లెక్కలేనన్ని కళారూపాల్లో రామాయణం ఈరోజుకూ చెప్పబడుతూనే ఉంటుంది… చూపబడుతూనే ఉంటుంది… ఇంతటి పాపులర్ రచన ప్రపంచంలో మరొకటి లేదేమో… లక్షల ఉపకథలుండే మహాభారతానిది మరో చరిత్ర…
వెండి తెర మీద కూడా రామాయణాన్ని అసంఖ్యాకంగా ఆవిష్కరించారు… కథ ఒకటే… కాకపోతే ప్రజెంటేషన్ రకరకాలు… సాహిత్యం కూడా అంతే… ఆయా ప్రధాన పాత్రల కోణంలో కథను వేర్వేరుగా విశ్లేషిస్తూ చెప్పడం కూడా చూస్తున్నాం… ఉదాహరణకు హనుమంతుడు, మండోదరి, తార, కైకేయి తదితర పాత్రల కోణాల్లో…
వెండితెర విషయానికొస్తే రీసెంట్ ఇయర్స్‌లో ఆదిపురుష్ అనే ఓ చెత్త ప్రజెంటేషన్ అందరూ చూశారు కదా.., తిట్టారు, దర్శకుడిని శపించారు, హీరో మీద జాలిపడ్డారు, చివరకు కాషాయశిబిరం రాముడి మీద ప్రేమతోనైనా ఈ సినిమా చూడండని అభ్యర్థించినా సరే, ఆ శిబిర సభ్యులే ఖాతరు చేయలేదు, అంత దరిద్రాన్ని మూటగట్టుకుంది అది…
Ads
విశేషం ఏమిటంటే..? ఇకపై రామాయణం ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆదిపురుష్‌తో పోలిక వస్తుంది… ఒకరకంగా రామాయణాన్ని ఎలా చూపించవద్దో చెప్పడానికి ఆదిపురుష్‌ను చూపిస్తున్నారు అందరూ… సదరు దర్శకుడి జన్మ మరోరకంగా చరితార్థమైపోయింది…
ఇప్పుడు సాయిపల్లవి సీతగా, రణబీర్ రాముడిగా, యశ్ రావణుడిగా ఓ కొత్త రామాయణం వస్తోంది కదా… దాదాపు మూడు భాగాలు అనుకుంటున్నారట… షూటింగు దగ్గర ఎన్ని కట్టుదిట్టాలు చేసినా కొన్ని ఫోటోలు లీకయ్యాయట… అవి నెట్‌లో వైరల్ అవుతున్నయ్…
వెంటనే ఆదిపురుష్‌తో పోలికలు గట్రా ప్రారంభమయ్యాయి… పైగా ఈ సీతారాముల జంట ఎలా ఉందనే డిబేట్ కూడా జోరుగా సాగుతోంది నెట్‌లో… సౌత్‌లో కొన్నిరకాల పాత్రలకే పరిమితమైన సాయిపల్లవికి ఈ రేంజులో బాలీవుడ్ ఎంట్రీ ఓ వరమే… సినిమా గనుక హిట్టయితే సాయిపల్లవి కెరీర్‌లో నిలిచిపోతుంది…
ఇక నెట్‌లో జరిగే సరదా టైమ్‌పాస్ డిబేట్‌లో మన సౌత్ ప్రేక్షకుల నుంచి రాముడి పాత్ర, రూపానికి సంబంధించి పెద్దగా సానుకూలత రావడం లేదు… ప్రత్యేకించి పురాణాల్ని వెండితెర మీద ఆవిష్కరించడంలో మన తెలుగు వాళ్లను మించినవాళ్లు లేరు… రామాయణమైతే మరీనూ… కానీ మన సినిమాల్లో రాముడు అనగానే దట్టంగా నీలిరంగును పులమడం ఆడ్‌గా ఉంటుంది, కానీ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు…
లవకుశలో ఎన్టీయారుడు, ఆమధ్య వచ్చిన శ్రీరామరాజ్యంలో బాలకృష్ణుడికి కూడా నీలిరంగును దట్టంగా పులిమారు… స్వతహాగా చిత్రకారుడు, అదీ బోలెడంత కామన్ సెన్సున్న బాపు కూడా రామవర్ణాన్ని అలా చూపించడం ఏమిటో… నీలిమేఘ శ్యాముడు అంటే నీలిరాముడు కాదురా బాబూ, డార్క్ షేడ్ రాముడు మాత్రమే, మరీ ఈ రంగేమిటి అని విసుక్కున్నవాళ్లూ బోలెడు మంది… ఇక హిందీ రాముడేమో ఫెయిర్ కలర్… ఆదిపురుష్‌లోనూ అంతే కదా…
ఆదిపురుష్‌లో రాముడికి మీసాలుండును, రాబోయే రాముడికి ఉండవు… అంతేతప్ప ప్రభాస్ లుక్కుకూ, రణబీర్ లుక్కుకూ పెద్ద తేడా ఏమీ లేదు… ఆదిపురుష్‌లో రావణ వేషం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… పెద్ద హీరోలయితే మీసాలున్నా లేకపోయినా పుణ్యపాత్రలకు వోకే… రజినీ రాఘవేంద్రుడికి మీసాల్లేవా..? అక్కినేని అన్నమయ్యకు లేవా..? ఉండకూడదని కూడా ఏమీ లేదు కదా… సౌతుడు కాబట్టి ప్రభాసరాముడికి మీసాలున్నాయి, నార్త్ బాలీవుడ్ రణబీరుడు కాబట్టి లేవు… సింపుల్…
సీతగా సాయిపల్లవి లుక్కు పర్లేదు… కానీ మరీ ఈమధ్య ఎండుకుపోయినట్టు కనిపిస్తోంది… ఓ ఐదారు కిలోల బరువు ఎక్కువుంటే ఇంకాస్త నిండుగా ఉండేదేమో… ఆదిపురుష్ సీత కళావిహీనంగా కనిపించింది…
ఐతే మూడునాలుగు లీక్ ఫోటోలతో ఈ విశ్లేషణలు సరికావు అనిపిస్తున్నా, జనంలో ఈ రామాయణం మీద కనిపించే ఆసక్తి మాత్రం గమనార్హమే… ఐనా ఈ కొత్త రామాయణ దర్శకుడికి కాస్త వర్క్ సులభమే… ఆదిపురుష్‌లాగా తీయకపోతే సరి… అంతే… అదిపురుష్ కూడా అదోతరహా బెంచ్ మార్క్ అయిపోయిందిలా…
మన సౌత్ రాముళ్లు… అనగా ఎవరు ఈ వేషం కట్టినా సరే, మొహంలో ఉద్వేగప్రదర్శనలో కాస్త ఓవర్‌తనం కనిపిస్తుంది… ప్చ్, హిందీ హీరోలు ఎంత ప్రయత్నించినా సరే వాళ్లకు అది చేతకాదు… అది మాత్రం పక్కా… వాళ్లు ప్లెయిన్ రాముళ్లు…!!
Share this Article