అసలు టీవీల్లో ఏ రియాలిటీ షో అయినా సరే… అది పక్కాగా స్క్రిప్టెడ్… వెల్ మేనేజ్‌డ్… ఎప్పటికప్పుడు టీఆర్పీలను బట్టి, వాళ్ల సొంత ఇంట్రస్టులను బట్టి లెక్కలు మారిపోతుంటయ్… టీవీ అంటేనే వినోదదందా… గీతాల షోలు అయినా సరే, కమర్షియల్ గీతల్లోనే పరుగులు తీస్తుంటయ్… సోనీవాడి ఇండియన్ ఐడల్ అంతకుభిన్నంగా ఉంటుందని ఎందుకు అనుకుంటాం..? 12 గంటల ఫినాలేలో సంగీతం, పోటీ గట్రా గాలిలో కలిసిపోయి, గాయకులకు డాన్సుల పోటీ పెట్టారు, ఎంటర్‌టెయిన్‌మెంట్ పోటీ పెట్టారు… అదొక పండుగ ఈవెంట్ అయిపోయింది తప్ప అదొక మ్యూజిక్ రియాలిటీ షో అనిపించలేదు… సరే, మన తెలుగు గానకెరటం షణ్ముఖ ప్రియకు జరిగిన అన్యాయం మనం మాట్లాడుకునేలా చేస్తోంది… అది సూపర్ హిట్ షో కాబట్టి, కోట్ల మంది షో రెగ్యులర్‌గా ఫాలో అయ్యారు కాబట్టి, సౌత్ ఇండియన్ల మీద వివక్ష స్పష్టంగా కనిపించింది కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తోంది… చాలామందికి ఈ విశ్లేషణ, ఈ వాదన నచ్చకపోవచ్చుగాక… ఐనా మాట్లాడుకుందాం… కోవాలి…
నో డౌట్… ఈసారి ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొన్నవారంతా మోస్ట్ టాలెంటెడ్… మధ్యలో ఎలిమినేట్ అయినవారు కూడా అద్భుతంగా పాడి మెప్పించారు… మరి పోటీ అన్నాక ఒక్కొక్కరే తప్పుకోవడం, తప్పించబడటం తప్పదు కదా… మధ్యలో కొందరు ఎగిరిపోయారు… చివరకు ఆరుగురు మిగిలారు… తరువాత వివరణలోకి వెళ్లే ముందు ఒక మాట మరొక్కసారి చెప్పుకుందాం… ఇది గానప్రతిభకు పెట్టే పరీక్ష, పోటీయే… అంతేతప్ప, సంగీత పరికరాలు వాయించడంలో గానీ, డాన్సులు చేయడంలో గానీ పోటీ కాదు… ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్‌రాజన్ గొంతులో శ్రావ్యత ఉంది, మంచి ఆర్ద్రత మాత్రం పలికించగలడు… అనేక సంగీత పరికరాల మీద గ్రిప్ ఉంది… కానీ తను అన్నిరకాల పాటలు పాడలేడు, పాడలేదు… మెలొడీయే ప్రధానం… కానీ మాస్, జాజ్, వెస్టరన్ వంటివి జాడలేదు… పైగా తన పాటలో ఎమోషన్ పలకదు పెద్దగా… నిర్వికారంగా ఉంటాడు, అలాగే పాడతాడు… ఒరిజినల్ పాటను అలాగే పాడేస్తాడు… విత్ జీరో ఎమోషన్… కానీ ముంబైకి చెందిన సయాలీ ఉద్వేగాన్ని బట్టి గొంతులో వైవిధ్యాన్ని, పదాల్లో ఆ భావాన్ని పలికించగలదు… మంచి మంచి పాటలు అలాగే పాడి మెప్పించింది కూడా… ఆమె గొంతు కూడా బాగుంటుంది… బెంగాల్‌కు చెందిన అరుణిత గొంతు, స్వరజ్ఞానం బాగుంటయ్… కానీ ఆమె కూడా ప్రధానంగా మెలొడీ మీదే ఆధారపడింది… మంగుళూరుకు చెందిన నిహాల్, ముజఫర్‌నగర్ డానిష్ కూడా ప్రతిభావంతులే… తీసేయడానికి వీల్లేదు… భావాన్ని పలికించడంలో అరుణిత, పవన్‌దీప్‌కన్నా వీళ్లే కాస్త బెటర్…
