కశ్మీర్ ఫైల్స్ సినిమా కంటెంటు గురించిన వార్త కాదు ఇది… సినిమాపై చాలామంది ఏడుపులు, పెడబొబ్బల గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం… కాకపోతే ఆ లింకున్న మరో వార్త ఇది… విషయం ఏమిటంటే..? ఆ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మొన్నామధ్య ఓ పిచ్చి ఆరోపణ చేశాడు… సోనీలో వచ్చే కపిల్ శర్మ కామెడీ షోకు మమ్మల్ని ఆహ్వానించలేదు, తిరస్కరించాడు అని..! అది పెద్ద అబద్ధం…
నిజానికి ఒక్క కపిల్ శర్మ మాత్రమే కాదు, ప్రస్తుతం చిన్నా చితకా ఈటీవీ క్యాష్, వావ్ షోల దాకా అందరూ సినిమా ప్రమోషన్లు చేస్తున్నారు… వరుస ప్రెస్‌మీట్లు, ప్రిరిలీజ్ ఫంక్షన్లకన్నా టీవీ షోలలో ప్రమోషన్లకు చిన్న నిర్మాతలు ప్రయారిటీ ఇస్తున్నారు… రీచ్ చాలా ఎక్కువ… పబ్లిక్‌లోకి ఈజీగా, వేగంగా వెళ్లిపోతుంది… అంతెందుకు..? ఆర్ఆర్ఆర్ టీంను కూడా కపిల్ శర్మ తన షోలో పార్టిసిపేట్ చేశాడు…
Ads
ఈ కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు చెప్పింది ఎందుకు అబద్ధమంటే..? వివిధ షోల ద్వారా ప్రమోషన్ పొందాలనుకునే సినిమా టీం కొంత సొమ్ము చెల్లిస్తుంది… ఫలానా సినిమా ప్రమోషన్ చేయాలా వద్దా అనేది ఆ టీవీ, ఆ షో నిర్మాతల ఇష్టం… హోస్ట్ చేసే సెలబ్రెటీ కూడా ఇష్టపడకపోతే ఆ ఎపిసోడ్ రక్తికట్టదు… రేటింగ్స్, యాడ్స్, మన్నూమశానం చాలా లెక్కలుంటయ్…
కపిల్ శర్మ కావాలనే కశ్మీర్ ఫైల్స్ సినిమాను రిజెక్ట్ చేశాడు అని ఆ దర్శకుడే చెప్పేసరికి… ఇక వెంటనే కపిల్ శర్మ కామెడీ షోకు నెగెటివ్ పబ్లిసిటీ స్టార్టయింది… ప్రత్యేకంగా హ్యాష్ ట్యాగులు అర్జెంటుగా క్రియేట్ చేసి, ఓ క్యాంపెయిన్ తీసుకున్నారు సోకాల్డ్ సినిమా అభిమానులు… సినిమాలో దమ్ముండి, ప్రజలు ఆదరించాలి గానీ, నిజంగానే కపిల్ శర్మలు వద్దంటే ఏంటట..?
‘‘బాబోయ్, నేను సదరు సినిమా టీంను రిఫ్యూజ్ చేశాననే ప్రచారం అబద్ధం, కాస్త నన్ను వదిలేయండిరా బాబో’’ అని సాక్షాత్తూ కపిల్ శర్మే మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు… ఇంకాస్త క్యాంపెయిన్ ఎక్కువైంది… చివరకు ఆ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించిన అనుపమ్ ఖేర్ స్వయంగా ఏదో మీడియా మీట్‌లో క్లారిటీ ఇచ్చాడు… ’’సదరు షో కోసం తమను రమ్మన్నారు, కానీ ఈ సినిమా ఓ సీరియస్ ప్రాజెక్టు, దానికి కామెడీ షో సూట్ కాదు అని నేనే వద్దన్నాను‘‘ అన్నాడు…
నిజానికి ఒక సినిమాకు సంబంధించి దర్శకుడో, నిర్మాతో ఏదైనా ప్రకటన చేసినా, కామెంట్ చేసినా… ఇక హీరోలు, హీరోయిన్లు, విలన్లు, ఇతర ముఖ్యమైన విభాగాల బాధ్యులు దానికి నెగెటివ్‌గా వెళ్లరు… కానీ అనుపమ్ ఖేర్ అలా కాదు, నిజమేమిటో చెప్పేశాడు… నిన్న చెప్పుకున్నాం కదా… సుప్రీం మాజీ జడ్జి గంగూలీ మీద ఎలా విరుచుకుపడ్డాడో, ఎలా మోడీని కీర్తిస్తాడో, అదేసమయంలో సాధ్వి ప్రాచీని, యోగి ఆదిత్యనాథ్‌ను జైలులో వేయాలంటాడు… టిపికల్ కేరక్టర్…!! ఎలాగైతేనేం… కపిల్ శర్మ శీలం కాపాడబడింది..!!
Share this Article