.
ముగ్గురు వారసుల మీద చర్చ సాగుతోంది… మరీ శ్రీకాంత్ షిండే పేరు మీద బహుళ చర్చ ఇప్పుడు…
ఎవరతను..? మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షిండే కొడుకు… నేను ముఖ్యమంత్రి గాకపోతే తన కొడుక్కి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది షిండే డిమాండ్…
Ads
చేస్తే సీఎంగా చేస్తా, లేదంటే ఊరుకుంటా అంటాడు తను… ఈ జూనియర్ షిండే వయస్సు ఇప్పటికి 37 ఏళ్లు… 2014లో మొదటిసారి ఎంపీగా కల్యాణ్ స్థానం నుంచి పోటీచేసినప్పుడు తను ఇంకా ఆర్థోపిడిక్స్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు, ఫైనలియర్ స్టూడెంట్…
మొదట ఎన్సీపీ మీద గెలిచాడు… మళ్లీ 2019లో అదే సీటు నుంచి అదే ఎన్సీపీ మీద… మొన్న 2024లో కూడా ఠాక్రే శివసేన మీద గెలిచాడు… కల్యాణ్ శివసేనకు పెట్టనికోట…
2014 లో గెలిచినప్పుడు అత్యంత చిన్న వయస్సులో పార్లమెంటుకు ఎన్నికైన మరాఠా బిడ్డ తను… మొన్నటి ఎన్నికల్లో గెలిచాక నిజానికి తనకు కేంద్ర మంత్రి పదవిని ఎన్డీయే కూటమి ఆఫర్ చేసింది… ఇప్పుడు తను డిప్యూటీ సీఎం అవతాననే ఊహాగానాల్ని శ్రీకాంత్ ఖండించాడు… కానీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు…
షిండే తన కొడుకు వారసత్వం మీద ఇంత త్వరపడుతూ ఉంటే… ఠాక్రే సిట్యుయేషన్ కూడా అదే… తన కొడుకు పేరు ఆదిత్య ఠాక్రే… తన వయస్సు ఇంకా తక్కువ… 34 ఏళ్లు మాత్రమే… బీజేపీతో దోస్తీ దెబ్బతిన్నాక మహావికాస్ అఘాడి కూటమి తరఫున తన కొడుకును సీఎంను చేయాలని ఠాక్రే భార్య రష్మి పట్టుపట్టిందని అప్పట్లో వార్తలొచ్చాయి…
కానీ ఎన్సీపీ, కాంగ్రెస్ ఒప్పుకోలేదు… చివరకు రాష్ట్ర కేబినెట్‌లోనే ఓ మంత్రి పదవి ఇచ్చారు తనకు… తను డిగ్రీ చేశాక ఎల్ఎల్‌బీ చదివాడు… ఈసారి గనుక ఠాక్రే శివసేనకు ఎక్కువ సంఖ్యలో సీట్టు వచ్చి, ఆ కూటమి అధికారంలోకి వచ్చే సిట్యుయేషన్ ఏర్పడి ఉంటే కథ ఎలా ఉండేదో… మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాల్లో అటు శ్రీకాంత్, ఇటు ఆదిత్య చక్రాలు తిప్పబోతున్నారు…
వీళ్లకన్నా ఉదయనిధి స్టాలిన్ కాస్త నయం… తన వయస్సు 47 ఏళ్లు… తనకూ పొలిటికల్ యాంబిషన్స్ విపరీతం… స్టాలిన్ కూడా కొడుక్కి పగ్గాలు అప్పగించే దశ కోసం ఆరాటపడుతున్నాడు… డిప్యూటీ సీఎంను చేసేశాడు… తన అపారమైన సిరిసంపదలకు, వ్యాపార సామ్రాజ్యానికి, తన పార్టీ డీఎంకేకు ఉదయనిధే వారసుడు అని స్పష్టంగా చెబుతున్నాడు…
కరుణానిధి కుటుంబంలో ఇంకెవరూ ఏ ఆశలూ పెంచుకోవద్దనే సంకేతం అది… అసలు వీళ్ల అనుభవం ఎంత..? పరిణతి ఎంత..? వాళ్ల పాలన సామర్థ్యం ఎంత..? అనే ప్రశ్నలు భారత రాజకీయాల్లో పనికిరావు… కుర్చీలో కూర్చోబెడితే అదే అన్నీ నేర్పిస్తుంది అంటారు తల్లులు, తండ్రులు… ఎగువన ఆ కాశ్మీర్ నుంచి దిగువన తమిళనాడు దాకా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని ప్రాంతీయ, కుటుంబ పార్టీల్లోనూ ఇదే తంతు కదా..!!
ఇక్కడ మరో కేరక్టర్ గురించి ఓసారి చదువుకోవాలి… అదే ఆదిత్య సోదరుడి గురించి… ఇదీ లింకు…
పులి వారసుడే…! కానీ ప్రాణమంతా బల్లులు, పాములు, చేపలు పీతలు, సాలీడులు…
Share this Article