హహహ… పొద్దున లేవగానే వెలుగు అనే కాషాయ దినపత్రిక అలియాస్ బీజేపీ లీడర్ వివేక్ కరపత్రికలో ఓ వార్త… వరస్ట్ సీఎంలలో కేసీయార్‌కు కేసీయార్ 4వ ప్లేస్ అనే వార్త కనిపించింది… ఔనా..? ఓ సర్వే సంస్థ వరస్ట్ సీఎంలు అనే కేటగిరీలో ప్రశ్నలు అడిగి సర్వే చేసిందా అనే డౌటనుమానం రావడం సహజం కదా… ఎవడు బాబూ ఈ సర్వే చేసింది అని చూస్తే ఏబీపీ-సీవోటర్ అనే సంస్థ అట… ఓహో, అదా..? దాని కథేమిటో మనకు తెలుసు కదా… ఇంతకీ వాడేం సర్వే చేశాడు, ఈ ఘన పాత్రికేయం ఏం రాసిందీ అని చూస్తే…. సదరు సర్వే సంస్థ బెస్ట్ సీఎంలు అని ఓ సర్వే చేసిందట… అందులో దిగువ నుంచి కేసీయార్ నాలుగో ప్లేసులో ఉన్నాడట… దాంతో వరస్ట్ సీఎంలలో నాలుగో ప్లేస్ అని ముద్ర వేసేసింది… వావ్, ఒక్కొక్కరికీ మెగెసెసే అవార్డు ఇవ్వాలిరా భయ్….
ఈ మాటంటే కోపం… ఘనపాత్రికేయులు కదా… ఆ దిక్కుమాలిన సర్వే సంస్థ ఏం సర్వే చేసింది..? దేశవ్యాప్తంగా 30 వేలమందిని… మీరు చదివింది నిజమే… 130 కోట్ల మంది ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించందుకు అది ఎంచుకున్నవారి సంఖ్య 30 వేలు… మీ దృష్టిలో బెస్ట్ సీఎం ఎవరు అని అడిగిందట… అంటే ఓ జనరల్ ప్రశ్న… ఆ శాంపిల్ సంఖ్యే చాలా చాలా చాలా తక్కువ… దాని నాణ్యత ఏంటో తెలియదు… పైగా ఒక సీఎం పనితీరు, ఆదరణ, యాక్సెప్టెన్సీ గురించి అడగాలంటే ఆ రాష్ట్ర ప్రజలను అడగాలి… అంతేతప్ప, దేశప్రజలందరినీ అడిగితే ఏం తెలుస్తుంది..? దానికి ఉండే శాస్త్రీయత ఎంత..? అందులో నిజం ఎంత..?
Ads
ఆ దరిద్రమైన సర్వే సంస్థ నిజానికి సర్వే చేసింది మోడీ, ఎన్ఢీయే ఎట్సెట్రాల మీద జనాభిప్రాయం కోసం… పనిలోపనిగా సీఎంల గురించి అడిగింది… సరే, అడిగిందిపో, ఏ సీఎం గురించి ఆ రాష్ట్ర ప్రజలను కదా అడగాల్సింది… కానీ అది అసలే తలతిక్క సర్వే సంస్థ కదా… జనరల్ ప్రశ్న అడిగింది… ఒక త్రిపుర సీఎం గురించి ఒక కేరళ ప్రజలు ఏం చెప్పగలరు..? ఒక ఉత్తరాఖండ్ సీఎం పనితీరు గురించి ఒక తెలంగాణ ప్రజలు ఏం చెప్పగలరు..? ఏమైనా లాజిక్ ఉందా అసలు..?
సరే, వాడెవడో ఏదో అడిగాడు, జనం ఏదో చెప్పారు, ఇక దాన్ని బట్టి ఎవడికి తోచిన విశ్లేషణలు, ఎవడికి ఇష్టమొచ్చిన వ్యాఖ్యానాలు వాడు సోషల్ మీడియాలో షురూ… అసలు వరస్ట్ సీఎం అనే కేటగిరీలో ప్రశ్నే లేదు, ఉండదు అని ఎవడు చెప్పినా ఇక ఎవడూ వినడు… కేసీయార్ వరస్ట్ నాలుగో సీఎం అంటూ పోస్టులు… సరే, పెడితే పెట్టారు, నిజంగానే తెలంగాణలో ప్రస్తుతం కేసీయార్‌కు ఉన్న స్థానం అదే అనుకుందాం… కానీ అది చెప్పాల్సింది తెలంగాణ ప్రజలు కదా…
వోకే, ది వరస్ట్ సీఎం అనుకుందాం… ఢిల్లీలో గాయిగత్తర లేపుతా అని గప్పాలు కొట్టి, ఢిల్లీ వెళ్లొచ్చి మళ్లీ బయటికి రాకుండా మొహం చాటేసిన సీఎం తను… తనకు ఏ క్రెడిబులిటీ లేదు, ఎవడూ నమ్మడం లేదు అనేదే నిజం అనుకుందాం… కానీ అది చెప్పాల్సింది తెలంగాణ ప్రజలు… అందులోనూ నాణ్యమైన సర్వే శాంపిళ్లు అవసరం… అదేమీ లేకుండా ఎవడో ఏదో సర్వే అంటాడు, మిగతా పత్రికలు, సోషల్ మీడియా రెచ్చిపోయి ఏదేదో రాసేస్తాయి… ఇక్కడ కేసీయార్‌కు ఇది అనుకూల డప్పు కాదు… ఆ సర్వే ప్రామాణికత ఎంత అనేదే…!!
Share this Article