Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరోగా మారితే నటుడు చచ్చిపోవాలా..? మమ్ముట్టిలో నటుడిలా బతకనక్కర్లేదా..?!

March 2, 2023 by M S R

‘నన్పకల్ నేరతు మయక్కం’ (తెలుగులో పగటి కల అని అర్థం)……. ఇది మలయాళంలో తీసిన సినిమా… ఓటీటీలో మనం తెలుగులో కూడా చూడొచ్చు… నెట్‌ఫ్లిక్స్‌లో..! ఇందులో నటుడు మమ్ముట్టి లీడ్ రోల్… నటుడు అంటున్నారేమిటి..? హీరో కదా అని దీర్గాలు తీయకండి… హీరో వేరు, నటుడు వేరు… గతంలో హీరోలుగా నటులే నటించేవాళ్లు… కానీ ఎప్పుడైతే హీరోలు అయిపోతున్నారో నటులుగా చచ్చిపోతున్నారు… అందుకని ఇప్పుడు హీరో వేరు, నటుడు వేరు…

నటుడు అంటే ఏ పాత్రనైనా చేస్తాడు… అందులో జీవించడానికి ప్రయాసపడి చచ్చిపోతాడు… తనలోని నటనను బతికించుకోవడానికి ప్రయత్నిస్తాడు… నటుడు చచ్చిపోకుండా ఎప్పటికప్పుడు కాపాడుకుంటాడు… మమ్ముట్టికి ఇంత వయస్సొచ్చినా సరే, ఇంకా తనలో నటుడు బతికే ఉన్నాడు… ఇంకా బతకడానికే ప్రయత్నిస్తున్నాడు… ఆ పగటికల సినిమా చూస్తుంటే అందుకే అబ్బురం అనిపిస్తుంది… ఇతర సౌత్ హీరోలతో పోలిస్తే తను ఎంత ఉన్నతంగా బతికాడో అర్థమవుతుంది…

ఎహె, మమ్ముట్టి మనకు తెలియకపోవడం ఏంది..? ఒక యాత్ర సినిమాలో వైఎస్‌లా జీవించాడు… స్వాతికిరణంలో ఆ మొహంలో పలికిన ఉద్వేగాలు మరవగలమా..? ఇప్పుడు ఈ సినిమాలోనూ అంతే… తను హీరో కాదు… అచ్చంగా ఓ నటుడు మాత్రమే… మీతోడు నిజం… హీరోయిజం వాసన కొద్దిగా కూడా తగలదు… చెత్త స్టెప్పులు, మాస్ హీరో అనగానే పూలచొక్కాలు, లుంగీ, నోట్లో బీడీ, చెవికి రింగు, తొర్రల బనీన్లు… ఇంకా ఏకాలంలో ఉన్నారయ్యా తమరు..? ఈ అనామకులు కూడా స్టెన్ గన్లతో మాఫియాలతో పోరాడతారు… అదీ విశేషం…

Ads

దెబ్బకు వందల మంది రౌడీలు ఢామ్… ఒక్క బుల్లెట్‌కు నూటాయాభై మంది మటాష్… హీరోయిన్లతో వెకిలి చేష్టలు, బూతు ద్వంద్వార్థ మాటలు, స్టెప్పులు (మరి హీరోయిజమంటే అంతే)… నిమిషానికి ఓసారి తన ఘనత, వంశ కీర్తనలు సరేసరి… పైగా నా అభిమానులు కోరింది ఇదేనోయ్ అంటారు… తేడా వస్తే దర్శకుడి మీదికి తోసేస్తే సరి… పీకందుకో ఒయ్, డప్పందుకో ఒయ్ అని గెంతులు… మన తెలుగు హీరోల పరిస్థితి ఇదీ… ముక్కుపచ్చలారని హీరో కూడా ఇవే లైన్స్‌లో బతుకుతూ, తమలో నటుడంటూ ఉంటే ఇంటి దగ్గర బీరువాలో భద్రంగా దాచి, వీలయితే బ్యాంకు లాకర్లలో దాచి సినిమా సెట్లకు వస్తుంటారు…

మెగాస్టార్లు, పవర్ స్టార్లు, సూపర్ స్టార్లు, రెబల్ స్టార్లు నుంచి బర్నింగ్ స్టార్ల దాకా అంతే… టాలీవుడ్‌లో స్టార్లు వస్తుంటారు, పోతుంటారు… కానీ నటుల్లేరు… మలయాళంలో ఉన్నారు… అక్కడ నటులు నటించిన సినిమాల్ని ఇతర భాషల్లోకి హీరోలు రీమేకులు చేస్తారు… వాటికి హీరోయిజం అద్ది చావగొట్టేస్తారు కూడా…

నటులు ఉన్నారు కాబట్టే మలయాళంలో మంచి కథలొస్తాయి… ప్రయోగాలు వస్తాయి… క్రియేటివిటీ పనిచేస్తుంది… స్టార్ అనగానే అరడజన్ సాంగ్స్, హీరోయిన్లతో డ్యూయెట్లు, ఐటం సాంగ్స్, డబుల్ మీనింగ్ డైలాగులు, తిక్క కామెడీ గట్రా ఏమీ ఉండకుండా మలయాళ సినిమా వాళ్లు జాగ్రత్తపడతారు… బీజీఎం అంటే ఢమఢమ వాయించేయడం కాదు, సినిమాలో సీన్ మూడ్‌కు తగిన మ్యూజిక్ అనే సోయి కనిపిస్తుంది వాళ్లలో… తెలుగులో చిరంజీవి అనే నటుడు గతంలో ఉండేవాడు… శుభలేఖ, అభిలాష ఎట్సెట్రా… వాటితో డబ్బులు రావడం లేదని ఫక్తు హీరోగా మారిపోయాడు చిరంజీవి… తనలోని నటుడిని ఇక ఎప్పుడూ నిద్రలేకలేదు… ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా డబ్బులు చేసుకుంటున్నాడు…

