.
. ( నారపరాజు నరసింగారావు ) .. … ఏమిటో నిన్నటి నితీష్ రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్ మీద ఈ తెలుగు మీడియా టైటిల్స్… కథనాలు….
నితీష్ రెడ్డిని ఓ నాలుగు కాలాల పాటు క్రికెట్ ఆడించేట్లుగా లేవు…. అమాంతం తీసుకెళ్లి మునగచెట్టు ఎక్కించడంలో మన మీడియా మహా ప్రసిద్ధం…
Ads
ఒక మ్యాచ్ లో సెంచరీ చేయగానే ఆకాశానికి ఎత్తేస్తుంది…. కపిల్ దేవ్ తో సాటి అయిన ఆల్ రౌండర్ అని..
ఇండియా పరువు కాపాడిన తెలుగు వాడు అని టైటిల్స్ పెట్టి పిచ్చి కథనాలు….. ముంబయి లాబీయింగ్ ను ఢీ కొట్టిన తెలుగు తేజం అని…
భవిష్యత్ కెప్టెన్ అని మరొకటి అని
మరొకటి అని…..
ఈ మీడియా ఎవరినైతే ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుందో ఒక ఆరు నెలలు సంవత్సరం తిరిగే వరకు వాళ్ళు జట్టులో ప్లేస్ కోసమే ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది….. ఈ మధ్య కాలంలో నాలుగైదు ఉదాహరణలు ..
ఇషాన్ కిషన్…. వన్ డే లలో డబుల్ సెంచరీ చేయగానే జూనియర్ సెహ్వాగ్ అని బిరుదు ఇచ్చారు…..
శుభమన్ గిల్…. వరుసగా మూడు సెంచరీలు చేయగానే భవిష్యత్ కెప్టెన్ అన్నది మీడియా….. పాపం పంజాబీ స్టాండ్స్ కే పరిమితం అవుతున్నాడు ఈ మధ్య…
శ్రేయాస్ అయ్యర్…. వరల్డ్ నెంబర్ ఒన్ క్లాస్ ప్లేయర్ అని… ద్రావిడ్ సచిన్ లక్ష్మణ్ ముగ్గురి కలిస్తే ఒక అయ్యర్ అని అప్పట్లో ఒక కథనం వచ్చింది…..
పిచ్చి అయ్యర్ ఇక అదే నిజం అని అనుకున్నట్లు ఉంది … ఫాం పోయింది…
8 th ప్లేస్ లో వచ్చి ఆస్ట్రేలియా పిచ్ మీద సెంచరీ చేసి జట్టును ఫాలో ఆన్ నుండి కాపాడటం గొప్ప విషయమే … కాదనడం సాహసమే… మొమొరబుల్ ఇన్నింగ్స్ ఇది…
అలా అని తెలుగు కన్నడ మలయాళ గుజరాతీ బెంగాలీ తమిళ్ కాశ్మీరీ అని కాక అతను భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అనే విషయం కూడా స్ఫురణకు రావడం అవసరం…..
పిచ్చి మీడియా పిచ్చి టైటిల్స్ పిచ్చి కథనాలు….
నిన్నటి ఓపిక, డిఫెన్స్, అఫెన్స్ అన్నీ చూశాం కదా… ఈరోజు ఉదయం మరో తొమ్మది రన్స్ చేసి ఔటయ్యాడు…!!
Share this Article