Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అందని అవార్డు పుల్లన…! పిచ్చి కూతలరాయుళ్ల జాబితాలో విశాల్ కూడా..!!

October 21, 2025 by M S R

.

అందని ద్రాక్ష పుల్లన… విశాల్‌కు దక్కని అవార్డులు చేదు… ఈమధ్య చాలామంది సెలబ్రిటీలు పిచ్చి కూతలకు ప్రసిద్ధి పొందుతున్నారు కదా… విశాల్ కూడా నేనేం తక్కువ అనుకున్నాడేమో… తను ఏమంటున్నాడంటే..?

‘‘8 కోట్ల మంది లేదా 80 కోట్ల మంది ఇష్టపడే సినిమాకి అవార్డు ఇవ్వాలా వద్దా అనేది కేవలం 8 మంది కమిటీ సభ్యులు నిర్ణయించడం సరైన విధానం కాదు… ఇది నేషనల్ అవార్డులకు సైతం వర్తిస్తుంది… నాకు ఇప్పటివరకు అవార్డులు రాకపోవడం వల్లే నేను ఇలా మాట్లాడుతున్నానని అనుకోవచ్చు… ఎవరైనా నాకు అవార్డు ఇస్తే దాన్ని చెత్తబుట్టలో పడేస్తా…”

Ads

అంతే కాదు… ‘‘యువర్స్ ఫ్రాంకీ విశాల్ అని ఓ పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేస్తున్నా… నా శరీరంపై ఇప్పటికి 119 కుట్లు పడ్డాయి… చాలాసార్లు గాయపడ్డాను… కానీ ప్రేక్షకుల స్పందన చూసి నొప్పులు మరిచిపోయాను… నా స్టంట్స్ రియలిస్టిక్‌గా ఉండాలని కోరుకుంటాను… అందుకే డూప్ వాడను… ఒకసారి యాక్షన్ సీన్‌లో లోతైన గాయమైతే 17 కుట్లు పడ్డాయి…’’

ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి… 1) 8 మంది కాకపోతే కోెట్ల మంది జడ్జ్ చేయాలా సినిమాలను, అవార్డులను..? జ్యూరీలు ఇచ్చే అవార్డులు చెత్త అని చెప్పడం అంటే… నాకు ఇస్తే వాటిని చెత్తబుట్టలో పడేస్తాను అనడం ఓ మూర్ఖత్వంతో కూడిన అహంకారపు ప్రకటన… ఇప్పటివరకు జెన్యూన్‌గా అవార్డులు పొందిన వారందరినీ అవమానించినట్టే విశాల్… ఓ చెత్తా స్టేట్‌మెంట్…

2) నీకు అవార్డు రావాలంటే అసలు నువ్వు ఏదైనా ఓ మంచి చెప్పుకోదగిన పాత్ర చేస్తే కదా… నటనలో మెరిట్ చూపిస్తే, సాధన చేస్తే, ఏదని మంచి పాత్రలో జీవిస్తే… అవార్డులు అవే పరుగెతుకొచ్చి మెడలో పడతాయి…

3) 80 కోట్ల మంది ఇష్టపడనీ, 8 కోట్ల మంది ఇష్టపడనీ… అవార్డులకు కొలమానాలు వసూళ్లు  కాదు, పాపులర్ కమర్షియల్ సినిమాల పోకడలూ కాదు… సూపర్ హిట్ సినిమాకు అవార్డు రాకపోవచ్చు, ఓ‘ ఫ్లాప్ చిత్రానికి అవార్డులు రావచ్చు… అవార్డులకు సక్సెస్ సినిమా అనేది కొలమానం కాదు… అలాగే వ్యక్తిగత అవార్డులు కూడా…

4) ఫిలిమ్‌ఫేర్ లెక్కలు వేరు, జాతీయ అవార్డుల లెక్కలు వేరు, రాష్ట్రాల ప్రభుత్వ పురస్కారాలు వేరు, సైమా అవార్డులు వేరు… ఏ లెక్కల్లోనూ ఇమడని విఫలురే ఇలా అవార్డులను ఛీత్కరిస్తారు… లోలోపల ఎంత వాటిపై తపన ఉన్నా సరే, అవి దక్కకపోతే ఇదుగో ఇలా ఈ అక్కసు, కుళ్లు ప్రకటనలకు దిగుతారు…

5) దేహంపై కుట్లు, గాయాలు గట్రా… మరో పిచ్చి ఘనత… ఓ స్టంట్ మాన్ చెప్పుకున్నట్టుగా ఉంది తప్ప ఓ హీరో, ఓ లీడ్ రోల్ నటుడు చెప్పుకునే మాటలు కావు ఇవి… డూప్ లేకుండా యాక్షన్ సీన్లు చేయడం గొప్పతనమా..? అలాంటప్పుడు స్టంట్ మాస్టర్లు హీరోలు అవుతారు తప్ప ఈ సోకాల్డ్ హీరోలు కాదు కదా…

6) ఎస్, ఓ స్టంట్ మాన్ రేంజ్ నుంచి ఓ రియల్ హీరోగా ఎదగలేకపోవడమే… ఆ పరిణతి రాకపోవడమే… తనకు ఒక్క అవార్డూ దక్కని దురవస్థకు కారణం… ఓ సమాజసేవకుడిగా, ఓ డౌన్ టు ఎర్త్ మనిషిగా, తమిళ నటుల సంఘం కీలక నేతగా మంచి పేరు తెచ్చుకున్న విశాల్ నోటి నుంచి ఈ పిచ్చి కూతలు ఊహించలేదు… సారీ, విశాల్, నీకు కాస్త పరిణతి అవసరం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వరల్డ్ కప్ జట్టు కోణంలో… కోహ్లీ, రోహిత్ కొనసాగింపుపై చర్చోపచర్చలు..!!
  • అందని అవార్డు పుల్లన…! పిచ్చి కూతలరాయుళ్ల జాబితాలో విశాల్ కూడా..!!
  • గోల్డ్ ఫామింగ్..! చెట్లకు నిజంగానే బంగారం కాసే రోజులొస్తున్నయ్…!!
  • ఆ ఆయుధం ఓనర్ ఎవరు..? అప్పగించడానికి వాళ్లెవరు..? ఇదీ చర్చ..!!
  • ‘‘గంధర్వగళం..! జీవితంలో మొదటిసారి ఈ గొంతుకతోనే ప్రేమలో పడ్డాను’’
  • చార్మినార్ భాగ్యలక్ష్మి…! ఫాఫం బీఆర్ఎస్ పాట్లు, అగచాట్లు, ఇక్కట్లు..!!
  • సూపర్ కిడ్..! కేబీసీలో జవాబు చెప్పే వేగం చూస్తే… నిజంగా ఓ విభ్రమ..!!
  • మూడు నటసింహాల భీకర గర్జన… ప్చ్… తెలుగు జనం పట్టించుకోలేదు…
  • దీపావళి… రెండు ఊళ్ల పేరూ అదే… ఓ ఇంట్రస్టింగు కథ…
  • ట్రంప్‌ పాలనపై అమెరికా ఎల్లెడలా భగ్గుమంటున్న ప్రజాగ్రహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions