హాట్ స్టార్ – వాల్ట్ డిస్నీ తెలుసు కదా… ఓటీటీ, పలు భాషల్లో సినిమాల రిలీజ్, వెబ్ సీరీస్, వీడియో ఆన్ డిమాండ్… చాలా పాతుకుపోయింది వినోదరంగంలో… ఇప్పుడిది మాంచి బలమైన మూలాలున్న జాయింట్ వెంచర్ భాగస్వామి కోసం అన్వేషిస్తోంది… అసలు వీలయితే అమ్మేయాలని అనుకుంటోంది మంచి పార్టీ దొరికితే… విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన ఓ నివేదిక ప్రకారం… ఈ ప్రయత్నాలు చాలా ప్రాథమిక దశలోనే ఉన్నయ్… ఇంకా ఏ పొటెన్షియల్ పార్టీని సంప్రదించలేదు…
ఈ బలమైన గ్రూపు కూడా రిలయెన్స్ నుంచి పోటీని తట్టుకోలేక తట్టాబుట్టా సర్దుకునే ప్రయత్నం చేస్తోంది… లేదా ఏ ఆదానీయో పార్టనర్‌గా చేరితే నిలదొక్కుకుంటామని ఆశపడుతోంది… ఈమధ్య జరిగిన ఐపీఎల్ డిజిటల్ మీడియా హక్కులను రిలయెన్స్ గెలుచుకున్నాక హాట్‌స్టార్ బలమైన పోటీని ఎదుర్కుంటోంది… రిలయెన్స్ తన స్ట్రీమింగ్ సర్వీస్ జియో సినిమా పరిధిని విస్తరించడానికి వార్నర్ బ్రదర్స్ ప్రోగ్రామ్స్ కోసం సంప్రదింపులు జరుపుతోంది… వార్నర్ బ్రదర్స్‌కు డిస్కవరీతో దీర్ఘకాల ఒప్పందం కుదిరింది…
రిలయెన్స్ తన విస్తరణ ప్రణాళికల్ని జాగ్రత్తగా రచిస్తోంది… ఇంకోవైపు వాల్ట్ డిస్నీ ఆర్థిక స్థితి అంత బాగాలేదు… ఈ కంపెనీలో వేల ఉద్యోగాలను తీసేయాలని యోచిస్తోంది… వార్షిక వ్యయం కోతలో భాగంగా కనీసం ఏడు వేల మందిని ఇంటికి పంపించబోతోంది… ఫిబ్రవరిలో కంపెనీయే ఈ విషయం వెల్లడించింది… ఏప్రిల్‌లో మొదటి రౌండ్ తొలగింపుల్లో భాగంగా వేల మందికి పింక్ స్లిప్పులు అందించింది… సిబ్బందికి ఏడాది ‘తొలగింపుల ప్యాకేజీ’ ఇవ్వనుంది…
Ads
వెంటనే తీసేస్తే బజారున పడకుండా, ఆరు నెలలు కొలువులో కొనసాగించడానికి ఓ ఏజెన్సీని కూడా నియమించారు… ఇదంతా వినోదరంగంలో నెలకొన్న పోటీని, తద్వారా దిగజారుతున్న ఆర్థిక స్థితిగతులను తెలియచేస్తోంది… డిస్నీ- హాట్‌స్టార్ పరిస్థితే ఇలా ఉంటే ఇక మామూలు వినోద సంస్థల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పాలా..?
Share this Article