Ads
అరుణిత, పవన్‌దీప్‌లతో పోలిస్తే… షణ్ముఖ భావాన్ని పలికించగలదు… మాస్, జాజ్, రాక్, ఫ్యూజన్, వెస్టరన్, యెడ్లింగ్… వాట్ నాట్..? ప్రతిదీ పాడగలదు, పాడి చూపించింది… స్టేజ్ ప్రజెన్స్ బాగుంటుంది… కమాండ్ ఉంటుంది… ఎప్పుడూ ఆ వెస్టరన్ అరుపులేనా అనే విమర్శలకు జవాబుగా తరువాత కొన్ని మెలొడీ, క్లాసికల్ మిక్స్ ఉన్నవీ పాడింది… ఎంతసేపూ షో నిర్వాహకులు అలాంటి పాటలే ఇస్తుంటే మరి తనైనా ఏం చేయగలదు..? తను పాటలో సొంత ప్రయోగాలు చేయగలదు, చేసింది, జడ్జిలను మెప్పించింది… గెస్టులు సరేసరి… అంత పాపులారిటీ లేకపోతే, ఆమె పాటలో ఆ చార్మ్ లేకపోతే ఫైనలిస్టు దాకా వచ్చి ఉండేది కాదు కదా… అజూబీ అజూబీ, ఫస్ట్ ఫిమేల్ ఐడల్ అని ఎత్తుకుంటూనే… క్రమేపీ నార్తరన్ ఇండియన్ ట్రోలర్స్‌ను గమనిస్తూ… షో నిర్వాహకులు, జడ్జిలు షణ్ముఖను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు… మరీ నెలరోజుల్లోనే ఆమె మీద ఉద్దేశపూర్వక ట్రోలింగ్ విపరీతంగా సాగింది… నెగెటివ్ క్యాంపెయిన్ నడిచింది… జాగ్రత్తగా నార్త్ ఇండియాకు చెందిన అరుణిత, సయాలీ, పవన్‌దీప్‌లను పైకి లేపడం మొదలుపెట్టారు… ఆ ముగ్గురినే టాపర్స్ అన్నారు… చివరకు పవన్‌దీప్ చేతిలో ట్రోఫీ పెట్టారు… నార్త్ ఇండియా కంటెస్టెంట్లు నలుగురూ మొదటి నాలుగు ప్లేసులు… ఇద్దరు సౌత్ ఇండియన్ కంటెస్టెంట్లు మాత్రం అయిదు, ఆరో స్థానాలు… నిజంగా షణ్ముఖ ప్రియ మరీ ఆరో ప్లేసులో ఉండేంత పూర్ సింగరా..? అంత పూర్ పర్ఫామెన్స్ కనబరిచిందా..? అసలు ఈ టీవీ రియాలిటీ షోల వోట్లు ఎప్పుడూ డౌట్‌ఫుల్… ఎవరికి ఎన్ని వచ్చాయో చూపించు అని ఎవడూ అడగడు కదా… సో, ఆ టీవీ వాడి దయ, కంటెస్టెంట్ల ప్రాప్తం… గెలవాలంటే వీక్షకుల లెక్కల్లో కాదు, టీవీ వాళ్ల లెక్కల్లో ఫిట్ కావాలి… షణ్ముఖప్రియ అందులో ఫిట్ కాలేదు, అంతే… తనే రియల్ ఐడల్… ఐడియల్ కూడా…!! ఐనా మూడో ఏట నుంచీ, అంటే పదిహేనేళ్లుగా పాడుతూనే ఉంది… హిందీ నేర్చుకుంది, తమిళం నేర్చుకుంది, వివిధ సంగీత ధోరణుల్ని పట్టుకుంది, సాధన చేసింది… ఈ రియాలిటీ షో జస్ట్, ఒక మజిలీ… కాదు, ఈ అజూబీకి ఈ షో ఓ జుజూబీ… విజయ్ దేవరకొండ చెప్పినట్టు… గెలుపోఓటమో జానేదేవ్… రన్, రన్… ఇంకా బోలెడంత మైదానం ఉంది ఉరకడానికి…!!
Share this Article