ఒక్కొక్క రాజకీయ నాయకుడు చేసే రాజకీయాలు తీరు ఒక్కోరకంగా ఉంటుంది… కేసీయార్‌ది మరీ డిఫరెంట్ స్టయిల్… ఎవడు తిట్టుకున్నా, ఎవడు మెచ్చుకున్నా సరే, తన దారిలో తను వెళ్తూనే ఉంటాడు… అయితే కొన్నాళ్లుగా చాలాసార్లు తన రాజకీయ ధోరణి, వ్యవహారం మరీ ‘అతి’ అయిపోయింది… అనగా మరీ ఓవర్, మరీ టూమచ్ అయిపోయిందని అర్థం…
ఏదైనా సాధించగలం, సాధిస్తేనే నిలబడగలం, సాధించే సత్తా నాకు ఉంది…. ఇలాంటి ఫీలింగ్స్ కొందరిలో ఉంటాయి… అవే రాజకీయాల్లో వాళ్లకు కేటలిస్టులు… అంటే, ఉత్ప్రరకాలు… అవి వాళ్లను ముందుకు తోస్తుంటాయి… కేసీయార్ భిన్నమేమీ కాదు… తను ఎప్పుడూ రాజకీయ నాయకుడే తప్ప రాజనీతిజ్ఞుడిగా లేడు… అది తనకు పనికిరాదని తనకు గాఢమైన నమ్మకం…
అక్కడివరకూ పర్లేదు… కానీ ఎప్పుడైతే ఆత్మాభిమానం, పాజిటివ్ ఫోర్స్ దాటి, ఇంకాస్త పైకి వెళ్తే… లేదా ఓ గీత దాటితే… ఆ వైఖరిని, ఆ తత్వాన్ని ఏమనాలి..? ఏమో, లక్ష పుస్తకాలు చదివిన కేసీయారే చెప్పాలి… ఎందుకిప్పుడు తన ధోరణి మీద సమీక్ష, విశ్లేషణ, చర్చ అవసరం అంటే… ఈ రిపబ్లిక్ భారతంలో, ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు జరపాలని చివరకు హైకోర్టు చెప్పాల్సిన దుర్గతి… పోనీ, దురవస్థ…
Ads
బయటికి ఎవరెంత సమర్థించుకున్నా సరే, అదొక విఫల ప్రయత్నం… ఈ దేశంలో పాలన నడిచేదే రాజ్యాంగాన్ని బట్టి… అది అమల్లోకి వచ్చింది గణతంత్రదినాన… ఇన్నేళ్లుగా ఆ ఉత్సవాల్ని జరుపుతూనే ఉన్నాం… కానీ ఈ దేశంలో భాగమైన తెలంగాణ మాత్రం అది జరపదట… ఎందుకు..? కరోనా కారణమట… ఖమ్మంలో అయిదు లక్షల మందితో సభ జరిపితే అక్కడ కరోనా జాడలుండవు… ప్రజల నిత్యజీవన వ్యవహారాల్లో కరోనా ప్రభావం లేదు… కానీ రిపబ్లిక్ డే ఉత్సవాలకు మాత్రం కరోనా అడ్డుపడుతోందట…
అదొక పిచ్చి సాకు అని అందరికీ తెలుసు… గవర్నర్ మీద కోపంతో, ఆమె మీద కొనసాగుతున్న కక్షసాధింపు ఆలోచనలతో పుట్టుకొచ్చిన దురాలోచన తంత్రమే ఈ గణతంత్ర నిర్లిప్తత… అసలు గవర్నర్ పట్ల కేసీయార్ పార్టీ, ప్రభుత్వ వైఖరే హుందాగా లేదు… ఆమెను అమితంగా గౌరవించాలని, ఆమె నిర్ణయాలను వ్యతిరేకించకూడదని ఎవరూ చెప్పడం లేదు… రాజ్యాంగ వ్యవస్థల నడుమ పరస్పరం గౌరవ మర్యాదలు, ఆనవాయితీలు, సంప్రదాయాలు కొనసాగాలి… ఆమెను దృష్టిలో పెట్టుకుని ఏకంగా ఈ దేశ రాజ్యాంగం పట్ల, పతాకవందనం పట్ల అగౌరవం చూపడం ఏమిటి..? (ఆ రాజ్యాంగం ఆధారంగానే తెలంగాణ ఏర్పడిందని విస్మరిస్తే ఎలా..?)
ఇప్పుడు హైకోర్టు నిష్కర్షగా చెప్పింది… గణతంత్ర వేడుకలు నిర్వహించాలని..! కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని..! పరేడ్ కూడా నిర్వహించాలని..! ఇది హైకోర్టుతో చెప్పించుకోవాలా..? ఎవరి పరువు పోయినట్టు..?! అందుకే కొన్ని కీలకాంశాల్లోనైనా కాస్త రాజనీతిజ్ఞత ప్రదర్శించలని అందుకే చెప్పేది..!! కొత్త సచివాలయం ఓపెనింగుకు వేరే ముఖ్యమంత్రుల్ని పిలిచి ఘనంగా చేయడం రాజకీయం… దానికి గవర్నర్‌ను పిలుస్తాడా లేదానేది మళ్లీ ఇప్పుడు చర్చనీయాంశం… ఎందుకంటే… టెక్నికల్‌గా గవర్నర్‌దే ఈ ప్రభుత్వం కాబట్టి…!! ఇందులోనూ రాజ్యాంగ మర్యాదలు పాటించాలని బీజేపీవాళ్లు ఎవరైనా హైకోర్టుకు వెళ్తున్నారా..?!
Share this Article