సినిమా అంటే అందరినీ అలరించాలి… ఇంతటి కరోనా దుర్దినాల్లో కూడా రకరకాల భయాలను అధిగమించి థియేటర్ దాకా వచ్చే ప్రేక్షకుడిని ఎంటర్టెయిన్ చేయాలి… ఇండస్ట్రీ చుట్టూ అలుముకున్న భవిష్యత్తు ఆందోళన చీకట్లను తరిమేసేలా ఉండాలి… పర్లేదు, జనం వస్తారు అనిపించేలా ఉండాలి… హెబ్బే, అబ్బే, అవన్నీ ఆలోచిస్తే అది సౌతిండియన్ సినిమా ఎందుకవుతుంది..? మనం ఈరోజుకూ మనకు అలవాటైన రొడ్డకొట్టుడు రొటీన్ ఫార్ములా ఇమేజీ ఫార్మాట్ వదిలేస్తే కదా… దిక్కుమాలిన కథ, తలకుమాసిన కథనం, లాజిక్ లేని సీన్లు, వాంతి కలిగించే సీన్లు, లాజిక్కుల్లేని ట్విస్టులు…. ప్లస్ అన్నింటికీ మించి సొల్లు హీరోల వ్యక్తిపూజలకూ, కీర్తనలకూ, భజనలకూ కేరాఫ్ వేదికలు… జనం మారుతున్నారు అనే ఇంగితం కూడా లేదు ఈ దేవపుత్రులకు…
మన సౌత్ సినిమా మారదు… ఆ మూసీ మురికి వాసనను వదిలించుకోదు… దానికి ప్రబలమైన నిదర్శనం… విజయ్ నటించిన మాస్టర్… అది అసలే తమిళ సినిమా… డబ్ చేసి వదిలారు… ప్యూర్ అరవ వాసన… ఒరే, వాటిని ప్రేక్షకులు భరించడం లేదు, రోజులు బాగాలేవురా బ్రదర్ అన్నా వినేవాడు ఎవడు..? బిల్డప్పు, బిల్డప్పు… వెరసి ఢమాల్… ఫోరా, నువ్వూ నీ హీరోయిజమూ అని ప్రేక్షకులు థూ అనేశారు… నిజానికి ఆ సినిమాలో మనం మెచ్చుకుని చప్పట్లు కొట్టే సీనేమీ లేదు… ప్రేక్షకుల తిరస్కరణకు అర్హమైన సినిమా… దాన్ని అలా వదిలేయండి, దాని గురించి మాట్లాడుకోవడమే వేస్ట్… అది ఓ సినిమా కాదు, దాన్ని చూసే పనీ లేదు…
Ads
పరమ దరిద్రం అని చెప్పుకోవాల్సింది ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా గురించి… ఆ దర్శకుడికీ, ఆ హీరోకు, ఆ నిర్మాతకు…. కాదు, కాదు, ఆ సినిమా ఫైనాన్స్ చేసిన హీరో తండ్రికీ చెంప పగిలిపోయింది… ప్రేక్షకుల అభిరుచిని తక్కువ అంచనా వేసినందుకు తగిన శిక్ష విధింపబడింది… అసలు బెల్లంకొండ సురేష్ అంటేనే నాటి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు గట్రా తెలుసు కదా… తన లెవెల్ అది… తను కూడా సినిమాలు తీస్తాడు, ప్రేక్షకుల మీదకు వదిలేస్తాడు… నా కొడుకు హీరో అని బిల్డప్ ఇస్తాడు… ఏమైంది..? ఫోఫోరా కుయ్యా అని ప్రేక్షకులు ఇరగదీసి కొట్టేస్తున్నారు,… ఏయ్, జాగరీ, టేక్ కేర్…
ఈ రాష్ట్రం మాది, ఈ రాజ్యం మాది, ఈ జనం పిచ్చోళ్లు… మనం ఏది చూపిస్తే అది చూసి చప్పట్లు కొడతారు… తుచ్ఛమైన ఈ టీవీ చానెళ్లు డప్పులు కొడతాయి అనుకునే భ్రమల్లో ఉన్న పోతినేని రాముడు అలియాస్ హీరో రామ్ చెంప పగులగొట్టారు జనం… ఒరేయ్ నాన్నా, నువ్వు ఇస్మార్ట్ శంకర్ అనే ఓ తలతిక్క సినిమా తీస్తే ఆదరించాం కదాని మరో వెధవ సినిమాను మామీద రుద్దితే భరిస్తామా అని ఛీత్కరిస్తున్నారు… ఇదే రాముడి కుటుంబానికి చెందిన బెజవాడ కోవిడ్ హాస్టల్ అగ్నిప్రమాదం ప్రమాదమృతులు చప్పట్లు కొట్టేలా…. థూమీబచె అని జనం తిరస్కరిస్తున్నారు… నిజానికి ఈ సినిమాకు అంత సీన్ ఏమీ లేదు… పరమ దరిద్రం…
మరో సినిమా క్రాక్… అసలు రవితేజ కేరక్టరే క్రాక్… తన సినిమాలు, తన పాత్రలు, తన ఎంపికలు ఫుల్లు క్రాక్… వాడు మారడు… వాడు అనడానికి సాహసిస్తున్నాం… వాడు క్రాక్… వాడి ఈ తాజా సినిమా కూడా అంతే… కాకపోతే వాడి లక్కు బాగుంది… పోటీ సినిమాలతో పోలిస్తే కాస్త బెటర్… అలాగని వాడు బెటర్ అని కాదు… నాలుగు డబ్బులు చేసుకుంటాడు… వెరసి ఫలితం ఏమిటి..? తెలుగు సినిమా మారలేదు, మారదు… ఈ నాలుగు సినిమాలూ ఫ్లాప్… వీటికన్నా ఓటీటీల్లో మంచి సినిమాలు వెతుక్కుని చూడటం బెటర్ అని అనుకుంటున్నారు ప్రేక్షకులు… లేదంటే వెబ్ సీరీస్…. మరీ కాదంటే… ఎందుకూ కొరగాని టీవీ సీరియళ్లే బెటర్ అనుకుంటున్నారు… చివరకు తెలుగు సినిమాను ఈ స్థితికి తీసుకొచ్చారు… థూమీబచె….
Share this Article