సుడి అంటే… హొంబళె ఫిలిమ్స్ అధినేత విజయ్ కరంగుదూర్‌దే…! మూడు వరుస సినిమాలతో ఏకంగా 2000 కోట్లు కొల్లగొట్టిన సంస్థ ఇది… శాండల్‌వుడ్ గతినే మార్చేస్తున్నాడు… మిత్రుడు చలువె గౌడతో కలిసి పదేళ్ల క్రితం ఓ చిన్న సినిమా నిర్మాణ సంస్థను పెట్టాడు… పునీత్ రాజకుమార్ మొదట్లో బాగా అండగా నిలబడ్డాడు… ఫస్ట్ సినిమా తనే చేశాడు, పేరు నిన్నిందలే… 2014లో… తరువాత సంవత్సరం యశ్‌తో మాస్టర్ పీస్… ఇక వెనక్కి తిరిగి చూడలేదు…
2017లో మళ్లీ పునీత్ రాజకుమార సినిమా చేశాడు… హిట్… ఒకవైపు కేజీఎఫ్-1 తీస్తూనే మరో సినిమాను పునీత్‌తో తీశారు… పేరు యువరత్న… హిట్… అదే ఊపులో కేజీఎఫ్ కూడా సూపర్ హిట్… లెక్కలేనంత డబ్బు వచ్చిపడింది… ఇక్కడే జాగ్రత్త పడ్డారు ఈ నిర్మాతలు… ఏది పడితే అది తీసి ప్రేక్షకుల మీదకు రుద్దే ప్రయత్నం చేయలేదు…
మూడేళ్ల టైం తీసుకుని, కేజీఎఫ్-2 తీశారు… దాని లక్ష్యం వాళ్లకు క్లియర్… కన్నడ సినిమాను దేశమంతా చూపించాలని..! అనుకున్నట్టుగానే ఆ సినిమా వాళ్లను ఎక్కడికో తీసుకుపోయింది… ఎన్నో రికార్డులను తిరగరాసింది… మధ్యలో రిషబ్ శెట్టి అడిగితే ఓ చిన్న సినిమాగా కాంతారకు పెట్టుబడి పెట్టారు… సుడి… అదీ బోలెడు రికార్డులను పగులగొడుతూ చరిత్ర సృష్టిస్తోంది… ముందుగా ఆలోచన లేకపోయినా సరే, అదీ పాన్ ఇండియా సినిమా అయిపోయింది…
Ads
వాట్ నెక్స్ట్..? ఇదీ ప్రశ్న… కన్నడ ఇండస్ట్రీ మాత్రమే కాదు… బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, అన్ని వుడ్లూ చూస్తున్నాయి… వాళ్లు ఇక కేవలం కన్నడ సినిమాకే పరిమితం కాదలచుకోలేదు… అలాగని ప్రతి సినిమాను పాన్ ఇండియా పేరిట రుద్ద దలుచుకోలేదు… మంచి కథ, మంచి దర్శకుడు దొరికితే ఇతర భాషల్లోనూ సినిమాలు తీయాలని ప్లాన్… ఫిలిమ్ ప్రొడక్షన్ హౌజ్ ఆఫ్ ఇండియా… నాట్ ఓన్లీ బెంగుళూరు… విజన్ క్లియర్… ఇప్పటికిప్పుడు డబ్బుకు కూడా ఢోకా లేదు…
ప్రభాస్‌తో సాలార్ స్టార్ట్ చేశారు… కేజీఎఫ్ తీసిన ప్రశాంత్ నీల్ దీనికి దర్శకుడు… పేరుకు తెలుగు, కన్నడ సినిమా అయినా దీని లక్ష్యం పాన్ ఇండియా మార్కెటే… కాకపోతే ప్రభాస్ డేట్ల అడ్జస్ట్‌మెంట్ అవ్యవస్థ కారణంగా సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెబుతున్నారు… పునీత్‌తో రాజకుమార తీసిన సంతోష్‌తో ఓ చిన్న కామెడీ సినిమా తీశారు, రాఘవేంద్ర స్టోర్స్… దాని గతేమిటో ఎవరికీ క్లారిటీ లేదు కానీ, మలయాళంలో ఫాహద్ ఫాజిల్‌తో ధూమం అనౌన్స్ చేశారు… జాతీయ అవార్డు గ్రహీత అపర్ణ బాలమురళి అందులో హీరోయిన్… దక్షిణ భాషల్లో రిలీజ్ చేయాలని ఆలోచన…
మలయాళంలోనే మరో సినిమా తీస్తున్నారు, పేరు టైసన్… దీన్ని పృథ్విరాజ్ సుకుమారన్‌తో తీస్తున్నారు… ఇటు తెలుగులోకి, అటు మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నిర్మాణ సంస్థ పనిలోపనిగా మరో రెండు కన్నడ సినిమాలను ప్రకటించింది… చార్లితో అనూహ్య విజయం దక్కించుకున్న రక్షిత్ శెట్టితో రిచర్డ్ ఆంటోనీ సినిమా ప్రకటించింది… శ్రీమురళి హీరో…
ఇవన్నీ సరే, హిందీ, తమిళ భాషల్లోనూ ఎంట్రీ ఇస్తారా అంటే నిర్మాతల నుంచి చిరునవ్వే జవాబుగా కనిపిస్తోంది… తమిళ ఇండస్ట్రీ అంత సులభంగా వేరే భాష నిర్మాతలను ఎంకరేజ్ చేయదు… హిందీలో సపరేటుగా నిర్మించాల్సిన పనిలేదు… డబ్ చేసి వదలడమే… మొత్తానికి హొంబళె పదేళ్ల ప్రస్థానమే ఓ సినిమా కథలా ఉంది…!!
Share this Article