Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కృష్ణాంజనేయులు గొప్ప దౌత్యవేత్తలా..? ఇదేం బాష్యం డియర్ మంత్రివర్యా..?!

January 30, 2023 by M S R

మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడడు… విదేశాంగ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసినందున ప్రతి మాటనూ ఆచితూచి మాట్లాడటం అలవాటైందేమో… తన తత్వం అదేనేమో… కేబినెట్‌లో ఆ శాఖకు అత్యంత సూటబుల్… అలాంటిది తను మొన్న పూణెలో చేసిన ఓ వ్యాఖ్య కాస్త విస్మయకరం… ప్రపంచంలోకెల్లా అత్యంత గొప్ప దౌత్యవేత్తలు కృష్ణుడు, హనుమంతుడు అంటాడు తను… తను స్వయంగా రాసిన The India Way: Strategies for an Uncertain World అనే పుస్తకానికి మరాఠీ అనువదాన్ని ఆవిష్కరించడానికి ఉద్దేశించిన ఓ మీటింగులో ఈ వ్యాఖ్య చేశాడు… ఇదేకాదు, తనేమంటాడంటే…

  1. హనుమంతుడు దౌత్యమే కాదు, దానిని కూడా దాటి, సీతాన్వేషణలో భాగంగా సీతతో మాట్లాడాడు… లంకాదహనం చేశాడు.
  2. వ్యూహాత్మక సహనానికి (Strategic patience) ఒక ఉదాహరణ శిశుపాలుడి వధ… 100 తప్పులు చేసేంత వరకూ వేచి ఉండటం,  మంచి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులకు ఉండాల్సిన ప్రధాన అర్హత అది…
  3. దేశ ప్రయోజనాల విషయంలో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ముఖ్యం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారతదేశం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. బైపోలార్ కోల్డ్ వార్ (1947-1991), యూనిపోలార్ టైమ్స్ (1991-2008), మల్టీపోలార్ టైమ్స్ (2008 నుంచి ఇప్పటి వరకూ)లోనూ ఇదే విధానాన్ని దేశం అనుసరిస్తూ వస్తోంది. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే ఒంటరిగా మిగిలిపోవడమో, పొత్తు పెట్టుకోవడమే కాదు, దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు అనుసరించే వ్యూహం…
  4. వ్యూహాత్మక మోసం (strategic deception) గురించి… సాయంత్రమయ్యేలోపు జయద్రధుడిని సంహరిస్తానని అర్జునుడు శపథం చేస్తాడు… కౌరవసేన తనను దాచేస్తుంది, అప్పుడు సూర్యడు అస్తమించినట్టుగా ఓ ప్రహసనం క్రియేట్ చేసి, జయద్రధుడు బయటికి రాగానే హతమార్చడం…
  5. మన బంధువులను మనం ఎంచుకోలేం, అలాగే మన పొరుగు వారిని కూడా ఎంచుకోలేం… వాళ్లు మంచిగా ఉండాలనే కోరుకోవడం తప్ప ఇంకేం చేయగలం..?
  6. వ్యూహాత్మక సర్దుబాటు (Tactcal Adjustment)… అశ్వద్ధామ మరణానికి ధర్మరాజు తొలిసారి అబద్ధం చెప్పడం…  ఇలా రకరకాలుగా భారతంలోని ఎపిసోడ్లకు విదేశాంగ పరిభాషలో విశ్లేషణాత్మక బాష్యం చెప్పాడు ఆయన…

jaishankar

అన్నీ బాగానే ఉన్నాయి గానీ… కృష్ణుడు, హనుమంతుడు గొప్ప దౌత్యవేత్తలు అని వర్ణించిన తీరే కొంత ఆశ్చర్యకరం… ఎందుకంటే..? కృష్ణుడు సాధించిన దౌత్యవిజయాలు ఏమీ లేవు… యుద్ధానికి ముందు రాజీ ప్రయత్నాలు అవసరం కాబట్టి శ్రీకృష్ణుడు వెళ్లాడు… అక్కడ దౌత్యమూ లేదు, ఫలించిందీ లేదు, ఇదే పనిని విదురుడు కూడా చేశాడు… ఇంకాస్త బెటర్‌‌గా… తన కోసం దౌత్యాన్ని కూడా ప్రయోగించడంలో శ్రీకృష్ణుడు విఫలుడే… శత్రువుల ధాటికి తట్టుకోలేక ద్వారకకు వెళ్లిపోయాడు… నరకాసురుడు, జరాసంధులతో ఏరకమైన దౌత్యమూ లేదు…

Ads

హనుమంతుడు కూడా అంతే… సీతాన్వేషణకు వెళ్లాడు… కనిపించింది, వార్తాహరుడిగా రాముడి క్షేమసమాచారం చెప్పాడు… ఆమె ఉనికిని రాముడికి తెలిపాడు… మధ్యలో రావణుడి మీద కోపంతో లంకాదహనం చేశాడు… అంతేతప్ప తను దౌత్యం ఏమీ చేయలేదు… ఆ పనికోసం వెళ్లలేదు… రాముడు, సుగ్రీవుడి నడుమ మైత్రీబంధాన్ని ఏర్పరిచాడు తప్ప, సుగ్రీవుడి కోసం వాలి దగ్గరకు కూడా దౌత్యం కోసం వెళ్లలేదు ఎప్పుడూ… నిజానికి యుద్ధానికి ముందు రాజీప్రయత్నం అవసరం కాబట్టి వాలి కొడుకు అంగదుడు వెళ్తాడు రావణసభకు… సో, జైశంకర్ చెప్పిన ‘ప్రపంచంలోకెల్లా గొప్ప దౌత్యవేత్తలు’ అనే వ్యాఖ్య ఎందుకో నప్పలేదు… నచ్చలేదు కూడా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions