.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా… అధికారంలోకి రాగానే కొన్ని రోజుల్లోనే, కొన్ని గంటల్లోనే అమలు చేసిన ఓ ప్రధాన హామీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం… ఇక్కడ రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాలి…
అయితే దీన్ని ఓ ప్రజాకర్షక రాజకీయ ప్రయోజన పథకంగా మాత్రమే చూసే కళ్లకు కొన్ని నిజాలు చెప్పాలి.,. నో, ఇది ఓ ఎన్నికల లబ్ధి పథకం కాదు… ఎందుకు ఇది సమాజ ప్రయోజన పథకమో, గత కేసీఆర్ ప్రభుత్వ భయానక హయాంతో పోల్చి చెప్పాలంటే… కొన్ని వివరంగా అర్థం చేసుకోవాలి…
Ads
ఎస్, ఈరోజుకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయ్యాయి… చిన్న విషయమేమీ కాదు… ఎవరెవరో మీడియాలో రాస్తున్నట్టు 200 కోట్ల మహిళలు కాదు, మహిళల 200 కోట్ల ఉచిత ప్రయాణాలు… 18 నెలల్లో తెలంగాణ వంటి రాష్ట్రంలో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు అంటే చిన్న విషయం కాదు…
ఈ 200 కోట్ల మైల్ స్టోన్ సెలబ్రేట్ చేయడానికి ఈరోజు ప్రతి ఆర్టీసీ డిపో ఎదుట పండుగ కార్యక్రమాలు చేస్తున్నారు… ముఖ్యనేతలు పాల్గొంటున్నారు… అప్పట్లో ఇది స్టార్టయిన రోజున ‘మునిగిపోతున్న పడవ’ ఎవరు ఎక్కుతారు అన్నారు… ఆ విమర్శకుల మొహాలు నల్లబడేలా ఈరోజు పండుగలు…
నిజానికి దీన్ని ఏ కోణంలో చూడాలి..? 1.9 కోట్ల తెలంగాణ మహిళలకు ఈ ఏడాదిన్నర కాలంలో మిగిల్చిన 6700 కోట్ల రూపాయల కోణంలో మాత్రమేనా..? అంటే..?
పేదలు, దిగువ మధ్యతరగతి మహిళలే గతంలో ఆర్టీసీ బస్సులు ఎక్కేవాళ్లు… ఇప్పుడు మధ్యతరగతి ప్లస్ ఎగువ మధ్యతరగతి కూడా… అందుకే ఒకప్పుడు ఆర్టీసీ ఆక్యుపెన్సి రేషియో 62 శాతం ఉంటే ఇప్పుడు 97 శాతానికి పెరిగింది… మహాలక్ష్మి పథకానికి ముందు 45 లక్షల మంది ప్రయాణం చేస్తే ఇప్పుడు 65 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు…
ఒక్కొక్కరికీ ఎంత ఆదా అనే కోణంలో కాదు… డిఫరెంటుగా చూడాలి… ఎందుకంటే..? ఒక్కసారి గుర్తుచేసుకొండి… కేసీయార్ 2019లో మొత్తం ఆర్టీసీనే రద్దు చేసి, ముక్కలు చేసి, ప్రైవేటు వాళ్లకు అమ్మేయాలని అనుకున్నాడు… ఆర్టీసీ ఉంటుందా లేదానే సిట్యుయేషన్ నాడు…
సమ్మె విరమించి, విధుల్లో చేరకపోతే ఉద్యోగం హూస్ట్ అన్నాడు… వాళ్లు తెలంగాణ సాధనకు పోరాడలేదా..? ఇతర ఉద్యోగులకు ఎడాపెడా జీతాలు పెంచిన ప్రభుత్వం మమ్మల్నెందుకు శత్రువులుగా చూస్తోందని అడిగితే కస్సుమన్నాడు… సీన్ కట్ చేస్తే…
ఈరోజు మహాలక్ష్మి పథకం పుణ్యమాని… ప్రభుత్వం ఇచ్చిన వేల కోట్ల పుణ్యమాని ఆర్టీసీ నిలబడింది… ఆ ఉద్యోగుల్లో భరోసా… ఇక మా సంస్థ బతికినట్టేననే ఊరట, రిలీఫ్… అవును, ఇంకా ఎన్ని ప్రయోజనాలు అంటే..?
ప్రజారవాణాకు ఏ సమాజమైనా ప్రయారిటీ ఇవ్వాలి… బహుముఖ ప్రయోజనాలు… ప్రైవేటు రంగానికి దీటుగా, ఆ దోపిడీలకు ప్రతిఘటనగా… ప్రైవేటు రవాణా రంగం అదుపు తప్పకుండా ఉండాలంటే ప్రభుత్వరంగంలో ప్రజారవాణా వ్యవస్థ బలంగా ఉండాలి…
ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2400 కొత్త బస్సుల్ని కొనుగోలు చేసింది ఆర్టీసీ… అడ్డికిపావుశేరు అమ్మేసుకోవాలనుకునే కేసీయార్ కాలంతో పోలిస్తే పూర్తి రివర్స్, పాజిటివ్ సీన్… హైదరాబాదును పూర్తి కాలుష్య రహిత నగరంగా మార్చే క్రమంలో ఏకంగా 2800 బస్సుల స్థానంలో బ్యాటరీ బస్సుల్ని ఆలోచిస్తోంది ఆర్టీసీ… ఇప్పటికే 3000 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చారు…
ఎంత తేడా..? ఆర్టీసీ ఊపిరిపోతున్న ఆనాటి దుర్దినాల నుంచి… బలంగా నిలదొక్కుకున్న ఈ రోజులకు ఎంత తేడా..? వాట్ నెక్స్ట్..?
వడ్డీ లేని రుణాల ద్వారా మహిళలతో బస్సులు కొనుగోలు చేయిస్తున్నారు… ఆల్రెడీ 150 మహిళా సంఘాలకు నిధులొచ్చాయి ఈ దిశలో… అంటే, ఉచిత బస్సు ప్రయాణాలు కాదు, ఆర్టీసీ బస్సులకు నిజమైన యజమానులుగా మహిళలు… అదే నిజమైన ‘మహాలక్ష్మి’… సో, విద్యార్థినులు, కూలీలు, ఉద్యోగినులకు మాత్రమే కాదు… స్థూలంగా తెలంగాణ సొసైటీకి బహుళ ప్రయోజనకర పథకం ఇది…
కేవలం చిన్న చిన్న జిల్లాల్లో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నట్టుగా… తమ వాగ్దానాన్ని మహిళల్ని అవమానించే రీతిలో… ఏడాది తరువాత అమలు చేయాలని భావిస్తున్న పొరుగు రాష్ట్రంతో ఒక్కసారి పోల్చి చూడండి… రేవంత్ రెడ్డి ఎంత బెటరో..!! ఎక్కడో, ఏ అజ్ఞాతవాసి ఎవరో ఇదంతా చూస్తూ కుళ్లుకుంటున్న సీన్లు కనిపిస్తున్నాయా..?!
మరిచేపోయాను... ఈ మొత్తం స్కీమ్ సక్సెస్‌లో ఆర్టీసీ సిబ్బంది ప్లస్ అధికారుల పాత్రను కూడా ప్రముఖంగా ప్రస్తావించాలి... వాళ్ల ఓపిక, వాళ్ల శ్రమ, వాళ్ల కమిట్మెంట్..! తమ సంస్థను కాపాడుకునే దిశలో ప్రయాస, ప్రయత్నం..!!
Share this Article