Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్కినేని అలా… కాంతారావు ఇలా… కాంట్రాస్టు జీవితాలు… డెస్టినీ…!!

June 19, 2025 by M S R

.

Jagannadh Goud ... డబ్బుది ఏముంది, ఏ కుక్కని కొడితే వస్తుంది. విలువలు ముఖ్యం అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది…

రాష్ట్ర ప్రభుత్వం కాంతారావు గారి అవార్డ్స్ ప్రకటిస్తే ఆ సభకి రావటానికి కాంతారావు గారి కొడుక్కి ఎవరో 1000 రూపాయలు ఇస్తే కానీ అతను రావటానికి అవ్వలేదు అని విన్నాను. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఖచ్చితంగా తెలియదు కానీ, ఆ మాట వినటం బాధ అనిపించింది.

Ads

కాంతారావు గారికి వంశ పారంపర్యం గా 500 ఎకరాల పొలం వచ్చింది. ఇంకా 400 సినెమాల్లో నటించారు. ఉన్నదంతా దాన ధర్మాలు, ఇంకా స్థలాలు ఏమీ కొనకపోగా ఉన్న వాటిని అమ్మి సినెమాలు తీసి నష్టపోయారు.
చాలా ఎక్కువ డబ్బులు పెట్టి మద్రాసు లో ప్యాలెస్ లాంటి బంగ్లా కట్టించారు.

బాత్రూమే బెడ్ రూం అంత పెద్దది అని అప్పట్లో కథలుకథలుగా చెప్పుకునేవారు ఆ ప్యాలెస్ గురించి అని విన్నాను. ఆ తర్వాత సినెమాలు తీసి, అప్పులు అవటంతో చాలా తక్కువ ధరకి ఇంటిని అమ్మి అపార్ట్ మెంట్ లో రెంట్ కి దిగాల్సి వచ్చింది.

రాజభోగం అనుభవించిన కాంతారావు గారు చివరి దశలో వనవాస జీవితం అనుభవించారు. కాల్ షీట్స్ లేవు అని చెప్పిన అతను చివరికి “వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలి” అని లెక్కలు వేసుకున్నారు జీవిత చరమాంకంలో…

హైదరాబాద్ లో సొంత ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు. అతను చేసిన పొరపాట్లు కొన్ని అయితే రాజకీయాలకి బలి అవటం మరొక నష్టదాయకం. సినెమాల్లో కత్తి తిప్పాడు కానీ జీవిత యుద్ధంలో ఆ రాజకీయాలకి బలైపోయాడు.

సినెమాల్లోనే కాదు జీవితంలో కూడా అడుగడుగునా అడ్డంకులు, కుట్రలు, కుతంత్రాలు ఉంటై, వాటిని తట్టుకొని నిలవాలి కానీ సత్య హరిశ్చంద్రుడిలాగా ఆడిన మాట తప్పకూడదు అనే ఒకే నియమంతో ఉంటే మొత్తం రాజ్యాన్నే కోల్పోతారు; కాంతారావు గారి విషయంలో అదే జరిగింది…

1923 లో కాంతారావు గారు జన్మిస్తే 1924 లో అక్కినేని నాగేశ్వరావు గారు జన్మించారు. ఉట్టి చేతులతో హైదరాబాద్ వచ్చి వందల, వేల ఎకరాలు అక్కినేని వాళ్ళు కొనగలిగారు కానీ వందల ఎకరాలు ఉన్న కాంతారావు గారు కనీసం హైదరాబాద్ లో ఇళ్ళు కూడా కట్టుకోలేకపోయారు.

400 కు పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించిన మహానటుడు ఉన్నది అంతా దానధర్మాలు చేశాడు కానీ తనకి, తనవారికి ఆస్థులు ఏమీ మిగల్చలేదు. సినెమాల్లో అయితే పోగొట్టుకున్నవి అన్నీ తిరిగి వచ్చేస్తాయి లేదా దాన ధర్మాలకి మెచ్చి ఎవరో వరం ఇస్తారు కానీ జీవితం కదా అవేమీ తిరిగి రాలేదు. రావు కూడా, ఇక్కడ డబ్బే ముఖ్యం.

నువ్వు దేని గురించి అయినా అలోచించాల్సి వస్తే డబ్బు గురించే ఆలోచించు, డబ్బు సంపాదన గురించే ఆలోచించు. “ప్రాణం పోయినా పర్వాలేదు కానీ డబ్బు పోకూడదు, పోగొట్టుకోకూడదు” అంటాడు ఒక రోమన్ తత్వవేత్త…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం జగన్… ఈ రఫారఫా నరుకుడు భాషేమిటో, ఈ సమర్థనేమిటో…
  • కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల సాహిత్య పురస్కారాలు వీళ్లకు…
  • వర్తమాన సినిమా ప్రపంచంలో నిజంగానే ఇది ‘అరుదైన సరుకు’…
  • అక్కినేని అలా… కాంతారావు ఇలా… కాంట్రాస్టు జీవితాలు… డెస్టినీ…!!
  • అసలే చిరంజీవి… ఆపై రాఘవేంద్రరావు… ఆవేశంతో శారద… ఇంకేం..?!
  • అన్నదాతకు సంకెళ్లు… ఖచ్చితంగా ప్రభుత్వానికి మరక, మచ్చ..!!
  • దేనికీ టైమ్ లేదా…? పరుగు తీస్తున్నావా..? టైమ్ మింగేస్తుంది జాగ్రత్త..!!
  • గోదావరి- బనకచర్ల ఇష్యూ రాజకీయంగా రేవంత్‌రెడ్డికి కలిసి వస్తోంది..!!
  • పచ్చిపులుసు అంటేనే పచ్చిదనం… దాన్నలా పెంటదనం చేయకండి…
  • బంగారు బప్పీ…! సినీసంగీతంలో ‘గ్యాంగ్‌లీడర్’… ఆ ట్యూన్లంటే ఓ వెర్రి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions