హమాస్ కి చివరి చీఫ్ యాహ్య సిన్వార్ మరణించాడు! బిన్ లాడెన్ ని మట్టు పెట్టడానికి అమెరికా దాని మిత్ర దేశాలకి ఒక దశాబ్దం పట్టింది! హమాస్ ని తుదికంటా మట్టు పెట్టడానికి ఇజ్రాయేల్ కి ఒక సంవత్సరం పట్టింది!
అక్టోబర్ 7,2023 న ఇజ్రాయేల్ మీద దాడి చేసి సాధారణ పౌరులు 1258 మందిని క్రూరంగా హింసించి చంపి, మరో 250 మందిని బందీలుగా పట్టుకెళ్లిన సంఘటనకి కారకుడు మరియు మాస్టర్ మైండ్ హమాస్ ముఖ్య నాయకుడు యాహ్య సిన్వర్ ( Yahya Sinwar ) ని మట్టుపెట్టింది ఇజ్రాయేల్!
గత సంవత్సరం అక్టోబర్ లో మొదలుపెట్టిన హమాస్ మీద యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కానీ సంవత్సరం నుండీ యహ్య సిన్వార్ మోస్సాద్, IDF లకి దొరకకుండా తప్పించుకుంటూ వచ్చాడు! గాజా లోని ప్రజలని రక్షణ కవచంగా వాడుకుంటూ తప్పించుకుంటూ వచ్చాడు!
Ads
నాలుగు నెలల క్రితం గాజాలోని ఒక సొరంగంలో యహ్య సిన్వర్ ఉన్నాడని సమాచారం అందడంతో IDF దాడి చేయడానికి ప్రయత్నించి, తనతో ఇజ్రాయేల్ పౌరులు బందీలుగా ఉన్నారని భయపడి దాడి తీవ్రత తగ్గించింది IDF. కానీ గాజాలోని మహిళలకి ఆధునిక దుస్తులు వేసి అచ్చం యూదు, అమెరికన్ మహిళలు అనిపించేలా తయారు చేసి తనతో తిప్పుకుంటున్నాడు యహ్య సిన్వర్! చివరికి కేవలం తుపాకులతో సొరంగంలో వెళ్లి ఫైరింగ్ ఓపెన్ చేశారు IDF సైనికులు. మోకాళ్ళ కిందకి కాల్చడం వలన మహిళా బందీల ప్రాణాలకి ముప్పు ఉండదని భావించింది IDF. తీరా దగ్గరికి వెళ్లి ముఖానికి ఉన్న ముసుగు తీసి చూస్తే వాళ్ళు అరబ్ మహిళలు! యహ్య సిన్వర్ కొద్దిలో తప్పించుకున్నాడు.
So! యహ్య సిన్వర్ తో పాటు హమాస్ నాయకులు అందరూ తమ స్వంత మనుషులని కవచంగా వాడుకొని వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారకులు అయ్యారు!
*******
యహ్య సిన్వర్ ఎలా చనిపోయాడు?
Well ! గత సంవత్సర కాలంగా యాహ్య సిన్వర్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అంటూ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ రావడం, IDF దాడి చేయడం, తీరా చూస్తే దాడిలో హమాస్ ఫైటర్స్ చనిపోవడం జరిగింది తప్పితే యహ్య సిన్వర్ దొరకలేదు!
రెండు సార్లు దొరికినట్లే అనుకున్న సమయాల్లో కూడా వేగంగా అక్కడినుండి తప్పించుకోవడం జరిగింది!
ఇంటెలిజెన్స్ ఇన్ పుట్ ని ప్రతిసారీ సీరియస్ గా తీసుకొని దాడి చేస్తూ వస్తున్నది IDF!
గత గురువారం రోజున కూడా రొటీన్ ఇంటెల్ ఇన్పుట్ వచ్చింది IDF కి!
