర్కవుట్ అయ్యింది… ఎందుకంటే ఇది కేవలం స్మితా పాటిల్‌ను గుర్తుపెట్టుకున్న వారికే కాకుండా, తమకు ప్రియమైన వారిని కోల్పోయిన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది…

గతం ఎప్పుడూ బాధాకరంగానే ఉండక్కర్లేదు! … నోస్టాల్జియా (గత స్మృతులు) ఎప్పుడూ బాధతోనే కూడి ఉండాల్సిన అవసరం లేదు… దానికి కొన్ని ఉదాహరణలు…

మెక్‌డొనాల్డ్స్ (McDonald’s)…: 2011 లో సారా అర్జున్‌తో కలిసి తమ ‘మెక్ ఆలూ టిక్కి’ ప్రకటనను రూపొందించారు…. ‘ధురందర్’ సినిమా తర్వాత ఆమె పాపులారిటీ విపరీతంగా పెరగడంతో, 2026 లో సరికొత్త ‘బడ్డీ మీల్’ కోసం అదే ప్రకటనను మళ్లీ రీ-క్రియేట్ చేశారు… ఫ్రేమ్, లొకేషన్, వైబ్ అన్నీ అలాగే ఉంటాయి… కేవలం పాత్రలు మాత్రమే పెద్దవయ్యాయి… కానీ మెక్‌డొనాల్డ్స్ స్లోగన్ మాత్రం మారలేదు – “ఐ యామ్ లవింగ్ ఇట్”…

కోకాకోలా ఇండియా (Coca-Cola India)…: 80ల నాటి ఫేవరెట్ ‘రిమ్‌జిమ్ సోడా’ను ఆర్‌.డి. బర్మన్ ఐకానిక్ సాంగ్ “దునియా మే లోగో కో” బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మళ్లీ మార్కెట్లోకి తెచ్చింది… ఇక్కడ ప్రొడక్ట్, ప్రకటన రెండూ కూడా గత కాలపు జ్ఞాపకాలతో నిండినవే…

గతాన్ని గుర్తుచేసే ఇటువంటి ప్రకటనలు వర్తమానానికి, గతానికి ఉన్న గీతలను చెరిపేస్తాయి… ఒక బ్రాండ్ తన వినియోగదారుల జ్ఞాపకాల్లో ఎంత నమ్మకంగా, ఎప్పటికీ నిలిచిపోతుందో చూపించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు…!!  (సౌజన్యం :: ThePrint) 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కమర్షియల్ యాడ్..! కానీ ఆమె అందమైన ఆ చిరునవ్వు గుర్తుచేస్తూ..!
  • చరిత్రాత్మక ఢిల్లీ జింఖానా క్లబ్‌ ఇక చరిత్ర పుటల్లోకి..?
  • పెళ్లితో కెరీర్ క్లోజ్ అనేది పాతమాట… దాన్ని బ్రేక్ చేసిన డిఫరెంట్ జంట…!
  • నాడు మంజులను రానివ్వలేదు… నేడు మంజుల బిడ్డ ఎంట్రీకి రెడీ…
  • System … సినిమా ముగిసినా… డైలాగులు వెంటాడుతూనే ఉంటయ్…
  • ఎప్‌స్టీన్ రహస్యాలకు ఈమే కీలకం… నాడియా మార్సింకో!
  • బావల్లేని మరదళ్లు… మరదళ్లు లేని బావలు… ఉత్తములు- గుణవంతులు…
  • నా వాచాలత్వం జీడి పప్పు… మీ వక్తృత్వం జిల్లేడు పప్పు…
  • IPL-2026 …. ప్లేఆఫ్‌లోకి రాజస్థాన్…! పంజాబ్ కల మళ్లీ భగ్నం..!
  • డ్రగ్స్ మత్తు దిగింది సరే… ఆ ‘థార్ పోరగాళ్ల’ డబ్బు బలుపు దిగేదెలా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions