పాన్ ఇండియా అంటే… కాదు, పాన్ వరల్డ్ అంటే… భారీ నిర్మాణ వ్యయం అంటే… అదీ ప్రభాస్ సినిమా అంటే… మరీ 1000 కోట్ల కల్కి సినిమా తరువాత వచ్చే సినిమా అంటే… అదీ 300- 400 కోట్ల సినిమా అంటే… అదెలా ఉండాలి..?
అన్నింటికన్నా ముందు అమితాబ్, కమలహాసన్ వంటి తారాగణం కొలువు తీరాలి… కల్కిలో అది బాగా వర్కవుట్ అయ్యింది కదా… మైథాలజీని కూడా జొప్పించడంతో నార్తరన్ బెల్టులో ప్రభాస్ కలెక్షన్లలో ఇరగదీస్తున్నాడు కదా…
మరి యానిమల్‌తో బాక్సాఫీసులు కొల్లగొట్టిన యానిమల్ వంగా సందీప్‌రెడ్డి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చే ‘స్పిరిట్’ సినిమా ఎలా ఉండాలి..? సరే, యానిమల్, అర్జున్‌రెడ్డి తరహా పాత్రలకే గనుక సందీప్‌రెడ్డి మళ్లీ సిద్ధపడితే… ప్రభాస్‌కు ఆ రోల్స్ సూటవుతాయా అనేదీ పక్కన పెడితే…
Ads
స్టార్స్ కావాలి… తారాగణం ఎవరెవరో తేలితే సినిమా పట్ల ఓ హైప్ స్టార్టవుతుంది… పైగా జపాన్, కొరియా, చైనా భాషల్లో కూడా రిలీజు చేస్తామని అంటున్నాడు కదా దర్శకుడు… కథతోపాటు సంగీతం, గ్రాఫిక్స్, ప్రజెంటేషన్ అన్నీ ముఖ్యమే… మరి స్టార్స్..?
ఇప్పటికే కొరియన్ పాపులర్ నటుడు మా డాంగ్ సియోక్‌ను తీసుకుంటున్నట్టు వార్తలొచ్చాయి… అది ఖచ్చితంగా తూర్పు దేశాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఉపయోగపడుతుంది… కానీ అసలు హీరోయిన్లు ఎవరు..? తాజా వార్తలు ఏమిటంటే..?
ప్రభాస్‌కు ఒక్కరు కాదు, ఇద్దరు టాప్ బాలీవుడ్ ఫిమేల్ స్టార్స్‌ను సందీప్ రెడ్డి లైన్‌లో పెడుతున్నాడట… ఒకరు ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్… రెండో నటి కత్రినా కైఫ్… ఇద్దరూ ఇద్దరే… ఎంపిక వరకూ వోకే… నిజమో అబద్దమో పక్కన పెడితే ఇద్దరూ పెళ్లయ్యాక ఏది పడితే అది అంగీకరించడం లేదు… సినిమాలు చేస్తున్నారు కానీ సెలెక్టివ్ పాత్రలే…
పిచ్చి పిచ్చి గెంతులు, ఆరబోతలు ఎలాగూ అంగీకరించరు… పైగా వెటరన్స్… ఐనా ప్రభాస్ సినిమాల్లో అలాంటివి పెద్దగా ఉండవు… సందీప్ రెడ్డి సినిమాలో అస్సలే ఊహించలేం… కాకపోతే ఇక్కడ చిన్న విషయం… చాన్నాళ్లు ఐశ్యర్య, కత్రినా నడుమ సరైన సంబంధాలు లేవు…
ఇప్పటికీ అవి చక్కబడ్డాయో లేదో తెలియదు… ఇద్దరూ సల్మాన్ ఖాన్ పాత బాధితులు కదా… ఎందుకో గానీ మరీ డిష్యూం డిష్యూం అనే తరహా సంవాదాలు, విమర్శలు చేసుకోరు గానీ… సత్సంబంధాలు మాత్రం లేవు… అప్పట్లో శ్రీదేవి, జయప్రదల నడుమ ఉన్నంత దూరం అయితే లేదు… కానీ వాళ్లిద్దరి నడుమ కోఆర్డినేషన్, కెమిస్ట్రీ సందేహాస్పదమే…
అబ్బే, ఏముందిలే… ఇద్దరూ కలిసి నటించే సీన్లు పెద్దగా ఏముంటాయి గనుక అంటారా..? అదీ నిజమే… ప్రభాస్ పేరిట మరో భారీ పందెం కాయబోతున్నారు నిర్మాతలు, దర్శకుడు… సింపుల్‌గా… మరో 1000 కోట్ల ప్రాజెక్టు… హిట్టయితే..! పాన్ వరల్డ్ కదా… ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు..! దటీజ్ ది స్పిరిట్..!!
Share this Article