Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిప్పుకు ఏడు నాలుకలు… ఒకదాని పేరు కాళి… తప్పులో కాలేసిన పత్రిక…

August 4, 2022 by M S R

ఎవరైనా ప్రముఖుడు మన మ్యాగజైన్‌ కోసం రెగ్యులర్‌గా వ్యాసాలు రాస్తుంటే… ప్రివిలేజ్‌గా భావించాలి… వాటిని సరిగ్గా ప్రజెంట్ చేయాలి… గౌరవించాలి… రచయిత శైలిలో వేళ్లూకాళ్లూ పెట్టకూడదు… మరీ ఇబ్బందికరంగా ఉన్న పదాల ఎడిటింగ్ అవసరమైతే, కట్ చేయడానికి ముందు ఆ రచయితను అడగడం మర్యాద… అలాగే ఆ ఆర్టికల్‌కు సరిపడా ఇల్లస్ట్రేషన్ అవసరం… ప్రాంప్ట్‌గా తగిన గౌరవ పారితోషికం పంపించడం కూడా ముఖ్యమే… ఆ పారితోషికం వాళ్లకు చిన్నదే కావచ్చు, కానీ అది గౌరవం… ఎస్, మంచి వ్యాసాలు రాయించుకోవడం అనేది ఓ కళ…

కానీ ఈ కళలో దివీక్ అనే మ్యాగజైన్ పూర్… ఆర్టికల్స్ ప్రచురణలో తన టేస్ట్, తన స్కిల్ ఏమాత్రం బాగాలేవని తనే నిరూపించుకుంది… పేరున్న మ్యాగజైనే… ఏం లాభం..? వివేక్ దేవరాయ్ (బిబేక్ దేబరాయ్) అనే కాలమిస్టు ఆగ్రహంతో, అసంతృప్తితో ఇకపై నేను సదరు మ్యాగజైన్‌కు ఆర్టికల్స్ రాయను అని తేల్చిపారేశాడు… దీన్ని కూడా సదరు పత్రిక వక్రీకరిస్తుందేమోనని అనుమానమొచ్చింది… అందుకే తను ఎందుకు ఇకపై ఆ మ్యాగజైన్ కాలమిస్టుగా ఉండదలుచుకోలేదో ట్వీట్ కొట్టాడు… ఓ లెటర్ రాసి, దాన్ని కూడా జతచేశాడు…

ఇది ఒకరకంగా ఆ పత్రికకు సిగ్గుచేటు… నిజానికి పత్రికలో వచ్చే ప్రతి అక్షరానికీ బాధ్యత వహించాల్సింది ఆ పత్రికే… అందుకని ఎవరు ఏది రాస్తే అది పబ్లిష్ చేయాల్సిన పనిలేదు, మరీ ఇబ్బందికరంగా ఉంటే కొన్నిసార్లు కాలమ్స్ అవాయిడ్ చేయవచ్చు… కానీ ఓ కాలమ్‌కు ఏమాత్రం సూట్ కాని ఓ బొమ్మను వాడి, కాలమ్ స్థాయిని దిగజార్చడం మ్యాగజైన్ తప్పే… ఎట్‌లీస్ట్, సాక్షాత్తూ ఆ కాలమిస్టే అలా అభిప్రాయపడుతున్నాడు…

Ads

ఈమధ్య ప్రతి వివాదానికి మతమో, దేవుళ్లో కారణమవుతున్నారు కదా… ఇదీ అంతే… నిజానికి ఈ వివేక్ కూడా అల్లాటప్పా కాలమిస్ట్ ఏమీకాదు… తెలుగు పత్రికల్లోలాగా ఏదో ఒకటి గీకేసి, పాఠకుల మొహాన కొట్టే టైపు కూడా కాదు… తను ప్రముఖ ఆర్థికవేత్త… రచయిత… ప్రధానమంత్రి ఆర్థికసలహామండలి (the Economic Advisory Council to the Prime Minister of India) అధ్యక్షుడు… ఆమధ్య తను ఓ ఆర్టికల్ రాశాడు… దానికి ‘‘అగ్గికి ఏడు నాలుకలు, అందులో ఒకటి కాళి’’ అని హెడింగ్ పెట్టారు… ఇదుగో ఇలా…

సరే.., అగ్గి నాలుక-కాళిక అనే పదాలు బాగానే ధ్వనిస్తున్నయ్… అయితే దానికి ఫీచర్డ్ ఇమేజీగా ఇదుగో ఈ బొమ్మను జతచేశారు… తాంత్రిక కాళి బొమ్మ… అదీ మ్యాగజైన్ ఆ కాలమ్ కోసం గీయించిన బొమ్మేమీ కాదు… గూగుల్ సెర్చింగులో గెట్టీ ఇమేజెస్‌లో దొరికేదే… అసలు ఆ వ్యాసంలోని అంశాలకూ, ఈ బొమ్మకూ పొంతన ఉండదు… పైగా ఆ బొమ్మ చూడగానే వ్యాసం ఇంపార్టెన్స్, స్థాయి మీద కూడా ఓ తేలిక అభిప్రాయం కలిగే చాన్స్ ఉంది… సదరు ప్రముఖ కాలమిస్ట్ కూడా అదే ఫీలయ్యాడు… 

‘‘అయ్యా… కాళిక నాలిక కాలమ్ రాయమన్నది మీరే… దానికి మీరు ఉపయోగించిన కాళి బొమ్మ అస్సలు ఆప్ట్ కాదు… దీని ఎంపికలోనూ ఏదో ఉద్దేశం ఉన్నట్టు అనిపిస్తోంది నాకు… కనీసం ఓసారి నన్నడిగినా బాగుండేది… ఈ ధోరణి నాకేమీ నచ్చడం లేదు… మీ నుంచి నేను ఊహించలేదు కూడా… గతంలో కాస్త పద్ధతిగా అనిపించేది… నా కాలమ్‌కు ఆ బొమ్మ వాడటం వెనుక మీ ఉద్దేశం ఏమైనా సరే, మీరేం పొందారో ఏమో… కానీ నాలాంటి మంచి స్నేహితుడిని, శ్రేయోభిలాషిని మాత్రం పత్రిక దూరం చేసుకుంది…

ఒక బంధం ఏర్పడటానికి, నిలబడటానికి, కొనసాగడానికి కొంత సమయం తీసుకుంటుంది… హఠాత్తుగా ట్రస్ట్ అనేది ఏర్పడదు… కానీ మీ పత్రిక విషయంలో నాకెప్పుడూ సత్సంబంధాలు, సదభిప్రాయాలే ఉన్నాయి… అందుకే ఆమధ్య మీరు మీ పత్రిక కొత్త లోగోను ఆవిష్కరించాలని అడిగితే అంగీకరించాను… కానీ అప్పుడప్పుడూ ఓ చిన్న చర్య మొత్తం బంధాల్ని ధ్వంసం చేస్తుంది… ఇదీ అలాగే ఉంది… ఇకపై రాసే కాలమ్స్‌కు కూడా ఎలాంటి బొమ్మలు వాడతారో అనే సందేహం పీడిస్తూ ఉంటుంది నన్ను… అందుకని మీకు దూరంగా ఉండటమే మేలు అనిపిస్తోంది… వీడ్కోలు…’’ అని రాశాడు సంపాదకుడికి రాసిన లేఖలో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions