వేణుస్వామి కేసులో ఇంట్రస్టింగ్ ట్విస్టు ఏమిటంటే..? వుమెన్ కమిషన్ వేణుస్వామికి జారీ చేసిన సమన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం కాదు… అదెలాగూ ఊహిస్తున్నదే… ఎందుకంటే..? వుమెన్ కమిషన్ ఎదుట సోకాల్డ్ ఫిలిమ్ జర్నలిస్టుల సంఘం, డిజిటల్ జర్నలిస్టుల సంఘం ఫిర్యాదు చేశాయి కదా… అసలు వాళ్లకు వేణుస్వామి చెప్పిన జ్యోస్యానికి అసలు లింక్ లేదు… వాళ్లకు లోకస్ స్టాండి లేదు…
అనుకున్నట్టుగానే హైకోర్టు స్టే ఇచ్చింది… తన తీర్పు కాపీలో ఏం చెప్పిందో అది చదివితే గానీ చెప్పలేం… ఎవరో ఎగేస్తే పోలోమంటూ వెళ్లి కమిషన్ ఎదుట ఫిర్యాదు దాఖలు చేసిన ఫిలిమ్ రిపోర్టింగ్ పెద్ద తలకాయలు ఇప్పుడేమంటాయో కూడా తెలియదు… ఎవరి ఆలోచనలకో ఈ సంఘాలు ఎందుకు ఉపయోగపడుతున్నాయో, వెనుక ఎవరెవరున్నారో తేలాల్సి ఉంది… ఎలాగూ పోలీసుల వద్దకు కేసు వెళ్లింది కాబట్టి వేణుస్వామికి బెదిరింపుల కథలు కూడా బయటపడొచ్చునేమో… పోలీసులు గనుక సీరియస్‌గా తీసుకుంటే…
సరే, కోర్టులో కేసు విషయానికి వస్తే… ట్విస్టు ఏమిటంటే… వుమెన్ కమిషన్ సమన్లకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్… కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అనుకోవాలా… టెక్నికల్‌గా అలా అనుకోలేం, ఎందుకంటే వుమెన్ కమిషన్ ఓ రాజ్యాంగబద్ధ సంస్థ… తనేమో ఓ న్యాయవాది… కానీ కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద కాంగ్రెస్… లాయర్ పొన్నం అశోక్ కాంగ్రెస్… అదీ ఇంట్రస్టింగ్…
Ads
సరే, వేణుస్వామి గనుక కమిషన్ ఎదుట హాజరైతే గాయిగత్తర లేపి, మరింత రచ్చ చేయాలనుకున్న వారు ఇప్పుడేమంటారో తెలియదు… ఎవరో నాగచైతన్య, ఎవరో శోభిత… ఎవరో జ్యోతిష్కుడు నడుమ ఈ జర్నలిస్టు సంఘాలకేమొచ్చింది..? అదే ఇంపార్టెంట్ ప్రశ్న… నేనిక్కడ వేణుస్వామి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే వీడియో జోలికి పోవడం లేదు… కేవలం జర్నలిస్టుల విధి ఏమిటి..? వాళ్ల వ్యవహార శైలి ఏమిటి..? అసలు ఆ జోస్యంలో మహిళల్ని కించపరిచింది ఏముంది..?
ఇప్పుడిక వేణుస్వామిపై ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఏం చేయబోతున్నారు..? సుప్రీం కోర్టుకు వెళ్తారా..? ఇక ఏ సమస్యలూ లేనట్టుగా ఓ చానెల్ పదే పదే వేణుస్వామిపై రక్తపుకూడు అంటూ, మహిళలకు ద్రోహం అంటూ డిబేట్లు పెడుతూ విషాన్ని చిమ్ముతున్న తీరును ఎలా సమర్థించుకుంటుంది..? పోనీ, ఆ చానెల్ విలేఖరి ఎవరో ఎగేశాడు అనుకుందాం… సంఘాలు వెనకాముందు ఆలోచించకుండా ఫిర్యాదు చేయడానికి వరుస కట్టాలా..? వెళ్లిన వాళ్లు అసలు ఆ జోస్యాలతో మాకేం సంబంధం అని ఆలోచించుకునే సోయి కూడా లేదా..?
వాళ్లను నియమించుకున్న మీడియా సంస్థలు ఎందుకు ఆలోచించడం లేదు… తమ సిబ్బంది ఫిలిమ్ రిపోర్టింగ్ గాకుండా ఇంకా ఏవేవో వ్యవహారాల్లో వేళ్లు కాళ్లు పెడుతున్నారని…! సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓసారి ఈ కేసు విషయంలో సీరియస్‌గా ఆలోచించాలి… ఏ కోణంలో అనేది తనకూ ఇట్టే అర్థమవుతుంది… స్టే ఇస్తూ హైకోర్టు ఏం చెప్పిందో, ఏం వ్యాఖ్యానించిందో ఆ స్టే కాపీ చూస్తే గానీ చెప్పలేం… అది వచ్చాక అసలు ఫిర్యాదు ఏమిటో కూడా చెప్పుకుందాం…
Share this Article