యాదాద్రి యాదగిరిగుట్ట అయిపోయింది మళ్లీ… గుడ్… కొండపైన కొన్ని కార్ల పార్కింగుకే చాన్స్ ఉంది… దాంతో కొండపైకి సొంత వెహికిల్‌లో రావడాన్ని నిరుత్సాహపరచడానికి 500 టికెట్ ధర పెట్టారు… కింద పార్కింగుకు 50 రూపాయలు… అక్కడి నుంచి పైకి ఫ్రీ బస్సులు… మరీ వృద్ధులు, వికలాంగులైతే బ్యాటరీ కార్లు…
భక్తుల టాయిలెట్ అవసరాల్ని గుర్తించారు… పలుచోట్ల నిర్మించేశారు… డ్రింకింగ్ వాటర్ దివీస్ వాళ్లు ప్రొవైడ్ చేశారు… బాగా నచ్చింది ఏమిటంటే..? వయోవృద్ధులు, దివ్యాంగులు లిఫ్ట్ వాడుకునే ఛాన్స్, వీల్ చైర్లు… దర్శనానంతరం ఆవరణలో కాసేపు కూర్చునే ఆ పాత పద్ధతి మళ్లీ వచ్చేసింది… కాకపోతే అక్కడ గాలి తీవ్రతకు పందిళ్లు ఉండవు, జర్మన్ టెంట్లు వేశారు… మళ్లీ జనకళ… ఇవి టెంపరరీయే, పైగా అద్దె చాలా ఎక్కువ…
ఎక్కువగా పదే పదే అద్దెకు తీసుకురాలేరు, శాశ్వత నిర్మాణాలను పెద్దలు అంగీకరించడం లేదు… గుడి లుక్కు పోతుందని..! కానీ భక్తుల సౌకర్యమే ముఖ్యం కదా, ఏమో, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఏం ఆలోచిస్తుందో… ఇదేకాదు, దిగువన స్నానాలకు లక్ష్మి పుష్కరిణి, కల్యాణకట్ట ఉన్నాయి… కాస్త దూరమే… భక్తులకు ఇబ్బందే… పైన ఉన్న విష్ణు పుష్కరిణిని పూర్తిగా స్వామికే అంకితం చేశారిన్నాళ్లూ… కాగా రీసెంటుగా 500 ధరతో సంతానం కోరుకునే జంటలకు స్నానసౌకర్యం పైన కూడా కల్పించారు… గిరిప్రదక్షిణ భక్తులకు కూడా…
Ads
ఇద్దరికీ స్పెషల్ దర్శనాలకు 150 చొప్పున 300 ప్లస్ పెద్ద లడ్డూ ప్రసాదం 150 లెక్కేసుకుంటే… సంతాన స్నానానికి 50 అదనం అన్నమాట… పర్లేదు… మిగతావాళ్లు నీళ్లు నెత్తిన చల్లుకోవడానికి అనుమతి… కోతులు, పక్షులు దిగువకు రాకుండా, హైజినిక్ వాతావరణం కోసం పుష్కరిణి మొత్తం కవరయ్యేలా మెష్ ఏర్పాటు చేశారు… (ఇక్కడ స్నానం చేస్తే సంతానభాగ్యం అనేది ఓ నమ్మకం…)
దిగువ పుష్కరిణిలో స్నానాలు, కల్యాణకట్ట భక్తులకు ఇప్పటికీ ఇబ్బందికరమే… పైగా దేవుడి ఆవరణలో మాత్రమే కేశఖండనం, స్నానం కోరుకుంటారు భక్తులు… కానీ పైన ఉన్న పుష్కరిణి వందల మంది స్నానాల్ని (చిన్నగానే ఉంది) తట్టుకోగలదా చూడాలిక… (ప్రభుత్వం పైన కూడా స్నానాలకు వోకే అంటే…) అరుణాచలం తరహాలో మిగతా గుళ్లలో కూడా గిరిప్రదక్షిణల ట్రెండ్ వచ్చేసింది కదా… ఇక్కడా మొదలుపెట్టారు… భక్తులను మరింతగా ఆకర్షించే స్పిరిట్యువల్ టెక్నిక్ అన్నమాట… కొండపైన పారిశుధ్యానికి బాగానే ప్రాధాన్యం కనిపిస్తోంది…
సమీప ప్రాంతాలు, ఊళ్ల నుంచి వచ్చే భక్తజనం ఎక్కువ ఒకప్పుడు… ఇప్పుడు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చీపోయే భక్తజనమే ఎక్కువ… ఉదయమే రావాలి, దర్శనం చేసుకోవాలి, వీలైనంత వేగంగా వెళ్లిపోవాలి… వాళ్లే ఎక్కువ… పాత నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల నుంచే ఎక్కువ వస్తుంటారు సంప్రదాయ భక్తులు… వాళ్ల మనోభావాలు తెలుసుకుని, అవసరమైన సౌకర్యాల కల్పనే ప్రధానం… వాళ్లకు నర్సన్న కావాలి, నర్సన్నకు వాళ్లు కావాలి… గుళ్లో ఉత్సవ మూర్తులకు జరిగే సేవల్ని పెద్ద టీవీలో బయట ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు…
స్థానికులు చిన్న చిన్న దుకాణాలు పెట్టేసుకున్నారు… తప్పదు… స్థానికులు కేసీయార్ కాలంలో ‘ఇది మా గుడి’ అనే భావన నుంచి దూరం చేయబడ్డారు… వారంలో ఒకరోజు స్థానికుల దర్శనాలకూ ప్రాధాన్యం ఇస్తున్నారు ఇప్పుడు… ఒకేచోట గుడి ఆధ్వర్యంలోనే లేపాక్షి తరహాలో ఓ పెద్ద స్టాల్ ఏర్పాటు చేసి, దేవుడి గుర్తులను, వస్త్రాలను విక్రయిస్తే భక్తులు ఇంకాసేపు దేవుడి ప్రాంగణంలోనే గడిపే అవకాశం వస్తుంది… చిన్న క్యాంటీన్ కూడా…
దేవుడి పోటు కూడా శుభ్రంగా ఉంది, పూర్తి మెకనైజ్డ్… యాదగిరిగుట్ట పులిహోర, లడ్డూ చాలా ఫేమస్ చాలా దశాబ్దాలుగా… ప్రసాద విక్రయం పరిసరాల్లోకి వెళ్లగానే ఆ విశిష్ట పరిమళం కమ్మేసింది… టికెట్లు తీసుకునే స్థలం, ప్రసాదం తీసుకునే స్థలం వేర్వేరుగా పెట్టి ఓ మంచి పనిచేశారు… టికెట్ల రీసైకిలింగ్ నిరోధానికి..! ఇంతకుముందు గుడి పునర్నిర్మాణ సమయంలో విగ్రహాల్ని బాలాలయంలో ఉంచారు నాలుగైదేళ్లు… ఆ ప్రాంతం పరిశుద్ధంగా ఉండేందుకు, మొత్తం ఫెన్సింగ్ వేసేశారు… ( ఇంకా ఉంది… )
Share this Article