అసలు తారకరత్నకు ఎలా ఉంది..? ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తోంది… తను వివాదరహితుడు… ఇతర నటులకన్నా భిన్నమైనవాడు… అనవసర విషయాల్లో వేలుపెట్టేరకం కాదు… మనిషి కూడా సౌమ్యుడు… ఈ బ్లడ్డు బ్రీడు తాలూకు ఫీలింగ్స్ కూడా లేవంటారు… అందుకే అశుభాన్ని ఎవరూ కోరుకోవడం లేదు… కానీ చంద్రబాబు గానీ, బాలకృష్ణ గానీ తన ఆరోగ్య పరిస్థితిని సరిగ్గా బయటికి చెప్పడం లేదనే సందేహాలు తెలుగునాట ముసురుకుంటున్నాయి…
తనకు చికిత్స అందిన తీరు మీదా పలు ప్రశ్నలున్నాయి… కుప్పం నుంచి బెంగుళూరుకు సత్వరం ఎందుకు తరలించలేదనేది కీలక ప్రశ్న… నారాయణ హృదయాలయ్ హెల్త్ బులెటిన్ అత్యంత క్రిటికల్ అని చెబుతోంది… తెలుగుదేశం బాధ్యుల్లో ఒకరేమో ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నాడని అంటారు… మరొకరేమో ఎక్మో చికిత్స అంటారు… ఇంకొకరు అందరూ ప్రార్థించండి అనేస్తారు… తారకరత్న దేహం చికిత్సకు స్పందిస్తోందని వేరొకరు చెబుతారు… ఆంధ్రజ్యోతిలో మరో విస్తుపోయే వార్త ఉంది… మెలేనా అనే అత్యంత అరుదైన వ్యాధితో తారకరత్న బాధపడుతున్నాడట… అంటే జీర్ణాశయం లోపలి భాగాల్లో రక్తస్రావం జరిగే వ్యాధి…
గుండెపోటు తరువాత రక్తనాళాల్లో జరిగే రక్తస్రావంతో గుండెకు వైద్యం కష్టమవుతుంది, అందుకే గుండెను కృత్రిమంగా కదిలించేందుకు ఎక్మో మెషిన్ వాడుతున్నారు అనేది ఆ వార్త సారాంశం… లోకేష్ పాదయాత్రకు నెగెటివ్ ముద్ర పడకుండా ఉండేందుకు సెంటిమెంట్‌గా తారకరత్న అసలు ఆరోగ్యస్థితిని బయటికి వెల్లడించడం లేదనే ప్రచారం కూడా సాగుతోంది… నిజానికి ఈ ఎక్మో గురించి గతంలో మనకు పెద్దగా తెలియదు, కానీ ఎస్పీ బాలు చికిత్స సమయంలో తరచూ దాని గురించి విన్నాం…
Ads
మిత్రుడు, సీనియర్ జర్నలిస్ట్ BT Govinda Reddy … అంచనా, విశ్లేషణ మేరకు… ‘‘నాకు తెలిసిన సమాచారం… ప్రకారం 39 ఏళ్ల తారకరత్న కోలుకునే (Revival) అవకాశాలు తక్కువే. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, గుండె స్పందించకపోవడం, ఇంటర్నల్ బ్లీడింగ్ లాంటి సమస్యలు అత్యంత ప్రాణాపాయ స్థితిని సూచిస్థాయి. కొంత కాలంగా ఆయన ఆరోగ్యం బాగా లేదంటున్నారు. కుప్పం పాదయాత్రలో కుప్పకూలిన తర్వాత దగ్గరలో కార్డియాలజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదీ లేకపోవడంతో గోల్డెన్ అవర్లో ఆయనకు సరైన చికిత్స అందలేదు. ప్రస్తుతం ఎక్మో (ECMO) లైఫ్ సపోర్టింగ్ సిస్టం పైన ఉన్నారు. రక్త ప్రసరణ నిల్చి, మెదడు దెబ్బతిని ఉంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం గుండె కొట్టుకునేలా చేయడంపైన వైద్యుల దృష్టి పెట్టారు. బ్లడ్ థిన్నర్స్ వాడటం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ జరగడం కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ యువకుడు సుగర్ అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయకపోవడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే Massive Heart Attack కు గురయ్యాడని వైద్య నిపుణులు చెబ్తున్నారు. ఎక్మో పై గరిష్టంగా నెల రోజులు ఉంచవచ్చు. ఈలోగా రక్తం ఇన్ ఫెక్షన్ కు గురికాకుండా చూడాలి. లంగ్స్, గుండెలను పనిచేయించగలిగితే కోమా నుంచి బయటపడేలా చికిత్స మొదలవుతుంది…
ప్రముఖ విద్యావేత్త Amarnath Vasireddy…. ఏమంటారంటే..? ‘‘ఫెయిల్ అయిన గుండె, ఊపిరితిత్తుల్ని రిపేర్ చెయ్యాలి. చెయ్యాలంటే టైం పడుతుంది. మరి అప్పటిదాకా మనిషిని బతికించాలాంటే? ECMO – ఎక్స్ట్రా కార్పొరెల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్… అంటే ఒక మెషిన్ సాయంతో శరీరంలోని కణాలకు రక్తాన్ని అందించడం. ఒక్క మాటలో చెప్పాలంటే గుండె, ఊపిరితిత్తులు చేసే పనిని తాత్కాలికంగా ఈ పరికరం చేస్తుంది. ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ? ఒక్కో సారి వారాలు – నెలలు ; సరాసరిగా పది రోజులు… ఖర్చెంత ? ట్రీట్మెంట్ పూర్తయ్యేటప్పటికీ సరాసరిగా రెండు కోట్లు… బతికే ఛాన్స్ ఎంత ? యాభై శాతం అనేది అధికారిక లెక్క. కానీ ఇది దొంగ లెక్క. వాస్తవంగా ఇది బాగా తక్కువ.
Share this Article