చదువుతుంటేనే ఎంత థ్రిల్లో… ఆయన పేరు అశోక్… అలిసెరిళ్ తామరాక్షన్ అశోక్… మలయాళీ… కేరళ రూట్స్… తండ్రి ఏవీ తామరాక్షన్ కేరళలో మాజీ ఎమ్మెల్యే… అశోక్ 2006లో లండన్ వెళ్లాడు… ఫోర్డ్ మోటార్ కంపెనీలో కొలువు… తను స్వతహాగా మెకానికల్ ఇంజినీర్… ఇద్దరు బిడ్డలు… ఇదీ తన నేపథ్యం…
పైలట్ పరీక్షలు రాశాడు… 2018లోనే పైలట్ లైసెన్సు వచ్చింది… ఇంకేముంది..? కుటుంబంతో టూర్లు వెళ్లాలనిపించింది… మరి తనదేమో అందరిలాంటి తత్వం కాదాయె… అడ్డగోలు టికెట్ రేట్లు, ఇరుకిరుకు సీట్లు, హడావుడి, టైంతో కుస్తీలు… ఏం మనం ప్రైవేటు, ప్రభుత్వ బస్సు సర్వీసుల్లో, రైళ్లలో టూర్లకు వెళ్లే బదులు సొంత వాహనాల్లో వెళ్లడానికి ప్రయారిటీ ఇవ్వడం లేదా..? టైమ్ మన చేతుల్లో ఉంటుంది, షెడ్యూల్ మన ప్లాన్ మేరకు నడుస్తుంది…
ప్రైవసీ ఉంటుంది… అదొక ఆనందం… ఇలాగే ఆలోచించిన అశోక్ ముందుగా ఓ విమానం అద్దెకు తీసుకుందామని అనుకున్నాడు… కానీ ఎక్కువగా దొరికేవి టూసీటర్లు… కానీ తన కుటుంబంలో ఉన్నదేమో నలుగురు… ఫోర్ సీటర్లు పెద్దగా దొరకవు… దొరికినా పాతవి, డొక్కువి… నమ్ముకోలేం… ఆలోచించగా, చించగా ఓ ఐడియా తట్టింది… అసలు తనే ఓ సొంత విమానం తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది..? ఇదీ బుర్రలో వెలిగిన బల్బు…
Ads
ఇంకేముంది..? దానికి ఏమేం కావాలి..? ఎంత కర్చవుతుంది..? విడిభాగాలు ఎక్కడ దొరుకుతాయి..? పర్మిషన్స్ ఏమేం కావాలి..? అధ్యయనం చేశాడు… కరోనా లాక్ డౌన్లు తనకు బోలెడంత వెసులుబాటు కల్పించింది… అసలు తను సొంతంగా ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసుకోగలడా..? ఏమైనా సరే అనుకుని ముందుకే వెళ్లాడు…
జోహాన్నెస్‌బర్గ్ వెళ్లాడు… అక్కడ స్లింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ… అసెంబ్లింగ్ కిట్ దొరికింది… తెచ్చుకుని తన లండన్ ఇంటినే వర్క్ షాపుగా వాడుకున్నాడు… జాగ్రత్తగా అసెంబ్లింగ్ చేశాడు… మధ్యమధ్య యూకే సివిల్ ఏవియేషన్ అధికారులు చెక్ చేశారు… మొత్తానికి గత ఫిబ్రవరిలో ఎయిర్ క్రాఫ్ట్ రెడీ అయిపోయింది… చిన్న బిడ్డ పేరు మీద దియా అని పేరుపెట్టుకున్నాడు… ఇంటీరియర్ కూడా తన అవసరాల మేరకు ఫిట్ చేసుకున్నాడు… ఇంకేముంది..? భార్య, ఇద్దరు బిడ్డలు, తను… రయ్ రయ్ రయ్…
మరి నేరుగా టూర్ వెళ్లిపోలేడు కదా… పలుసార్లు ట్రయల్స్ వేశాడు… అంతా బాగానే ఉంది… ఏవియేషన్ అథారిటీ కూడా క్లియరెన్స్ ఇచ్చింది… మొత్తానికి 1.8 కోట్ల ఖర్చుతో తన సొంత నాలుగు సీట్ల విమానం తయారు చేసుకున్నాడు… గంటకు 200 కిలోమీటర్ల గరిష్ట వేగం… గంటకు 20 లీటర్ల ఇంధనం కావాలి… ట్యాంకులో 180 లీటర్లు నింపొచ్చు… సరిపోదా ఏం..?
మరి ఇంత కష్టపడి, ఇంత ఖర్చుపెట్టి కేవలం బ్రిటన్‌కే ఎందుకు పరిమితం కావాలి అనుకున్నాడు… జర్మనీ, ఆస్ట్రియా, జెక్ తదితర దేశాలకు బయల్దేరాడు… యూఎస్, యూరప్ చట్టాలు సొంత ఎయిర్ క్రాఫ్టులకు అనుమతిస్తున్నాయి… అలా సివిల్ ఏవియేషన్ పర్మిషన్స్ సాధ్యమయ్యాయి… ఎంతైనా నువ్వు అసాధ్యుడివి బ్రదర్…!
Share this Article