.
చిన్న వార్తలాగా కనిపించింది… కానీ పెద్ద వార్తే… తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీయార్ ఆరోగ్యం బాగాలేదు… సరే, వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, అది కాదు విషయం…
నిజానికి తన ఫామ్ హౌజులోనే చిన్న చిన్న సమస్యలను డయాగ్నయిజ్ చేసి, అవసరమైతే యశోద డాక్టర్లు అప్పటికప్పుడు అటెండ్ అవుతారు… కానీ ఈమధ్య హైదరాబాదులో ఇన్‌పేషెంటుగా చేరాడు…
Ads
తరువాత మళ్లీ అస్వస్థత… ఇప్పుడు మళ్లీ అస్వస్థత… ఏమైంది..? అసలు కేసీయార్ ఆరోగ్య పరిస్థితి ఏమిటి..? ఎలాగూ రాజకోట రహస్యం అది, బయటికి రాదు… అవసరమైతే హైదరాబాద్ లిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నారు అని ఆంధ్రజ్యోతి రాసింది… అదీ కాదు విశేషం…
ఇక ఫామ్ హౌజు అచ్చిరాదు, హైదరాబాదు సొంత ఇంటికి షిఫ్ట్ కావాలని కేసీయార్ ఆలోచిస్తున్నాడు అని మరో వార్త… అదీ కాదు విశేషం… ఎప్పుడుంటే అప్పుడు దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించవచ్చుననే భావన కావచ్చు, గుడ్, మంచి ఆలోచనే…
స్పెషల్ డాక్టర్స్ టీం వెళ్లింది, హరీష్ వెళ్లాడు, ప్రశాంత్ రెడ్డి వెళ్లాడు… కేటీయార్ హుటాహుటిన వెళ్లాడు, తోడుగా కేసీయార్ మనమడు హిమాంశు కూడా… సరే, మెడికల్ బులెటిన్ దాకా అవసరం లేదు గానీ… కవిత పోలేదు… అదొక్కటే వార్త మొత్తం చదివాక అనిపించింది…
ఎందుకంటే..? ఆమెను కుటుంబం బహిష్కరించింది… కారణాలు ఏవైనా గానీ… ఎండ్ ఆఫ్ ది డే సేమ్ బ్లడ్… కేసీయార్ చదివిన 80 వేల పుస్తకాల్లో ఉందో లేదో తెలియదు గానీ… కొడుకు ఆస్తులు చూస్తాడు, బిడ్డ ఆరోగ్యం చూస్తుంది…
- బిడ్డ ఎమోషన్ బాండ్ ఫీలవుతుంది… కొడుకు ప్రాపర్టీ బాండ్ ఫీలవుతాడు… అది అధికార వారసత్వం కావచ్చు, ఆర్థిక వారసత్వం కావచ్చు… అందుకే తెలంగాణలోని చాలా ఇళ్లల్లో ఏ సందర్భమొచ్చినా సరే బిడ్డల కాళ్లు మొక్కుతారు సోదరులు, తల్లీదండ్రులు…
కానీ ఇక్కడ వేరు… బీఆర్ఎస్ అనుబంధ సింగరేణి సంస్థ (టీబీజేకేఎస్) నుంచి తరిమేశారు… దాంతో ఆమె మరో సంస్థను (హెచ్ఎంఎస్) టేకప్ చేసి, గౌరవాధ్యక్షురాలు కాబోతోంది… సేమ్ ఫైటింగ్ నెత్తురు కదా, ఎందుకు వదిలేస్తుంది..? అమెరికా నుంచే చక్రం తిప్పుతోంది… సో, ప్రచ్ఛన్న యుద్దం సాగుతోంది అన్నాచెల్లెళ్ల నడుమ…
మరి తండ్రే కదా, ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్లలేదెందుకు అనడిగాడు ఓ మిత్రుడు… వెళ్తే ఏం సుఖం..? నా కొడుకు ఆశీర్వదించు నాన్నా, పైచదువులకు అమెరికా వెళ్తున్నాడు అని అడిగితే… ఆమెను ఇంట్లోకే రానివ్వలేదు… కొడుకును ఆశీర్వదించాడు గానీ, బిడ్డ మొహం చూడలేదు, మరి ఏ మొహం పెట్టుకుని ఆ ఇంటికి వెళ్లాలి తను..? సొంత బిడ్డ ఫామ్ హౌజు బయటి నుంచి దండం పెట్టి వాపస్ వచ్చేసింది…
కానీ ఆమె తన కొడుకు ఆర్యను గ్రాడ్యుయేషన్‌లో చేర్పించడానికి అమెరికా వెళ్లింది… ఇక్కడే ఉంటే వెళ్లేదేమో… అవమానం ఎదురైనా సరే… jకానీ సెప్టెంబరు ఒకటి దాకా రాదు…
మరీ కేసీయార్ ఆమె పట్ల అంత పరుషంగా, కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందా..? ఏమో, తెలంగాణ సమాజానికిమాత్రం నచ్చడం లేదు… అవునూ, డాడీ ఆరోగ్యం గురించి ఆమె ఏమైనా ఆరా తీసిందా..? ఏమో, ఆంధ్రజ్యోతి ఏమీ రాయలేదు మరి..!! ఇంకెవడూ రాసేవాడూ లేడు..!!
Share this Article