Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరోక్రసీ..!! రామజోగయ్య నోరుజారినా సరే.., నిజమే చెప్పాడు కదా..!!

September 28, 2024 by M S R

‘ఎవరి పనిని వారు చేసుకోనిస్తే రిజల్ట్ దేవరలా ఉంటుంది… దర్శకుడు కొరటాల శివ అన్న ఈ మాట నాకు బాగా నచ్చింది… దర్శకుడిని నమ్మిన హీరో ఉంటే విజయం మరింత బలంగా ఉంటుందని దేవర నిరూపించింది’… ఈ మాట అన్నది గేయరచయిత రామజోగయ్య శాస్త్రి…

అంటే, సింపుల్… జూనియర్ ఎన్టీయార్ దర్శకుడిని నమ్మాడు, తన పనిని తాను చేసుకోనిచ్చాడు, అందుకే ఈ సక్సెస్ అనేది తన మాటల సారాంశం… వెంటనే సోషల్ మీడియాలో ఈ మాటల్ని కొందరు షేర్ చేస్తూ ఏవేవో కామెంట్లు పెడుతున్నారు… దాంతో నాలుక కర్చుకున్న జోగయ్య ‘అబ్బే, ఇది ఎటెటో పోతున్నట్టుంది… నేనన్నది కొరటాల శివ టెక్నీషియన్లకు స్వేచ్ఛ ఇచ్చాడని మాత్రమే’ అని సర్దుపాట్లు పడ్డాడు…

ఎటు పోతున్నది..? కొరటాల శివ కెరీర్‌లో దర్శకుడిగా మొదట్లో అన్నీ వరుస విజయాలు… లాస్ట్ సినిమా ఆచార్య మాత్రమే అట్టర్ ఫ్లాప్… చిరంజీవి, తన కొడుకు రామచరణ్ నటించారు… దేవర సక్సెసైంది అంటే దర్శకుడిని హీరో నమ్మాడు అనీ, ఆచార్య సక్సెస్ కాలేదు అంటే చిరంజీవి దర్శకుడిని నమ్మలేదు అనీ అర్థమొస్తోంది… అబ్బో, చిరంజీవికి కోపమొస్తుందో ఏమో అని రామజోగయ్య భయపడిపోయి, కాస్త మాటల్ని దిద్దుకున్నాడు ఏదోలా… అరెరె, ఏదో చెప్పబోయి ఆ పాదఘట్టంలో ఇరుక్కుపోయానే అనుకున్నాడు…

Ads

కానీ నిజమే చెప్పాడు… అయితే చిరంజీవి మాత్రమే కాదు… తనొక్కడినీ నిందించే పనేమీ లేదు… దాదాపు సౌత్ ఇండియన్ హీరోలందరూ ఇంతే… స్టార్ హీరోలు మాత్రమే కాదు, నిన్నా మొన్నా కాస్త పేరు తెచ్చుకున్న కుర్ర హీరోలకూ ఇదే పైత్యం… హీరో చెప్పినవాళ్లే హీరోయిన్లు, విలన్లు, కొరియోగ్రాఫర్లు, కంపోజర్లు… చివరకు చిన్న చిన్న పాత్రలకు నటీనటులు, టెక్నీషియన్లు కూడా హీరోకు నచ్చినవాళ్లే… చాలా లెక్కలుంటాయి…

ఇది హీరోస్వామ్యం… నిర్మాతలు, దర్శకులు హీరోల కాళ్ల దగ్గర బాసింపట్లు వేసుకుని కూర్చునే దురవస్థ… అప్పట్లో పవన్ కల్యాణ్ సినిమా ఏదో వచ్చింది… పేరుకు దర్శకుడు ఎవరో… కానీ హీరోయే మొత్తం డీల్ చేశాడట… మరి ఆమాత్రం దానికి దర్శకుడు వేరేగా ఎందుకు..? తనే మెగాఫోన్ పట్టొచ్చుగా… మెగా‌ఫోన్‌లోనూ మెగాతనం ఉందిగా…

గతంలో ఎన్టీయార్ తన పలు సినిమాల్ని తనే డైరెక్ట్ చేసుకున్నాడు… తనకు కన్విక్షన్ ఉంది, క్రియేటివిటీ ఉంది… ఆ సినిమాలూ విజయవంతం అయ్యాయి కూడా… ఇప్పుడూ దర్శకులకు స్వేచ్ఛ ఇవ్వడం ఇష్టం లేని హీరోలు వాళ్లే దర్శకత్వం వహిస్తే సరి… నిజానికి అసలు దర్శకులు ఎందరు హీరో నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నారనేదీ ప్రశ్నే… హీరో గారి కరుణా దృక్కులు ప్రసరిస్తే చాలు, హీరో చెప్పినట్టుగా తలూపేసి, గుడ్డిగా ఆచరించే మహానుభావులే కదా చాలామంది…

ఈ కోణంలో ధీరుడిగా, పర్వతాకారుడిగా ఒక్క రాజమౌళే కనిపిస్తున్నాడు ఈ తరంలో… తను అడిగినన్ని కాల్షీట్లు ఇవ్వాల్సిందే, ఆ సమయంలో వేరే సినిమాల్లేవు, ఏ లీకేజీలు ఉండకూడదు, ఆ సినిమా వివరాల్ని మీడియాతో పంచుకోకూడదు, ఎన్ని టేకులైనా అంగీకరించాల్సిందే… పాటలు, కథ, సీన్లు, మ్యూజిక్ అన్నీ తనిష్టమే… తను దర్శకనియంత… తను చెప్పినట్టు వింటారు అనుకుంటేనే ఆ హీరోలతో చేస్తాడు… తన మీదే పెత్తనం చేసే హీరోల జోలికి పోడు తను…

సరే, రాజమౌళి ఓ మినహాయింపు… నిజానికి దర్శకుడే ఏ సినిమా ప్రాజెక్టుకైనా కెప్టెన్… మునిగినా తేలినా తనదే బాధ్యత… అలాగని హీరోలు వదిలిపెడతారా..? నెవ్వర్… ఇప్పట్లో ఆ రోజుల్ని మనం చూడలేం… హీరోల అహం దానికి అంగీకరించదు…!! అవునూ, జూనియర్ కొరటాల శివను నమ్మాడు… మరి ఈ మిక్స్‌డ్ టాక్ ఏమిటి రామజోగయ్య శాస్త్రి గారూ… అంటే కెప్టెనే బాధ్యత వహించాలంటారు, అంతేనా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions