Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వైట్ అండ్ వైట్… ఫ్యాషన్, లుక్కు జానేదేవ్… నా స్టయిల్ నాది… యూనిక్…

January 2, 2023 by M S R

నిజానికి హీరో అజిత్‌ను చూస్తే అప్పుడప్పుడూ ఆశ్చర్యం కలుగుతుంది… ప్రత్యేకించి తన లుక్కు… మిగతా హీరోలు జుత్తుకు ఎడాపెడా నల్లరంగు పూసేసి, కవర్ చేసేసి, మెయింటెయిన్ చేయడానికి నానా అవస్థలూ పడుతుంటారు… ఇప్పుడు మరీ ఎర్లీ ఏజులోనే రంగు తెల్లవారడం, తెల్లబారడం స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి కుర్ర హీరోలకూ తప్పడం లేదు ఫాఫం…

కానీ అజిత్ మాత్రం అదేమీ పట్టించుకోడు… సహజంగా ఎలా పెరిగితే, ఎలా కనిపిస్తే అలా… అంతే… నో బ్లాకింగ్, నో కవరింగ్… అంటే నో కలరింగ్… ఐనా సరే వీసమెత్తు ఆదరణ తగ్గలేదు తనకు… తమిళనాటే కాదు, ఎక్కడైనా సరే, హీరో అంటే హీరోయిక్ లక్షణాలు ఉండాలి అనుకుంటారు కదా… అజిత్ విషయంలో అదేమీ ఉండదు… అజిత్ అంటే అజిత్, అంతే… పలుసార్లు మీసాలు కూడా సరిగ్గా కట్ చేయడు… కొందరు హీరోలకైతే పర్సనల్ మేకప్‌మెన్ షూటింగ్ స్పాట్‌లో గంటకు పదిసార్లు మీసాలు, జుత్తు టచప్ చేస్తుంటారు… అజిత్ డ్రెస్సులు కూడా అధికశాతం వైట్ అండ్ వైట్…

ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి… బవిరిగడ్డాలు పెంచడం ఫ్యాషన్ కదా… ఇక్కడా అజిత్‌కు హేపీ… గడ్డాన్ని వదిలేశాడు… అది మరీ మోడీ గడ్డంలా పెరిగిపోయింది… ఐతేనేం, క్లీన్ షేవ్, మెయింటెయినెన్స్ తప్పింది కదా అనుకున్నట్టున్నాడు… ఇప్పుడు విజయ్ వారసుడు, అజిత్ తెగింపు ఓ రేంజులో సంక్రాంతికి పోటపడబోతున్నాయి… విజయ్ కాస్త స్టయిల్ కోసం గడ్డం ఉంచేసి, మిగతాది షేవ్స్, క్రీమ్స్, కలర్స్, నీట్‌గా కనిపిస్తున్నాడు… చూడాలిక ఈ ఇద్దరి పోటీ ఏమిటో… ఏమవుతుందో…

Ads

ajith

చాలా విషయాల్లో అజిత్ భిన్నం… ప్రత్యేకించి ఫ్యాన్స్ విషయంలో కలగజేసుకోడు, అసలు తనకు ఆ సంఘాలే అక్కర్లేదు అంటాడు… ఐనాసరే విజయ్ ఫ్యాన్స్‌తో ఈమధ్య బాగానే గోక్కుంటున్నారు అజిత్ ఫ్యాన్స్… అది మినహాయిస్తే అజిత్ స్వతహాగా బైక్ రేసర్… ఏదో ప్రమాదం జరిగాక కార్ల ఫార్ములా రేసింగు వైపు వెళ్లాడు… ప్రొఫెషనల్… బోలెడు అవార్డులు… ఇతర స్పోర్ట్స్ కూడా కొన్ని ఉన్నట్టున్నాయి… తన మాటతీరు, ప్రవర్తన కూడా ఓ పద్ధతిగా, హుందాగా, సంస్కారవంతంగా ఉంటుంది అంటారు… 2021లో కావచ్చు, అజిత్ చెన్నై రైఫిల్ క్లబ్ పోటీల్లో ఏకంగా ఆరు మెడల్స్ కొట్టాడు…

మొదట్లో హీరా రాజగోపాల్‌తో డేటింగ్ మొదలుపెట్టిన అజిత్ తరువాత బ్రేకప్ చెప్పేసి, బేబీ షాలిని హీరోయిన్ అయ్యాక 2000లో అజిత్ పెళ్లి చేసుకున్నాడు… 22 ఏళ్లు… నో కలతలు, నో చికాకులు… సక్సెస్‌ఫుల్ మ్యారేజీ… తను పుట్టింది నిజానికి సికింద్రాబాద్… టెన్త్ కూడా అయిపోలేదు, డ్రాపవుట్… చెన్నై వెళ్లిపోయి, బైక్ మెకానిక్కుగా మొదలుపెట్టాడు జీవితాన్ని… ఇంతా చేస్తే ఇంకా 51 సంవత్సరాలే కదా వయస్సు… ఇంకా చాలా ఉంది సినిమా జీవితం… ఎటొచ్చీ ఆ బవిరిగడ్డం లుక్కు సంగతేమిటో తనే తేల్చుకోవాలి… ఏం జరిగితే అది జరగనీ, కృత్రిమత్వాన్ని మొహానికి తాకనివ్వను అంటాడా..? ఐతే సరే, తగ్గొద్దు బ్రదర్… అసలు మన తాజా సినిమా పేరే ‘తెగింపు’…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions