ఇక్కడ వైట్ సూట్‌లో చూస్తున్న వ్యక్తి ఓ రుషి లాంటి వ్యక్తి.. జర్మనీకి చెందిన ఫిజిక్స్ రంగానికి చెందిన నిపుణుడు మార్కస్ షిమికి.
ఈయన వేదాలు అధ్యయనం చేశారు. హిమాలయ యోగుల దగ్గర శిష్యరికం చేశారు. ప్రశ్నోపనిషత్తు, కపిల మహర్షి సాంఖ్య శాస్త్రం వంటి ప్రాచీన భారతీయ గ్రంధాలు క్వాంటమ్ ఫిజిక్స్ కోణంలో స్టడీ చేసి.. విశ్వం యొక్క 12 డైమెన్షనల్ వ్యక్తీకరణను తెలుసుకున్నారు. జర్మనీలో బెర్లిన్‌లో వేదిక్ అకాడమీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ కాన్షియస్‌నెస్ రీసెర్చ్ (ICAR)ని నెలకొల్పారు.
మేటర్, కాన్షియస్‌నెస్ రెండింటి వెనుక ఉన్న రహస్యాలను చేధిస్తూ సెల్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్‌ని శరీరంలోని నాడుల మధ్య ప్రాణశక్తి చలనాన్ని ఫిజిక్స్ దృక్పధంలో పరిశోధన చేసి శరీరాన్ని, మనస్సునీ ఫ్రీక్వెన్సీల ఆధారంగా ప్రభావితం చేసే టైమ్ వేవర్ ఫ్రీక్వెన్సీ మెడిసిన్ డివైజ్‌ని నీనో నూనా అనే పోర్చుగల్ పరిశోధకుడితో కలిసి అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత మెక్ మేకిన్ వంటి పలువురు ఆ రంగంలోని మహామహులతో కలిసి హీలీ, మాగ్ హీలీ వంటి డివైజ్‌లను తీసుకు వచ్చారు.
ఎక్కడ సైన్స్ స్పిరిట్యువాలిటీ కలుస్తుందో దాన్ని పూర్తి శాస్త్రీయ దృక్పధంతో జీవితకాలం స్టడీ చేసిన వ్యక్తి మార్కస్.
నేను సహజంగా ఎవరినీ కలవడానికి ఆసక్తి చూపించను. బట్ మార్కస్ లాంటి వ్యక్తి సమకాలీనుడిగా ఆయన జీవితకాలంలో ఆయన్ని కలిసే అవకాశం కలిగినందుకు, ఆయనతో కొద్దిగా గడిపే అవకాశం కలిగినందుకు గర్వంగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత ఆయన ఇండియా వస్తున్న నేపధ్యంలో నిన్న ఆయన కోసమే ప్రత్యేకంగా బెంగుళూరు వెళ్లాను. ఆయన చేసిన గంటకు పైగా ప్రసంగం మనిషి కాన్షియస్‌నెస్ గురించి భారతీయ యోగులను ప్రస్తావిస్తూ ఆయన ఇండియాలో గడిపిన జీవితాన్ని చెప్పిన వైనం నాకు జీవితాంతం ఆ సబ్జెక్ట్ మీద మరింత లోతుగా తెలుసుకునే ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆయన టీమ్ తయారు చేసిన హీలీ లాంటి అద్భుతమైన డివైజ్ వాడుతున్నందుకు గర్వంగానూ ఉంది. జర్మనీలో పుట్టిన ఓ మహర్షి అంతే అతను!
– Sridhar Nallamothu
Share this Article
Ads