రవితేజ అంతే… వెంకటేశ్ కాస్త నయం… కాస్త వెరయిటీ సినిమాలకు ప్రయత్నిస్తున్నాడు… బాలయ్యలో నటుడున్నాడు కానీ పొరపాటున కూడా నటుడిని బయటికి రానివ్వడు… కొత్త హీరోల గురించి నన్నడగొద్దు… తమిళంలో కమల్‌హాసన్‌లో అద్భుతమైన నటుడున్నాడు… అసలు నటుడు అంటేనే కమల్‌హాసన్… తను కూడా హీరోగా చచ్చిపోతున్నాడు ఈమధ్య… రజినీకాంత్‌లో గతంలో నటుడు ఉండేవాడు… సూర్యలో నటుడున్నాడు… జైభీమ్, ఆకాశం నీ హద్దురా, గజిని వంటివి తను చేయగలడు… విక్రమ్ కూడా నటుడే…

కన్నడంలో హీరోలు ఎవరో, నటులు ఎవరో చెప్పడం కష్టం… చాలా ఏళ్లు అది ఎవరికీ పట్టని ఇండస్ట్రీ… ఇప్పుడిప్పుడే కేజీఎఫ్, కాంతార, చార్లి 777 తదితర సినిమాలు వచ్చి అలరించినయ్… యశ్ గురించి చెప్పలేం గానీ రిషబ్ మంచి నటుడు… సేమ్, రక్షిత్ శెట్టి కూడా నటుడే… తెలుగులో నటులు లేక కాదు, మంచి పాత్ర పడాలే గానీ బన్నీ, చరణ్, జూనియర్ ఇరగదీయగలరు… ప్రత్యేకించి జూనియర్‌లో గొప్ప నటుడున్నాడు… కానీ హీరో ఆ నటుడిని ఎప్పటికప్పుడు చంపేస్తుంటాడు…

మమ్ముట్టి సినిమా సంగతికి వద్దాం… కేరళ నుంచి ఒకాయన తమిళనాడులో ఓ చర్చికి వెళ్తాడు… వాపస్ వెళ్తున్నప్పుడు దారిలో అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా బస్సు దిగి ఓ ఊళ్లోకి వెళ్తాడు… తమిళం మాట్లాడుతుంటాడు… ఓ కుటుంబంలో సభ్యుడు అయిపోతాడు… ఎవరికీ తెలియని ఆ అనామకుడు తమ సంగతులు చెబుతూ, తమలో ఒకడు ఎలా అవుతాడని ఆ కుటుంబం షాక్… క్రిస్టియన్ కదా, కానీ గుడిలో పూజలు చేస్తుంటాడు…

ఇదంతా చూస్తూ తన భార్య కుప్పకూలిపోతుంది… నిజానికి కథ ఏమిటంటే..? బతుకుదెరువు కోసం ఆ ఊరిని వదిలి వెళ్లిన ఒకాయన ఎక్కడో మరణిస్తాడు, శవం కూడా ఊరికి రాదు… అతని ఆత్మ హఠాత్తుగా మమ్ముట్టిని ఆవహించి, తమ కుటుంబాన్ని కలుస్తుంది… అన్నీ కనులారా చూస్తుంది… ఇదే కథ… ఓ స్టార్ సినిమా అనుకుని థియేటర్ వెళ్తే బోర్ కొడుతుంది… ఈ స్పీడ్ యుగంలో ఇదేం కథ అనిపిస్తుంది… కానీ మమ్ముట్టిలోని నటుడిని చూడాలి…

ఎంతసేపూ ఆ దిక్కుమాలిన ఫైట్లు, ఐటమ్ సాంగ్స్ ఏం చూస్తాం..? పనికిమాలిన ఆ ఇమేజీ బిల్డప్పులు… చెప్పడం మరిచేపోయాను, మోహన్‌లాల్ ఈమధ్య హీరో అయ్యాడు గానీ తను కూడా ఒకప్పుడు మంచి నటుడు… ఇదుగో ఇలాంటి సినిమాలే నటుడిలోని దాహాన్ని తీరుస్తాయి… తనలోని ఆకలిని బతికిస్తాయి… అందరికీ ఇవి నచ్చాలని లేదు… కానీ కొంతమందికైనా నచ్చుతూ ఉండాలి… ఉంటేనే నటులు కూడా బతుకుతారు… లేకపోతే కేవలం హీరోలు మాత్రమే మిగిలి మనల్ని ‘చావగొడతారు’… నటుడు అంటే చెప్పాల్సింది… ఆల్ టైమ్ రియల్ యాక్టర్ అమితాబ్ బచ్చన్… !! (ఫలానా నటుడు లేడా..? వంటి ప్రశ్నలు వస్తే రావచ్చు… నేను చెప్పింది కొన్ని ఉదాహరణలు మాత్రమే…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions