.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు… జియో పాలిటిక్సులో కూడా..! అంటే, ప్రపంచ రాజకీయాల్లో కూడా..!
పైకి చూడబోతే… తీయగా మాట్లాడుతున్నట్టు నటిస్తూనే… ఇండియాకు వ్యతిరేకంగా ట్రంపు తీసుకుంటున్న సుంకాల దాడి నిర్ణయాలు కేవలం తమ దేశపు వ్యవసాయ ఉత్పత్తులను ఇండియాలో డంప్ చేసేందుకు వీలుగా… ట్రేడ్ డీల్ దిశలో ఇండియాపై ఒత్తిడి క్రియేట్ చేసి, లొంగదీసుకోవడం కోసమే అనిపిస్తుంది… కానీ..?
Ads
దాని వెనుక బ్రిక్స్‌ను అడ్డుకోవడం, రష్యాను ఏకాకిని చేయడం వంటి చాలా వ్యూహాలూ ఉన్నాయి… వీటి విపరిణామాలు ప్రపంచ రాజకీయాల గతిని మార్చబోతున్నాయి… ప్రత్యేకించి బ్రిక్స్ కూటమిని బలోపేతం చేసి, అమెరికా దాని మిత్రదేశాలను కార్నర్ చేయడం లేదా రష్యా, ఇండియా, చైనా కూటమి ఏర్పడి… కొత్త అగ్రధ్రువాన్ని క్రియేట్ చేయడం… ఇందులో ఏది జరిగినా అమెరికాకే ధ్వంసకారణం…
ఎటొచ్చీ ఇండియా, రష్యా, చైనా కూటమి ఏర్పడినా… చైనా ఎప్పుడూ ఎవడూ నమ్మలేని దేశం… జీరో క్రెడిబులిటీ… అదొక్కటే ఇండియాను పదే పదే వెనక్కి లాగేది… ఒకవేళ రష్యా మధ్యవర్తిగా ‘వాస్తవాధీన రేఖ’ వెంబడి చైనా కవ్వింపు వేషాలకు అడ్డుకట్ట వేయగలిగితే, బలగాల ఉపసంహరణ చేయించగలిగితే… ఏమో, రిక్ (రష్యా, ఇండియా, చైనా) కూటమి సాకారం కావచ్చు…
ఎలాగూ బ్రిటన్ ఇండియాతో భారీ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది రీసెంటుగా… బ్రెజిల్ ముందుకొస్తోంది… ఇతర అమెరికా సుంకాల బాధిత దేశాలు కూడా ముందుకొస్తే… అత్యంత భారీ ట్రేడ్ డీల్స్‌ను మోడీ టీం సక్సెస్ చేయబోతోంది… ప్రపంచంలో ఇప్పుడు ఎవడు ఎవడిని బెదిరించినా తలవంచడు, ఎవడి ప్లాన్స్ వాళ్లకుంటాయి… ఇది ట్రంపుకు అర్థమయ్యే సమయానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోతుంది…
సరిగ్గా కౌంటర్ చేసేవాడు ఎప్పుడూ త్వరపడి ఎదుటోడి మాటలకు, చేష్టలకు రియాక్ట్ కాడు… సైలెంటుగా చేయాల్సింది చేస్తాడు… ఇండియా చేస్తున్నది ఇదే… మోడీ చైనాకు వెళ్లనున్నాడు, పుతిన్ ఇండియాకు వస్తున్నాడు, నెతన్యాహు వస్తానంటున్నాడు… బ్రెజిల్ సై అంటోంది… తెర వెనుక జరగాల్సినవి అన్నీ జరుగుతున్నాయి…
ఇక్కడ ఇండియా కోణంలో మరో చిక్కుముడి… అత్యంత ధూర్తదేశం పాకిస్థాన్‌తో అమెరికా దోస్తీ… అది టెర్రరిజం ఫ్యాక్టరీ అని తెలిసీ ఎంకరేజ్ చేస్తుంది… చివరకు ట్రంపు కుటుంబం పాకిస్థాన్ ఆర్మీ జనరల్‌తో ఆర్థిక, వ్యాపార సంబంధాలు, క్రిప్టో కరెన్సీ డీల్స్ పెట్టుకుంటోంది… మరోవైపు పాకిస్థాన్ చైనాకూ మిత్రదేశమే… ఒకవైపు అమెరికాతో పోరుకు, ఇండియాతో దోస్తీకి సిద్ధపడితే పాకిస్థాన్‌తో చైనా సంబంధాల మాటేమిటి..? ఓ చిక్కు ప్రశ్న…
ట్రంపు మూర్ఖత్వం ఏ స్థాయికి చేరిందీ అంటే… అమెరికన్ కంపెనీలు ఇండియన్లను రిక్రూట్ చేసుకోవద్దట… బహుళ జాతి సంస్థలు ఇండియా నుంచి దిగుమతులు ఆపేయాలట… ఇండియా, చైనా గనుక ఫార్మా ఎగుమతులు ఆపేస్తే అమెరికా అల్లకల్లోలం అవుతుంది… ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లేకపోతే అమెరికాలో తూర్పు తెల్లారదు…
సింపుల్‌గా మోడీ ప్రభుత్వం ఏం చేసింది..? 3.6 బిలియన్ల డాలర్ల అమెరికా విమానాల కొనుగోలును పెండింగులో పడేసింది… ఇది ఫస్ట్ రివర్స్ అటాక్… అమెరికాకు మన ఎగుమతులు స్థంభిస్తే… టెక్స్‌టైల్స్ వంటి ఎగుమతులకు ఇండియా కొత్త మార్కెట్లు వెతుకుతోంది… కొత్త సప్లయ్ చెయిన్ క్రియేట్ చేస్తోంది… ఇవన్నీ అమెరికన్ కంపెనీలకే దెబ్బ… పెద్ద పెద్ద కంపెనీలే ఇప్పుడు ట్రంపు మీద ఒత్తిడి మొదలుపెడుతున్నాయి… గో స్లో అంటూ…
ఒకరకంగా ట్రంపు ఇండియాకు మంచే చేస్తున్నాడు… అమెరికాను గుడ్డిగా నమ్మి వాడివైపు మొగ్గకుండా, తలొగ్గకుండా మనల్ని రియల్ ఫ్రెండ్స్ ఎవరో మరోసారి తేల్చుకోమని చెబుతున్నాడు… ప్రపంచ దేశాలు కూడా భిన్నధ్రువాలుగా మళ్లీ పోలరైజ్ కాబోతున్నాయి… మన విదేశాంగ, వాణిజ్య మంత్రిత్వ శాఖలకు ఫుల్లు పని… జరిగేదంతా మంచికే, నడుమ కాసిన్ని తలనొప్పులు… అంతే…
Share this Article