.
నీరూ, రక్తం కలిసి ప్రవహించలేవు… ఇదే కదా సింధు నదీజలాల ఒప్పందం నుంచి మనం బయటికి వచ్చిన కారణం… ఎస్, నిజమే… జీవజలాల్లో మన తక్కువ వాటాతో రాజీపడుతూ ఇన్నాళ్లూ పాకిస్థాన్‌ను ఉపేక్షించాం… ఇక కుదరదు అనేశాం…
దేశమంతా హర్షించింది… అప్పట్లో మధ్యవర్తిగా ఉన్న ప్రపంచబ్యాంకు ఇప్పుడు నిర్లిప్తంగా ఉండిపోయింది… నిజమే, దానికేం బాధ్యత..? జస్ట్, మధ్యవర్తి మాత్రమే… అడిగితే మధ్యలోకి వస్తుంది, కానీ మనం అడగము కదా…
Ads
ఐరాస, భద్రతా మండలి, అంతర్జాతీయ కోర్టు వంటి చాలా మార్గాలు అన్వేషిస్తోంది పాకిస్థాన్… మొన్న అర్థంతరంగా పాకిస్థాన్ వెన్నువిరిచే ఆపరేషన్ ఆపేసినట్టు గాకుండా… ఈ సింధు జలాలపై ప్రభుత్వం గనుక స్థిరంగా నిలిస్తే దేశానికి మేలు, శత్రువుకు దెబ్బ అనేది స్థూలంగా జనాభిప్రాయం… అంతర్జాతీయ ఒత్తిడి వస్తే చూసుకోవచ్చులే అని…
ఇదంతా నిజమే, కానీ మనం ఆ జలాల్ని పాకిస్థాన్‌కు వెళ్లనివ్వకుండా గరిష్టంగా మనమే ఎలా వాడుకోవాలి..? ఏం చేయాలి..? ఇదీ ప్రశ్న… మిత్రుడు Murali Krishna వాల్ మీద ఓ పోస్టు ఆసక్తికరంగా ఉంది… ఇలా…
పహల్గామ్‌లో తీవ్రవాదుల దాడి తరువాత భారత్ మొదటగా ‘సింధు నదీజలాల ఒప్పందా’న్ని abeyance లో పెట్టింది. అంటే మన దేశం గుండా వెళ్ళే సింధు నదీజలాలను మనం వాడుకుని, మిగిలితే పాకీలకు వదులుతాం అన్నమాట…
వినడానికి బాగానే ఉంది. ఒవైసీ అన్నట్లు వీటిని ఎలా ఉపయోగిస్తారు? దానికి సంబంధించి కేంద్రం ఒక ప్రణాళికను సిధ్ధం చేసింది,..
01. సింధు, జీలమ్, చీనాబ్ రివర్ బేసిన్ల రిజర్వాయర్లలో పూడిక తీస్తారు. ఇది మొదటి చర్య. ఇది నిరంతర ప్రక్రియ.
02. ఒప్పందం కారణంగా నిలిచిపోయిన ‘తుల్బుల్ నేవిగేషన్ ప్రాజెక్ట్ పునరుధ్ధరణ
03. ‘వుల్లర్ లేక్’ & జీలమ్ నదిపై వరద నిరోధక కట్టడాల వేగవంతం.
04. రణబీర్ & ప్రతాప్ కెనాల్స్ కెపాసిటీని పెంచి జమ్మూ ప్రాంతానికి మరింత నీటి వసతి కల్పించడం.
05. నీటి లభ్యత మరింత పెరిగినప్పుడు, అధిక నీటిని డెఫిసిట్ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు వీలుగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధ్యయనం.
06. వరద నీటిని పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లకు మళ్ళించేలా కెనాల్స్ నిర్మాణం.
07. అధిక ప్రాధాన్యతతో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న హైడ్రో ప్రాజెక్టులను (‘పాకల్ దుల్’ (1000 mw), ‘రాట్లే’ (850 mw), ‘కిరు’ (624 mw), ‘క్వార్’ (540 mw) త్వరితగతిన పూర్తి చేసేందుకు నిర్ణయం.
08. వివిధ కారణాలతో పెండింగ్ పడిన ‘సావల్కోట్ (1850 mw), ‘కిర్తాయ్’ (930 mw ), ‘యూరి – 1’ (240 mw) ప్రాజెక్టులపై న్యాయబధ్ధమైన నిర్ణయాలు.
09. దుల్హస్తీ స్టేజ్ 2 (360 mw) పై యుధ్ధ ప్రాతిపదికన సర్వే పూర్తి…. ఇప్పటికే కశ్మీర్ లోని చీనాబ్ నదిపై ఉన్న ‘బగ్లీహార్’, ‘సలాల్’ హైడ్రో ప్రాజెక్టుల వద్ద తాత్కాలిక ప్రాతిపదికపై డీసిల్టింగ్ చేపట్టారు… యుధ్ధం కేవలం ‘అగ్నేయాస్త్రం’తోనే కాదు, ‘వారుణాస్త్రం’తో కూడా చెయ్యవచ్చు…
Share this Article