మనం పదే పదే చెప్పుకుంటున్నాం కదా… సౌత్ హీరోల డామినేషన్ నడుస్తోంది ఇప్పుడు ఇండియన్ సినిమాలో అని… సౌత్ సినిమాలు వసూళ్లలో చెలరేగిపోతున్నాయి అని… హిందీ సినిమా చతికిలపడిపోయింది అని… మరి ఆస్తుల్లో, రెమ్యునరేషన్లలో మన హీరోలు హిందీ హీరోలను దాటేశారా..? ఇంకా లేదు… కానీ దూసుకొస్తున్నారు…
షారూక్ ఖాన్… ఆస్తుల్లో గానీ, ఈరోజుకూ ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్‌లో గానీ టాప్ వన్… తన ఆస్తి విలువ 6300 కోట్లు… కొన్నేళ్ల క్రితం ఫ్లాపుల్లో పడ్డా… తరువాత జవాన్, పఠాన్‌తో తేరుకుని, వసూళ్ల దుమ్ము రేపి, తరువాత దున్కి సినిమాతో కూడా ఇండస్ట్రీలో మళ్లీ బలంగా నిలబడ్డాడు… హయ్యెస్ట్ పెయిడ్ స్టార్ తను…
తరువాత ప్లేసు సల్మాన్ ఖాన్… 2900 కోట్ల ఆస్తులు… ఈమధ్య వెనుకబడ్డట్టు కనిపిస్తున్నా టైగర్-3 సినిమాతో కాస్త నిలబడ్డాడు… మూడో ప్లేసు అక్షయకుమార్… 2500 కోట్లు ఆస్తిపరుడు… చకచకా బోలెడు సినిమాలు తీస్తున్నా సరే, ఖాన్‌లను దాటలేకపోయాడు… ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు ఇప్పుడు…
Ads
ఖాన్ త్రయంలో వెనకబడింది ఆమీర్ ఖాన్… తన ఆస్తి 1862 కోట్లు (ఈ వివరాలన్నీ ఫోర్బ్స్ క్రోడీకరించినవే)… లాల్ సింగ్ ఛద్దా ఫ్లాపయినా ఇప్పుడు సితారే జమీన్ పర్‌తో మళ్లీ ఊపులోకి రావాలని ఆశిస్తున్నాడు… దంగల్, పీకే టైపులో… ఆస్తుల్లో మొదటి నాలుగు స్థానాలు హిందీ హీరోలవే… తరువాత ప్లేసు జోసెఫ్ విజయ్… తన ఆస్తులు దాదాపు 474 కోట్లు… రెండు దశాబ్దాలుగా ఫీల్డులో ఉన్నా మూణ్నాలుగేళ్ల నుంచి హవా నడుస్తోంది… వారిసు, లియో వంటి సినిమాలు తనను సౌత్ టాపర్‌ను చేశాయి…
విజయ్ తరువాతే రజినీకాంత్… 430 కోట్లు… ఆమధ్య వెనకబడిపోయినా సరే, జైలర్‌తో మళ్లీ గాడిన పడ్డాడు… తెలుగులో ఈ జాబితాలో మొదట కనిపించే పేరు అల్లు అర్జున్… 350 కోట్ల వరకూ ఆస్తులు… పుష్పతో పాన్ ఇండియా స్టారయ్యాడు… త్వరలో పుష్ప-2 రానుంది… నిజానికి ప్రభాస్ పేరు ప్రముఖంగా ఉండాలని అనుకుంటాం కదా… లేదు, తన ఆస్తులు 241 కోట్లేనట… రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటివి నిరాశపరిచినా సాలార్‌తో కాస్త రిలీఫ్ తనకు…
అజిత్ ఆస్తులు 196 కోట్లు… తునివు (తెగింపు) సినిమాతో మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చాడు… రజినీకాంత్‌కు ఈక్వల్ అని భావించే కమలహాసన్ ఈ జాబితాలో మరీ దిగువన ఉండిపోయాడు 150 కోట్లతో… అన్నట్టు వీళ్ల రెమ్యునరేషన్లు తెలుసా..?
షారూక్ 150 నుంచి 250 కోట్లు, తరువాత ప్లేసు రజినీకాంత్… 150 నుంచి 210 కోట్లు… విజయ్ 130 నుంచి 200, ప్రభాస్ 100 నుంచి 200, ఆమీర్ ఖాన్ 100 నుంచి 175, సల్మాన్ ఖాన్ 100 నుంచి 150, కమలహాసన్ 100 నుంచి 150, అల్లు అర్జున్ 100 నుంచి 125, అక్షయకుమార్ 60 నుంచి 145, అజిత్ 105 కోట్ల వరకూ అని ఫోర్బ్స్ అంచనా వేసింది…
ఇన్ని చెప్పుకున్నాం కదా… మరి హీరోయిన్లలో హయ్యెస్ట్ పెయిడ్ ఎవరు అంటారా..? బాలీవుడ్ వివరాలు మాత్రం ఉన్నయ్… దీపిక పడుకోన్ బాలీవుడ్ హయ్యెస్ట్ పెయిడ్ స్టార్… 15 నుంచి 30 కోట్లు… తాజాగా ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్ 15 నుంచి 27 కోట్లు, తరువాత ప్రియాంక చోప్రా 15 నుంచి 25, కత్రినా కైఫ్ కూడా దాదాపు సేమ్… మొన్నమొన్నటిదాకా టాప్‌లో నిలిచిన ఆలియా భట్ ఇప్పుడు 10 నుంచి 20 కోట్లు, కరీనాకపూర్, శ్రద్ధాకపూర్, విద్యాబాలన్, 8 నుంచి 14 మధ్యలో… అనుష్కశర్మ, ఐశ్వర్యారాయ్ 10, 12 కోట్లు…
Share this Article