Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరోయిన్ల రెమ్యునరేషన్లలో పాత రికార్డులన్నీ బద్దలు ! ఈమె టాప్ !!

August 3, 2026 by M S R

.

అది ఏ భాషా చిత్రమైనా సరే, హీరోల రెమ్యునరేషన్ల లెక్కలు సరిగ్గా అంతుపట్టవు… కొందరు కొన్ని ఏరియాల హక్కులు తీసుకుంటారు… కొందరు ఏకంగా సహనిర్మాతగా వ్యవహరించి లాభాల్లో అధిక వాటా తీసుకుంటారు… బ్లాక్ కొంత, వైట్ కొంత రెమ్యునరేషన్లు కాబట్టి ఎప్పుడూ ఏ నిర్మాణ సంస్థ కూడా ఈ పారితోషికాల నిజాల్ని వెల్లడించదు…

కానీ హీరోయిన్ల రెమ్యునరేషన్ల వివరాలు మాత్రం మీడియాలో కనిపిస్తుంటాయి… అంటే అన్నీ నిజాలో కాదో తెలియదు గానీ ఉజ్జాయింపుగా ఎవరి పాపులారిటీ ఎంతో, ఎవరి గిరాకీ ఎంతో, ఎవరి రేంజ్ ఏమిటో స్థూలంగా చెబుతాయి… రెమ్యునరేషన్ ఒప్పందాల ఉల్లంఘనలతో సినిమాల్ని అర్థంతరంగా మానేసిన ఉదాహరణలూ ఉన్నాయి, కాకపోతే పైకి వేరే ఏవో సాకులు చెబుతారు…

Ads

రెండు భారీ ప్రాజెక్టుల నుంచి దీపిక పడుకోన్ వైదొలగడానికి పైకి ఏం రీజన్స్ చెబుతున్నా, అసలు కథ రెమ్యునరేషన్ గొడవేనట…  అవునూ, ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే సూపర్ స్టార్ ఎవరు..? నయనతార, రష్మిక మంధాన, ఆలియా భట్… వీళ్లెవరూ కారు…

రాజమౌళి – మహేష్ బాబు ‘వారణాసి’ చిత్రంలో ప్రియాంక చోప్రా.. రూ. 30 కోట్ల భారీ రెమ్యునరేషన్‌తో సరికొత్త రికార్డ్!

గ్లోబల్ ఐకాన్, ‘దేశీ గర్ల్’ ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత మరోసారి ఇండియన్ తెరపై అడుగుపెట్టింది… మార్కెట్‌లో తనకు దీటైన ప్రత్యర్థిగా భావించబడే దీపికను కూడా దాటేసింది… ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ ద్వారా ఆమె టాలీవుడ్‌లోకి ఘనంగా వస్తోంది. (అఫ్‌కోర్స్ పాన్ వరల్డ్ మూవీ) సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో, మరో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలుసు కదా…

ప్రియాంక చోప్రా

‘వారణాసి’ చిత్రంలో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది… ఈ సినిమా కోసం ఆమె ఏకంగా రూ. 30 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసి, ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ రికార్డుతో ఆమె దీపికా పదుకోన్, ఆలియా భట్‌లను వెనక్కి నెట్టింది.

తెలుగు మాట్లాడడం కష్టమన్న ‘దేశీ గర్ల్’

ఇటీవల ‘వారణాసి’ టైటిల్ ప్రకటన వేడుకకు సంబంధించి ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బిహైండ్-ది-సీన్స్ (BTS) వీడియోలను పంచుకున్నారు. ఆ వీడియోలో ఆమె తెలుగు సంభాషణలు నేర్చుకుంటూ తీవ్రంగా రిహార్సల్స్ చేయడం కనిపించింది. లైవ్ ఆడియెన్స్ ముందు సినిమా సెట్స్‌లో కంటే తెలుగు మాట్లాడడమే ఎక్కువ కష్టమని ఆమె సరదాగా అంగీకరించింది.

ప్రియాంకపై నిర్మాత ప్రశంసలు

ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాత కె.ఎల్. నారాయణ ప్రియాంక చోప్రాను కొనియాడుతూ..

“ప్రియాంక చోప్రా ఒక భారతీయ నటిగా హాలీవుడ్‌కి వెళ్లి ప్రపంచవ్యాప్త కీర్తిని సంపాదించి, ఇండియన్ సినిమా స్థాయిని మార్చేసింది. ఆమె తన అద్భుతమైన ప్రతిభ, కష్టపడే తత్వంతోనే ఇదంతా సాధించింది. మా చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించినందుకు ప్రియాంకకు ధన్యవాదాలు” అని అన్నాడు.

ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ‘వారణాసి’పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు – రాజమౌళి కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాను మరో మెట్టు ఎక్కించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల విడుదలైన పోస్టర్ రాజమౌళి శైలిలోనే సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూ సినిమాపై హైప్‌ను తారాస్థాయికి చేర్చింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!
  • అనసూయా జాగ్రత్త ! కర్మ ఎవరినీ వదలదు ! పది రెట్లు తిరిగి ఇస్తుంది !!
  • రేవంత్‌ రెడ్డిపై బహుముఖ కుట్ర ! జగన్ కూడా ఓ పాత్రధారేనా ?
  • నూరేళ్ల విల్లాకు కొత్త కళ ! సొగసైన బ్యాటింగే కాదు – కళాత్మక అభిరుచి !
  • కాళేశ్వరం బరాజుల బ్లండర్స్‌లాగే ఈనాడులో ఓ బ్లండర్ కథనం..!
  • న్యూయార్క్ సిటీ మేయర్ పక్కా భారత ద్వేషి- నిజమే, సో వాట్..?!
  • అబ్బో.., రేవంత్‌ను కూల్చేస్తే బీఆర్ఎస్ సహకరిస్తుందట !!
  • SIR – తెలంగాణ Chief Electoral Officer కి పద్మశ్రీ ఇవ్వాలి మోదీజీ…!!
  • ఆర్గానిక్ హిట్..! టాలీవుడ్‌కు ఓ ‘మంచిబాట’ చూపిన ఇరుముడి..!
  • నా ముఖం వీడియో తీయనివ్వకండి… మా నాన్న చూస్తే చచ్చిపోతాడు మేడమ్!”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions