జార్జ్ సోరోస్ కి మళ్ళీ దెబ్బ పడింది! రాహుల్ పేరును కూడా చేర్చాలి! 94 ఏళ్ళ జార్జ్ సోరోస్ కి ఆగస్టు 12 న 94 ఏళ్లు వచ్చాయి! కానీ ఎప్పటిలాగా పుట్టిన రోజు వేడుక జరుపుకోలేదు!
ఆగస్టు 11న అంటే, ఆదివారం రోజున హిండెన్బర్గ్ రిసెర్చ్ చేత SEBI ( Securities and Exchange Board of India) ఛైర్ పర్శన్ మీద ఆరోపణలు గుప్పిస్తూ ఒక నివేదిక విడుదల చేయించాడు సోరోస్!
ఆ నివేదికలో2023 లో చేసిన ఆరోపణల మీద సెబి చర్యలు తీసుకోలేదు అని, సెబీ చైర్ పర్సన్ మధాబి పురికి ఆమె భర్త అయిన ధవల్ బుచ్ కి విదేశాలలో ఉన్న సంస్థలలో పెట్టుబడులు ఉన్నాయని, వాటి నుండి అదానీ గ్రూపు లోకి నిధులు పెట్టుబడి రూపంలో వెళుతున్నాయని, వీటి మీద విచారణ చేయలేదని ఆరోపణలు చేసింది హిండెన్బర్గ్!
Ads
యధా ప్రకారంగా ఆదివారం రిపోర్ట్ విడుదల చేస్తే, దాని ప్రభావం సోమవారం ఉదయం ట్రేడింగ్ మీద పడి భారత్ లో షేర్ మార్కెట్ పడిపోయి తనకి లాభాలు వస్తాయని ప్లాన్ చేశాడు సోరోస్! ప్లాన్ బాగానే ఉంది కానీ సోరోస్ అనుకున్నట్లుగా భారత మార్కెట్లు ఏవీ కుప్పకూలిపోలేదు. సోమవారం ఉదయం మార్కెట్ కొంచెం ఒడిదుడుకులకు లోనైనా మళ్ళీ పుంజుకొని సెన్సెక్స్ 900 పాయింట్లు పెరిగి క్లోజింగ్ 70 పాయింట్ల నష్టపోయింది! నిఫ్టీ కూడా దాదాపుగా ఒకే పాటర్న్ లో కొనసాగింది!
నిజానికి హిండెన్బర్గ్ రిపోర్ట్ వల్ల రాజకీయంగా తీవ్ర అలజడి వచ్చి స్టాక్ మార్కెట్ పడిపోతుంది అని ఆశించాడు సోరోస్! థాంక్స్ బంగ్లాదేశ్! బంగ్లాదేశ్ లో జరిగిన, జరుగుతున్న నాటకం మీద చిన్నా, పెద్ద ముదుపరులు ఒక అవగాహనకి వచ్చేసారు కాబట్టి హిండెన్బర్గ్ రిపోర్ట్ గురుంచి పట్టించుకోలేదు!
జార్జ్ సోరోస్, రాహుల్ కలిసి గేమ్ ప్లే చేస్తున్నారని గ్రహించి ఎప్పటిలాగానే ట్రేడింగ్ లో పాల్గొన్నారు పానిక్ కాకుండా! ఆగస్టు మొదటి వారంలోనే హిండెన్బర్గ్ రిపోర్ట్ వస్తున్నది అని ట్రేడింగ్ వర్గాలకి ముందస్తుగా సమాచారం అందింది కాబట్టి రెడీగానే ఉన్నారు!
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే చిన్న మదుపరులు ఇప్పుడు కొద్దో గొప్పో చదువుకున్న వారే ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు కూడ కొంచెం రిసెర్చ్ చేసి తెలియని విషయాలని తెలుసుకుంటున్నారు……. 1997 ఆసియా స్టాక్ మార్కెట్ సంక్షోభం గురుంచి అప్పట్లో జార్జ్ సోరోస్ థాయ్ లాండ్, మలేషియా కరెన్సీను ఎలా సంక్షోభంలోకి నెట్టాడు అని తెలుసుకున్నారు.
*******
జర్నలిస్టుల పాత్ర!
OCCRP ( Organized Crime and Corruption Reporting Project ) అనేది ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్టులు కలిగిన సంస్థ! దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో వర్కింగ్ స్టాఫ్ తో పాటు జర్నలిస్టులు కూడా పనిచేస్తూ ఉంటారు!
OCCRP కి నిధులు కావాలి కాబట్టి విరాళాలు సేకరిస్తుంది! జార్జ్ సోరోస్ కి చెందిన ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ OCCRP కి విరాళం ఇచ్చే వాటిల్లో భారీగా విరాళం ఇస్తుంది!
Well..! OCCRP అనేది ప్రభుత్వాలు, పారిశ్రామిక వేత్తలు కలిసి ఆర్గనైజ్ గా చేసే నేరాలు, కుంభకోణాల గురుంచి ప్రపంచానికి రిపోర్ట్ చేస్తుంది. ఇంతవరకూ బాగానే ఉంది వినడానికి! మరి జార్జ్ సోరోస్ లాంటి హీనమైన వ్యక్తి గురుంచి తెలిసీ విరాళం స్వీకరించి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల చేత రిపోర్ట్ ఇప్పిస్తే, దానిని మీడియా ప్రసాదంలాగా కళ్ళకద్దుకొని ప్రచురించడం, ప్రసారం చేయడం ఏమిటి..!
అన్ని దేశాలలోని మీడియా సంస్థలు OCCRP ఇచ్చే సమాచారం మీదనే ఆధారపడి వార్తలు వండి వారుస్తున్నాయి ఇన్నాళ్ళూ! So..! దొంగ, పోలీసు ఒకరే!
హిండెన్బర్గ్ కూడా OCCRP నుండి సమాచారం తీసుకొని, దానిలో తమకి ఎలాంటి సమాచారం కావాలో సెలెక్టివ్ గా తీసుకొని, దానిని హై లైట్ చేస్తూ రిపోర్ట్ విడుదల చేస్తుంది! తన రిపోర్ట్ లో ఉన్నదాని ముందు, తరువాతి సమాచారాన్ని దాచేసి మధ్యలోని సమాచారాన్ని మాత్రమే బయటపడుతుంది!
ఉదాహరణ: ఫ్రాన్స్ రాఫెల్ జెట్ ఫైటర్స్ విషయంలో ఒక్కో ఫైటర్ జెట్ 10 కోట్ల డాలర్లకు కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది అని రిపోర్ట్ విడుదల చేస్తుంది! నిజానికి అది MoU, అంటే మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ ను ఒప్పందంగా చెపుతుంది. ఒప్పందం అంటే అది ఫైనల్ అగ్రిమెంట్! MoU అనేది ఒప్పందానికి ముందు ఒక అవగాహన చేసుకునే దానికి రాసుకుంటారు!
మోడీ 30 కోట్ల డాలర్లకి ఒప్పందం చేసుకున్నాడు అని రిపోర్ట్ విడుదల చేస్తుంది! అంటే 20 కోట్ల డాలర్లు ఎక్కువ పెట్టాడు మోడీ కాబట్టి అది ఒక స్కామ్ అంటుంది! ఇందులో నిజం ఎక్కడ దాచిపెడుతుంది ? కాంగ్రెస్ బేరం ఆడిన రాఫేల్ జెట్ మోడల్ F1. మోడీ అగ్రిమెంట్ చేసుకున్నది F3 మోడల్.
కాంగ్రెస్ బేరం ఆడింది కేవలం జెట్ ఫైటర్స్ మాత్రమే! మోడీ ఒప్పందం చేసుకుంది రాఫెల్ F3 మోడల్ తో పాటు ఎలెక్ట్రానిక్ వార్ ఫేర్ (SPECTRA) , ఎయిర్ TO ఎయిర్ మిసైల్ వ్యవస్థ, 7 అదనపు మార్పులు అంటే రాఫేల్ చాసిస్ లో కూడా మార్పులు చేయాలి, ఎయిర్ TO గ్రౌండ్ గైడెడ్ బాంబుల ప్యాకేజీ, 5 ఏళ్ళ నిర్వహణా వ్యవస్థను మనదేశంలో నెలకొల్పడంతో పాటు పైలట్ శిక్షణ, గ్రౌండ్ స్టాఫ్ కి శిక్షణ ఇవ్వాలి 5 ఏళ్ళ వరకూ. ఒక వేళ యుద్ధం అంటూ వస్తే 70% రాఫల్ జేట్లు సిద్ధంగా ఉంచే బాధ్యత రాఫెల్ సంస్థ దే! ఒకవేళ మెయింటనెన్స్ లో లోపాలు వస్తే ఫ్రాన్స్ తన జెట్ ఫైటర్స్ ను మనకి ఇస్తుంది యుద్ధ సమయంలో!
