.
ఈసారి బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఎంపిక ఎంత ఘోరంగా జరిగిందో మరోసారి స్పష్టంగా కనిపించింది… అసలు సెలబ్రిటీల ఎంపికే ఓ దరిద్రం అనుకుంటే, కామనర్ల ఎంపిక మరీ దారుణం…
ఒక్కొక్కరూ ఓ స్పెషల్ కేరక్టర్… హరిత హరీష్ అనే ఓ సైకో కేరక్టర్ గురించి చెప్పుకున్నాం కదా… బిగ్‌బాస్ నీకు దమ్ముంటే బయటికి పంపించు అన్నాడు… అన్నం మీద అలుగుతాడు… ఎప్పుడూ మొహం సీరియస్‌గా పెట్టి, ఆ షో మీదే చిరాకు పుట్టిస్తున్నాడు…
Ads
మర్యాద మనీష్ అని మరో కేరక్టర్… ఏదో ఓ పిచ్చి సాకుతో అన్నం మీద అలిగాడు… అఫ్‌కోర్స్, ఈసారి ఫుడ్ అనేది పెద్ద టాస్క్ అయిపోయింది ఈసారి… డబుల్ హౌజ్ అన్నారు గానీ డబుల్ ట్రబుల్ అయిపోయింది… ప్రియ ఓ టైపు, శ్రీజ మరో టైపు… వీళ్లకు తోడు ప్రియ ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కాదు… డెమోన్ పవన్, పవన్ కల్యాణ్… ఏం సెలక్షన్స్‌రా బాబూ…
నాగార్జున ఏదో అడుగుతుంటే వీళ్లేదో చెబుతున్నారు… అదీ తలలెగరేసి మరీ..! వీళ్లు ఆ అడ్డమైన అగ్నిపరీక్ష పైత్యపు టాస్కుల్లో గెలుపొంది వచ్చిన వీరులట ఫాఫం…!
డెమోన్ హౌజుకు కెప్టెన్ అయ్యాడు కదా… అసలు తను కెప్టెన్సీ టాస్కులో ఆడిన తీరే చెత్తా కాగా… రీతూ చౌదరి పిచ్చి పిచ్చి సంచాలక్ చేష్టలతో ఆ పోటీనే చెడగొట్టింది… రెండు మూడు వీడియోలు చూపించి మరీ, రీతూ నిర్వాకాన్ని చూపించి, నాగార్జున వీకెండ్ షోలో కడిగేశాడు…
అంతేకాదు, డెమోన్ కెప్టెన్సీని ఊడబీకేశాడు… ఇలాంటిది తెలుగు బిగ్‌బాస్ షోలో మొదటిసారి కావచ్చు బహుశా… రీతూ చౌదరి తలదించుకుంది… ఇంకో కొత్త పరీక్ష పెట్టి కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేద్దాం అన్నాడు… ఇప్పుడు సీన్ రివర్స్… కామనర్స్ ఔట్ హౌజులోకి… సెలబ్రిటీలు మెయిన్ హౌజులోకి…
ఇన్నాళ్లూ సంచాలక్ నిర్ణయాలే ఫైనల్ అంటున్నారు కదా, మేమేం చేసినా ఏమీ కాదులే అనుకుని ప్రియ, రీతూే తాము సంచాలక్స్‌గా ఉన్న పోటీల్లో ఇష్టారాజ్యం బయాస్డ్ నిర్ణయాలు ప్రకటించారు… నాగార్జున కడిగేసేసరికి తలలు వంచుకున్నారు… వాళ్లు నాగార్జున ఇలా అటాక్ చేస్తాడని ఊహించి ఉండరు… తమది తప్పే అని ఒప్పుకోవాల్సి వచ్చింది చివరకు… సారీ చెబుతూ…
హౌజులో ఉన్నవాళ్లలో భరణి అసలు అర్థం కాని కేరక్టర్… తనూజ అందరిలోకన్నా బెటర్ అనిపిస్తోంది… రాము రాథోడ్, ఇమాన్యుయేల్ కూడా… ఇమ్మూ తన కామెడీతో కాస్త షోను బతికిస్తున్నాడు… సుమన్ శెట్టి పర్లేదు… ఫ్లోరా, సంజన దోస్తీ వెరయిటీగా ఉంది… సంజన భలే ప్లే చేస్తోంది… రీతూ విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి…
మర్యాద మనీష్‌ను ఎలిమినేట్ చేసినట్టున్నారు, ఈరోజు చూడాలి… కానీ అర్జెంటుగా 2.0 పేరిట కొత్త కంటెస్టెంట్లను గనుక ప్రవేశపెట్టకపోతే… రేటింగ్స్ మరీ పాతాళంలోకి పడిపోయే ప్రమాదముంది బహుపరాక్ బిగ్‌బాస్ టీమ్…! వాళ్లూ ఇలాగే ఏడిస్తే ఈసారి బిగ్‌బాస్ షో మరింత దారుణంగా ఫ్లాప్ కావడమూ ఖాయం..!!
Share this Article