గాజా దక్షిణ ప్రాంతంలో ఒక ఇంటిలో యహ్య సిన్వర్ ఉన్నట్లుగా ఇంటెల్ రిపోర్ట్ సారాంశం! అప్పటికే ఆ ప్రాంతంలో IDF ఉంది.
ఇంటెల్ రిపోర్ట్ మరియు లొకేషన్ కోఆర్డినేషన్ సహాయంతో IDF వెంటనే ఆ ఇంటి మీదకి MERKAVA MBT ని దాడి చేయమని ఆదేశాలు ఇచ్చారు.
మెర్కవ టాంక్ వెంటనే ఫైర్ చేసింది! వెంటనే IDF సైనికులు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా నలుగురు హమాస్ ఫైటర్లు చనిపోయి కనిపించారు కానీ వాళ్లలో యహ్య సిన్వర్ లేడు!
కానీ……
ఆ ప్రదేశానికి దూరంగా ఒక షార్ప్ షూటర్ ( SNIPER ) తన SNIPER గన్ కి ఉన్న స్కోప్ నుండి ఆ ఇంటి వైపే చూస్తున్నాడు!
మెర్కవ టాంక్ నుండి షెల్ ఫైర్ అవడం వల్ల ఇంట్లో దుమ్ము రేగడం వల్ల దగ్గరలో ఉన్న IDF సైనికులకి కాసేపు ఏమీ కనపడలేదు కానీ SNIPER కి ఎవరో ఆ ఇంట్లో నుండి తప్పించుకొని పక్కనే ఉన్న ఇంటి రెండో అంతస్తు లోకి పారిపోవడం కనిపించింది!
వెంటనే దగ్గరలోనే ఉన్న IDF కమాండర్ కి సమాచారం ఇచ్చి, తన దగ్గర ఉన్న మైక్రో డ్రోన్ ని ఆ ఇంటి రెండో అంతస్తులో కి పంపించాడు!
మైక్రో డ్రోన్ ఎవరో కుర్చీలో కూర్చొని ఉన్నట్లుగా విజువల్స్ చూపించింది. కుర్చీలో కూర్చుని ఉన్నది యహ్య సిన్వర్ కానీ ముఖం డ్రోన్ కెమెరాకి వ్యతిరేక దిశలో ఉండడం, డ్రోన్ శబ్దం విని సిన్వర్ కర్ర తీసుకొని డ్రోన్ వైపు చూపించిన తరుణంలో SNIPER వెంటనే అది సిన్వర్ అని నిర్ధారించుకొని ఫైర్ చేశాడు!
బుల్లెట్ సిన్వర్ తలలోంచి దూసుకెళ్లడంతో కుప్పకూలిపోయాడు!
నిజానికి సిన్వర్ తన బాడీ గార్డ్ అయిన Dr. సాలెహ్ – అల్ ఫాఫోవారి ( Saleh al Fafowari ) ని రైఫిల్ కావాలని అడిగితే అతను కర్ర ఇచ్చాడు! ఒక వేళ రైఫిల్ కనుక ఇచ్చిఉంటే సిన్వర్ డ్రోన్ ని కాల్చి అక్కడినుండి తప్పించుకునేవాడే!
IDF ఆ ఇంటి మీదకి మళ్ళీ MBT తో ఫైర్ చేసింది!
ఇల్లు కూలిపోయింది శిథిలాల మధ్యలో యహ్య సిన్వర్ శవం కనపడింది! ఫొటోలో స్పష్టంగా సిన్వర్ తల SNIPER బుల్లెట్ తో ఛిద్రం అయినట్లుగా కనపడింది!
వైద్య పరీక్షలలో అది యహ్య సిన్వర్ అని నిర్ధారించుకున్నాక IDF అధికారికంగా హమాస్ లీడర్ యహ్య సిన్వర్ ని మట్టు పెట్టినట్లు ప్రకటించింది!
*******
హమాస్ నాయకుల సంపద మొత్తం కలిపితే $ 5 బిలియన్ డాలర్లు ఉంటుంది అని అంచనా!
$2 బిలియన్ డాలర్ల అప్పు కోసం పాకిస్థాన్ నానా తంటాలు పడుతున్నది ఆరు నెలల వరకూ విదేశీ మారక ద్రవ్యం సరిపోతుంది అని!
హమాస్ నాయకుల ఆస్తులు అన్నీ ఖతార్, లెబనాన్, సిరియా దేశాలలో ఉన్నాయి.
యాహ్య సిన్వర్ భార్య హ్యాండ్ బ్యాగ్ ధర $ 35,000 డాలర్లు …
మరో వైపు గాజా స్ట్రిప్ ప్రపంచంలో అత్యంత పేదరికంలో ఉన్న ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఐక్యరాజ్య సమితి నుండి వచ్చే సహాయం కాకుండా ప్రతీ సంవత్సరం యూరోపియన్ యూనియన్ నుండి 80 మిలియన్ డాలర్లు వస్తాయి గాజాకి. కానీ ఇవేవీ గాజా ప్రజలకి అందువు. హమాస్ నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోతాయి!
ఇవి కాక గాజాకి గ్యాస్, మందులు ఉచితంగా ఇజ్రాయేల్ ఇస్తుంది.
ఇరాన్ నిర్వాకం!
లెబనాన్ లోని హెఙబొల్లా, ఎమెన్ లోని హుతి, గాజాలోని అరబ్బులు పేదరికంలో మగ్గుతున్న వారే!
రోజుకి 10 డాలర్ల లెక్కన ఒక్కొక్కరి మీద ఇరాన్ ఖర్చుపెట్టి వీళ్ళని ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నది. వీళ్ళు ఇరాన్ డబ్బులకి ఆశ పడి తమ చావుని కొనుక్కుంటున్నారు!
జోర్దాన్ కానీ, ఈజీప్ట్ కానీ వీళ్ళకి సహాయం చేయవు!
ఎంత డబ్బు వృధా అయ్యింది?
UNRWA ( United Nations Relief and Works Agency for Palestine Refugees in the Middle East ) అనేది కేవలం పాలస్టీనియన్ల పునరావాసం కోసమే స్థాపించారు 1949 లో.
హెడ్ క్వార్టర్స్ గాజా మరియు జోర్దాన్ రాజధాని అమ్మాన్ లో ఉన్నాయి.
ఐక్యరాజ్య సమితి జెనరల్ అసెంబ్లీ కి అనుబంధంగా పని చేస్తుంది UNRWA.
గాజాలోని ప్రజలకి విద్య, వైద్యంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఆహార భద్రత కల్పించడం, పరిశ్రమల స్థాపన కోసం సహాయం అందించడం అనే లక్ష్యాలతో 1950 నుండి UNRWA పనిచేస్తున్నది!
మరి గత 74 ఏళ్లుగా ఎన్ని వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ఉండవచ్చు ఇప్పటివరకూ? అవన్నీ ఏమయ్యాయి?
ఇదే ప్రశ్న జమ్మూ కాశ్మీర్ కి కూడా వర్తిస్తుంది!
అక్కడ హమాస్ నాయకులు, మన దగ్గర అబ్దుల్లా కుటుంబం బాగుపడ్డాయి!
విచిత్రం ఏమిటంటే నజారుల్లా కానీ సిన్వార్ కానీ పేదరికంలో పుట్టి హమాస్ పేరుతో కోట్ల డాలర్లకి పడగలేత్తారు!
కాశ్మీర్ నాయకుల డబ్బు, ఆస్థులు లండన్ లో ఉంటాయి కాబట్టి ఇంగ్లాండ్ వత్తాసు ఉంటుంది!
హమాస్ నాయకుల ఆస్తులు ఖతార్ లో ఉంటాయి కాబట్టి ఖతార్ వత్తాసు ఉంటుంది! (పొట్లూరి పార్థసారథి)
Share this Article