.
కలిసి పని చేస్తేనే భవిష్యత్ లో కూడా విజయం: హోండా – నిస్సాన్
ప్రపంచం మొత్తం కార్ల అమ్మకాల్లో హోండా కంపనీ అమ్మకాలు 3 వ స్థానంలో ఉండి హోండా కార్ల కంపనీకి దాదాపు 5 % (4.87 %) ప్రపంచ మార్కెట్ షేర్ ఉంది.హోండా కంపనీ కార్లు; హోండా సివిక్, హోండా ఎకార్డ్, హోండా వాళ్ళ SUV టైప్ హోండా CRV ప్రపంచం లో చాలా దేశాల్లో అమ్ముడుపోతాయి. ప్రపంచంలో అత్యధికం గా అమ్ముడు పోతున్న కార్లల్లో ఒకటి హోండా సివిక్.
Ads
మరోవైపు ప్రపంచం మొత్తం అమ్మకాల్లో 6 వ స్థానంలో ఉంది నిస్సాన్ కార్ల కంపనీ. ప్రపంచంలో నిస్సాన్ మార్కెట్ షేర్ 3.84 % . నిస్సాన్ కంపనీ కార్లు; నిస్సాన్ అల్టిమా, నిస్సాన్ మ్యాక్జిమా, నిస్సాన్ వాళ్ళ SUV టైప్ నిస్సాన్ రోగ్ కూడా ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్నై.
అయితే ప్రస్తుత ప్రపంచంలో ఉన్న పోటీ తట్టుకొని దీర్ఘకాలంగా నిలవాలంటే ప్రత్యర్ధులుగా ఉన్న ఈ రెండు జపాన్ కంపనీలు కలిసి పని చేద్దాం అని నిర్ణయించుకొని ఈ రోజే (జనవర్ 6 న) విలీనానికి శ్రీకారం చుట్టాయి. పూర్తి స్థాయి విలీనం ఇంకో 5 నెలల్లో జరిగిపోయి జూన్ 2025 నాటికి పూర్తి అవుతుంది. ఆగస్ట్ 2025 నుంచి హోండా లేదా నిస్సాన్ అని కాకుండా రెండూ కలిసిపోయి ఉన్న కొత్త పేరు వస్తుంది.
ప్రపంచం రోజు రోజుకీ మారుతుంది గురూ, ఎవరైతే కలిసి కట్టుగా ఉంటారో వాళ్ళు గెలుస్తారు. కలిసి పని చేయటం, ఇతరులతో భాగస్వామ్యం ఏర్పరచుకోవటం చాలా ముఖ్యం. అవతల వాళ్ళని పగ వాళ్ళు అని, ప్రత్యర్ధులు అని అనుకోకుండా కలుపుకొని, కలిసి పని చేస్తేనే ప్రస్తుత ప్రపంచంలో విజయం సాధిస్తారు. అంతే కాని చిన్న చిన్న వాటికి సొంత వాళ్ళతో, సొంత పార్టీ కార్యకర్తలతో, సొంత కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎట్టి పరిస్థితుల్లో గొడవలు పెట్టుకోకూడదు. కలిసికట్టుగా ఉండటం విజయం, కలిసి మెలసి పని చేయటం విజయం, కలిసి బతకటం విజయం.
ప్రస్తుతం అయితే ప్రపంచం మొత్తంలో 3 వ స్థానంలో హోండా కంపనీ, 6 వ స్థానంలో నిస్సాన్ కంపనీ ఉంది. ఈ రెండూ జపాన్ కంపనీలే అయినా ఇంకో జపాన్ కంపనీ టయోటాతో గట్టి పోటీ ఉంది. ఇంకా, అమెరికాలో టెస్లా, ఫోర్డ్ కలిసి పనిచేస్తూ తమ మార్కెట్ షేర్ పెంచుకోవాలని చూస్తున్నై.
ఇంకా చైనాకి చెందిన BYD కార్ల కంపనీతో, కొరియాకి చెందిన హుండైతో, జర్మనీకి చెందిన వోక్స్ వాగన్ తో, ఈ మధ్య బాగా పుంజుకుంటున్న భారత్ కార్ల మార్కెట్ తో తమకి పోటీ ఉంది అని గమనించి – తాము ప్రపంచం మొత్తం మార్కెట్ లో 3 వ స్థానం, 6 వ స్థానంలో ఉన్నా.., కలిసి పని చేసి భవిష్యత్ లో కూడా టాప్ లో ఉండాలని హోండా కంపనీ – నిస్సాన్ కంపనీ నిర్ణయించుకోవటం వాళ్ళ ముందు చూపుకి తార్కాణం, అందుకే వాళ్ళు భవిష్యత్ లో కూడా టాప్ లో ఉంటారు.
కలిసికట్టుగా ఉండటం విజయం, కలిసి మెలసి పని చేయటం విజయం, కలిసి బతకటం విజయం. ఒకరి నుంచి ఇంకొకరు నేర్చుకొని ఇద్దరూ కలిసి ఎదగటం విజయం. – రోమన్ తత్వవేత్త జగన్నాథ్ గౌడ్… (పూర్తి వ్యక్తిగత అభిప్రాయం)
Share this Article