Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!

June 6, 2025 by M S R

.

మన తెలుగులో ఆ కార్తీకదీపాన్ని మన ఆడ లేడీస్ నెత్తిన పెట్టుకుని చూస్తుంటారు కదా… మరి జాతీయ స్థాయిలో ఎక్కువ రీచ్, ఎక్కువ జనాదరణ ఉన్న టీవీ సీరియల్ ఏది..?

ఆఫ్ కోర్స్, మరీ నార్త్ ఇండియా, అంటే హిందీ బెల్టులో మన తెలుగుకన్నా నాసిరకం సీరియల్స్ కూడా చెలామణీ అయిపోతుంటయ్… సరే, సగటు ఇండియన్ టీవీ సీరియల్ అంటేనే ఒకేరకం… పైగా పలు భాషల్లో చానెళ్లు ఉన్న స్టార్, జీ చానెళ్లు ఆ భాష నుంచి ఇటు, ఈ భాష నుంచి అటు అనువాదాలు చేసి ప్రేక్షకుల మీదకు వదిలేస్తుంటారు…

Ads

ఏపీలో తక్కువ కానీ, తెలంగాణలో హిందీ టీవీ సీరియళ్లను లేడీస్ బాగా చూస్తుంటారు… ఒకసారి హిందీ సీరియళ్లకు అలవాటు పడితే తెలుగు సీరియళ్లు అసలు పట్టించుకోరు, మరి మన తెలుగు సీరియళ్ల క్వాలిటీ ఆ స్థాయి మరి…

rupali ganguly(rupali ganguly)

హిందీలో మొన్నమొన్నటిదాకా అనుపమ సీరియల్ టాప్… ఇప్పుడు దాన్ని కిందకు తోసేసి ఉడ్‌నే కీ ఆశ సీరియల్ టాప్ వన్ అయిపోయింది… అనుపమ బలం హీరోయిన్‌గా నటిస్తున్న రూపాలీ గంగూలీ… మొన్నమొన్నటిదాకా హయ్యెస్ట్ పెయిడ్ టీవీ నటి… కార్తీక దీపం ప్రేమీ విశ్వనాథ్‌కన్నా చాలా రేటెక్కువ, పాపులారిటీ ఎక్కువ…

neha(neha harsora)

ఇప్పుడు ఉడ్‌నే కీ ఆశ టాప్… అదీ హీరోయిన్‌గా చేస్తున్న నేహా హర్సోరా వల్లే… ఏదో తమిళ స్టార్ విజయ్ సీరియల్‌కు రీమేక్ ఇది… నెక్స్ట్ ఏ రిస్తా క్యా కెహ్‌తా హై… ఉర్ఫీ జావేద్ హీరోయిన్… బోల్డ్ నటి… సరే, వీళ్లు ఏ సినిమా తారకూ తీసిపోరు… అంత పాపులర్, ఇంటింటికీ చేరిన తారలు…

jannat(jannat jubair)

అసలు హైలీ పెయిడ్ టీవీ ఆర్డిస్టు ఎవరో తెలుసా..? జన్నత్ జుబేర్… ఒక దశలో ఖత్రోంకీ కిలాడీ సీరియల్‌కు ఒక్కో ఎపిసోడ్‌కు 12 నుంచి 18 లక్షలు తీసుకుందట… లాఫ్టర్ చెఫ్‌కు 1 నుంచి 2 లక్షలు… ఆమె ప్రాపర్టీస్ ఏకంగా 300 కోట్లు… బాలీవుడ్ సినిమా హీరోయిన్లను మించిన సంపాదన, పాపులారిటీ… ఆమె ఇన్‌స్టా ఫాలోయర్స్ 5 కోట్లు… ప్రతి కమర్షియల్ పోస్టుకూ 2 నుంచి 4 లక్షల వరకూ తీసుకుంటుంది…

tejaswi(tejaswi prakash)

తరువాత స్థానం తేజస్వి ప్రకాష్… ఇప్పుడు స్మృతీ ఇరానీ… ఆమె జీవితం పాపులరైపోయి, అందరికీ చేరువై, బీజేపీలో చేరి, అగ్ర నాయకురాలిగా మారిన ఈమె పేరు వినగానే గుర్తొచ్చే టీవీ సీరియల్ పేరు క్యోంకీ సాస్ బీ కబీ బహూ తీ… మోస్ట్ పాపులర్ సీరియల్ అప్పట్లో… ఏక్తాకపూర్ అనబడే బోల్డ్ నిర్మాత దీనికి…

smriti irani(smriti irani)

ఇప్పుడు స్మృతీ ఇరానీకి పెద్ద పనేమీ లేదు కదా… అదే సీరియల్ రెండో భాగం తీయాలని ఏక్తాకపూర్ సంకల్పం… రోజుకు 14 లక్షలు ఆఫర్ చేసిందట ఏక్తాకపూర్… జెడ్ ప్లస్ కేటగిరీలో… షూటింగు స్పాట్‌కు పరిమిత సంఖ్యలోనే స్టాఫ్‌‌ను అనుమతిస్తారట… సో, ఇదే నిజమైతే ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ టీవీ ఆర్టిస్టు రూపాలీ గంగూలీ, తేజస్వి ప్రకాష్, జన్నత్ జుబేర్, నేహా పర్సోరా కాదు… స్మృతి ఇరానీ మాత్రమే..!!

అవునూ, తెలుగులో హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్టు ఎవరబ్బా..? ప్రేమీ విశ్వనాథ్..? ఆషిక పడుకోన్..? దీపిక..? మేఘన..? మరెవరబ్బా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions