లీల గుర్తుందా..? ఫారెస్ట్ గార్డ్ పాత్ర… కాంతార సినిమాలో రిషబ్ శెట్టి అలియాస్ శివ పాత్ర ప్రేమికురాలు… లీల పాత్రకు మరీ పెద్దగా ప్రాధాన్యం ఏమీ ఉండదు సినిమాలో… కానీ హీరోయిన్ హీరోయినే కదా… తన సినిమాలోని లీల పాత్రకు పనికొచ్చే ఫేస్ కావాలని రిషబ్ వెతుకుతూ, అనుకోకుండా ఇన్‌స్టాలో ఈమె ఫోటోలు చూశాడు… ఆల్‌రెడీ ఏదో సినిమాలో నటించింది… సో, ఆడిషన్‌కు రమ్మన్నాడు… తరువాత వోకే అన్నాడు… ఆమె పుట్టింది, పెరిగింది బెంగుళూరు… తండ్రి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్… ఆమె ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్… పేరు సప్తమి గౌడ…
నటన మీద ఆసక్తితోపాటు ఆమెకు స్పోర్ట్స్ అంటే ఇష్టం… నేషనల్ లెవల్ స్విమ్మర్ ఆమె… సినిమా తీసేది, సంభాషణలు మంగుళూరు… అసలు మంగుళూరు, బెంగుళూరు మాండలికాల నడుమ బోలెడంత తేడా ఉంటుంది… పర్లేదులే అని భరోసా ఇచ్చిన రిషబ్ పలుసార్లు ఆమెకు దాదాపు సెమినార్ తరహాలో యాక్సెంట్ మీద క్లాస్ తీసుకున్నాడు… రెండు నెలలపాటు… ఆమె మంగుళూరు భాషకు అలవాటైంది… తరువాత రెగ్యులర్ షూటింగ్ స్టార్టయింది కూడా…
నిజానికి ఇది కాదు మనం చెప్పుకునేది… సినిమాలో కొన్నిచోట్ల శివ, లీల లవ్ ట్రాక్ యవ్వారంలో ప్రేక్షకులకు రెండుమూడు సీన్లు నచ్చలేదు… అది హీరో పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీసిందనే విమర్శలు అక్కడక్కడా వినిపించాయి… ప్రత్యేకించి లీల స్నానం చేస్తున్నప్పుడు శివ చూడటం, ఆమె నడుం గిల్లడం వంటివి… అయితే రిషబ్ ఈ అభిప్రాయాలపై ఎక్కడా స్పందించలేదు… కానీ హీరోయిన్ సప్తమి గౌడ మాత్రం భలే సమర్థించింది… ఇంట్రస్టింగు…
Ads
‘‘ప్రతి మనిషిలో కేరక్టర్‌లోనూ కొంత గ్రే షేడ్ ఉంటుంది… శివ పాత్ర కూడా సమాజాన్ని స్థూలంగా రిప్రజెంట్ చేసే ఓ సగటు యువకుడి పాత్ర… అందరు యువకులకు భిన్నమైనదేమీ కాదు… అసలు సొసైటీలో అంత పరిశుద్ధాత్ములు ఎవరున్నారు..? ఎవరూ ప్యూర్ బ్లాక్ కాదు, ఎవరూ ప్యూర్ వైట్ కాదు… కొన్ని నెగెటివ్స్, ఇంకొన్ని పాజిటివ్స్ ఉన్న పర్సనాలిటీలే కదా అందరూ… మనం శివ పాత్రను కూడా అలాగే చూడాలి, అలాగే అర్థం చేసుకోవాలి… శివ పాత్ర ఓ క్లీన్ గయ్ కాదు… నాట్ ప్యూర్ సోల్…
శివ పాత్రలో ఓవరాల్‌గా చూసినప్పుడు చాలా మెచ్చుకోదగిన గుణాలుంటయ్… అంతిమంగా అవే ప్రధానంగా జనంలోకి వెళ్తాయి… సినిమా కథలోనూ అంతిమంగా వాటికే ప్రాధాన్యం… మిగతావి చిన్న చిన్న అంశాలు… శివ, లీల ఒకే చిన్న ఊళ్లో పుట్టి పెరుగుతారు… చిన్నప్పటి నుంచీ ఒకరికొకరు తెలుసు… మరీ సినిమాల్లో చూపినట్టు, మోడరన్ వేలో హీరో వెళ్లి ఓ గ్రీటింగ్ కార్డు లేదా రోజా పువ్వు ఇచ్చి, మోకాళ్ల మీదకు వంగి, ఐలవ్ యూ అని చెప్పడం అనేది ఉండదు… అలా చూపిస్తేనే కృత్రిమంగా ఉంటుంది…’’ అని చెబుతూ పోయింది… కాస్త బుర్ర ఉన్న నటిలాగే కనిపిస్తోంది కదా…!!
Share this Article