రాఫెల్ F1 మోడల్ ధర చెప్పదు, అలాగే రాఫెల్ F3 ధర మాత్రం చెపుతుంది. అసలు F1 , F3 అనే వాటిని దాచిపెట్టి రాఫెల్ జెట్లు అని రిపోర్ట్ ఇస్తుంది! కాంగ్రెస్ బేరం ఆడింది అని చెప్పదు, అగ్రిమెంట్ చేసుకున్నది అనే చెప్తుంది కానీ అగ్రిమెంట్ చేసుకుంటే కాంగ్రెస్ ఎందుకు కొనలేదో చెప్పదు. ఎందుకంటే MoU కి అగ్రిమెంట్ కి తేడా తెలీదు చాలా మందికి! పైన చెప్పిన దాని లాగానే సెబీ చైర్ పర్సన్ మీద ఆరోపణలు రిపోర్ట్ చేసింది హిండెన్ బర్గ్! కానీ తుస్సుమంది రాకెట్!
*******
జార్జ్ సోరోస్ చాలా ఎక్కువగా ఊహించుకొని తాను భంగ పడడమే కాకుండా తనతో కలిసి షార్ట్ సెల్లింగ్ చేసే సంస్థల చేత కూడ షేర్లు భారీ మొత్తంలో కొనిపించాడు! తీరా చూస్తే లాభం కాదు కదా తీవ్రంగా నష్టపోయాడు సోరోస్. తాను పెట్టుబడి పెట్టించిన ఇతర సంస్థలనీ నష్టాల్లోకి నెట్టాడు!
2023 లో అదానీ గ్రూపు మీద మొదటి రిపోర్ట్ విడుదల చేసినప్పుడు మార్కెట్ కుప్పకూలి పోయింది. ఆ రోజున జార్జ్ సోరోస్ ఒక బిలియన్ డాలర్ల మేరకు లాభ పడ్డాడు షార్ట్ సెల్లింగ్ వలన! వారం క్రితం రెండో రిపోర్ట్ విడుదల చేసే ముందు తాను 2 బిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశాడు అత్యాశతో. చివరికి గత ఏడాది వచ్చిన లాభంతో పాటు అదనంగా పెట్టిన పెట్టుబడి కూడా నష్ట పోయాడు!
గత పార్లమెంటు ఎన్నికల సమయంలో ఎక్కువగా ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలో ఖర్చు పెట్టాడు! కానీ మోడీ మూడోసారి ప్రధాని కాకుండా ఆపలేకపోయాడు! జార్జ్ సోరోస్ తో కలిసి పెట్టుబడి పెట్టిన ఇతర షార్ట్ సెల్లింగ్ సంస్థలు ఇక మీదట సోరోస్ తో కలిసి పనిచేయము అని ఖటాఖట్ గా చెప్పేశారు! అదీ సోరోస్ తన పుట్టిన రోజు వేడుక చేసుకోకపోవడానికి కారణం!
ఇంతకీ హిండన్ బర్గ్ ఆదివారం రోజున రిపోర్ట్ విడుదల చేస్తుంది అని వారం రోజుల ముందే ఎలా లీక్ అయ్యింది? ఏమో! అజిత్ డోవల్ కే తెలియాలి! ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అది…… ఏదో ఒక రోజున జార్జ్ సోరోస్ తనకు తానుగా ఇలా ఆరోపణలు చేస్తాడు….. RAW నా సంస్థల మీద గూఢచర్యం చేస్తున్నది అని. చివరిగా ఒక మాట… ఆగస్టు 15 వేడుకలకు వచ్చిన రాహుల్ బాడీ లాంగ్వేజ్ చూశారా? ఏదో కోల్పోయిన వాడిలా కనపడ్డాడు గమనించారా? (పొట్లూరి పార్థసారథి )
Share this Article