Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆకాశ్‌తీర్, రుద్రమ్, బ్రహ్మాస్… పాకిస్థాన్ వెన్నువిరిచిన విధం ఇదీ…

May 18, 2025 by M S R

.

మన దగ్గర నుండి అమెరికా కూడా ఆకాశ్ ని కొంటుంది వచ్చే రోజులలో! …. ఈ వ్యాఖ్య కాస్త అతిశయోక్తిలా అనిపిస్తోందా..? కానీ ఆకాశ్ సక్సెస్ చూశాక దాన్ని గురించి చెప్పాలంటే ఇదే సరైన వ్యాఖ్య…

1.Nur Khan ఎయిర్ బేస్ విధ్వంసం : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన Su-30 MKI AIR LAUNCHED బ్రహ్మోస్ తో నుర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద పదే పదే దాడులు చేసింది. దీనికి సమీపంలోనే రావల్పిండి పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్, న్యూక్లియర్ కమాండ్ సెంటర్ ఉంది.

Ads

పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడి నుండే అన్ని చోట్లకి సప్లైస్ వెళతాయి అంటే లాజిస్టిక్స్ కి కూడా హెడ్ క్వార్టర్స్ అన్నమాట! అఫ్కోర్స్! ఎంత నష్టం కలిగిందో ఇప్పట్లో బయటికి రాదు. కానీ బ్రహ్మోస్ దాడి ఎంత భయంకరంగా ఉంటుందో పాకిస్తాన్ సైనిక జెనరల్స్ కి అర్ధం అయి ఉంటుంది! న్యూక్లియర్ కమాండ్ సెంటర్ కనుక ధ్వంసం అయి ఉంటే ఇప్పట్లో దానిని తిరిగి పునరుద్దరించడం వీలు కాదు!

2.PAF జాకొబాబాద్/ షాబాజ్ ఎయిర్ బేస్: ఈ ఎయిర్ బేస్ లో PAF కి చెందిన పలు జెట్ ఫైటర్స్ స్క్వాడ్రాన్స్ ఉన్నాయి. ఎన్ని నాశనం అయ్యాయో తెలియదు కానీ చిన్న దెబ్బ తగిలి రంద్రం ఏర్పడినా ఆ పార్ట్ మార్చే వరకు వాటిని వాడలేరు. మెయిన్ హాంగర్ ధ్వంసం అయ్యింది కాబట్టి దానిలో ఉన్న జెట్ ఫైటర్స్ కూడా దెబ్బతిని ఉండవచ్చు! Su-30MKI బ్రహ్మోస్ తో దాడి చేసింది!

3.PAF భోలారి ఎయిర్ బేస్: ఇది కొత్తగా నిర్మించిన ఎయిర్ బేస్. మిగతావాటికంటే కొంచెం ఆధునికమైనది! మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కట్టినది. ఈ ఎయిర్ బేస్ లో కూడా పలు స్క్వాడ్రన్ల ఫైటర్ జెట్ లు ఉన్నాయి.
అయితే మిగతా వాటికంటే స్వీడన్ నుండి కొన్న AEWACS ( Airborne Early Warning And Command System) SAAB Erieye విమానం నిలిపివుంది కానీ దాడిలో బాగా దెబ్బతిన్నది! ఇక ముందు దీనిని వాడే వీలు లేదు, ఎందుకంటే స్వీడన్ కి తీసుకెళ్లి రిపేర్ చేయించాలి కానీ కొత్తది కొనడమే బెటర్!
ఒక స్క్వాడ్రన్ లీడర్ తో పాటు మొత్తం 10 మంది గ్రౌండ్ సిబ్బంది మరణించారు. Su-30 MKI బ్రహ్మోస్ తో దాడి చేసింది!

4.PAF సర్గోధా ఎయిర్ బేస్: పాకిస్తాన్ లో అతి పెద్ద ఎయిర్ బేస్ ఇది. రెండు రన్ వే లు క్రాస్ పాటర్న్ లో ఉంటాయి. ఇక్కడ కూడా JF-17, F-16, మిరేజ్ V జెట్ ఫైటర్స్ తో పాటు ఒక స్క్వాడ్రాన్ రవాణా విమానాలు ఉన్నాయి. రాఫెల్ ప్రయోగించిన SCALP ఎయిర్ TO సర్ఫెస్ బాంబులు రన్ వే క్రాస్ సెక్షన్ ని ఖచ్చితమైన గురితో విధ్వంసం సృష్టించింది. అంటే రెండు రన్ వే లు కలిసే క్రాస్ సెక్షన్ మీద బాంబు పడడం వలన 20 అడుగుల వెడల్పు పది అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది! నిజానికి యుద్ధ నిపుణులు పరిగణలోకి తీసుకునేది ఇలాంటి విషయాన్నే!

YES! రెండు రన్ వే ల క్రాస్ సెక్షన్ ని గురి తప్పకుండా ధ్వంసం చేయగలిగింది అంటే GPS కో ఆర్డినేట్స్ ఖచ్చితంగా ఉండాలి. బిల్డింగ్స్ మీద బాంబులు వేయడం వేరు, రన్ వే క్రాస్ సెక్షన్ మీద బాంబులు వేయడం వేరు. క్రాస్ సెక్షన్ ధ్వంసం అవడం వలన రెండు రన్ వే లు పనికిరాకుండా పోయి తిరిగి దాడి చేసే అవకాశం లేకుండా పోయింది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కి.

ఎయిర్ బేస్ రన్ వే ని ధ్వంసం చేసే సమయం తక్కువగా ఉంటుంది… ఎందుకంటే ఎయిర్ బేస్ కి దూరంగా ఎక్కడో ఒక చోట ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండి తీరుతుంది… అది యాక్టివేట్ అయితే రెండోసారి మళ్ళీ దాడి చేసి రన్ వే ని ధ్వంసం చేసే అవకాశం ఉండదు, కాబట్టి మొదటి ప్రయత్నంలోనే రన్ వే ని పనికి రాకుండా ధ్వంసం చేసేయాలి… ఆ పని రాఫెల్ చేసింది! పైసా వసూల్ అంటే ఇదే!

5.PAF సుక్కూర్ : ఈ ఎయిర్ బేస్ లో టర్కీ నుండి దిగుమతి చేసుకున్న బైరాక్టర్ TB2 ఆత్మహతి డ్రోన్లు, AKINCI డ్రోన్లు, చైనా తయారీ WING LOONG 2 డ్రోన్లు ఉన్నాయి. బంకర్ బస్టర్ బాంబుల దాడిని తట్టుకునేలా బ్లాస్ట్ ప్రూఫ్స్ టెక్నాలజీ తో హ్యాంగర్స్ నిర్మించినా రాఫెల్ ప్రయోగించిన SCALP మిసైల్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన పని చేసుకుపోయింది!
రాఫెల్ చేసిన దాడిలో సుక్కూర్ ఎయిర్ బేస్ లో ఉంటూ బైరాక్టర్ TB2 డ్రోన్లని ఆపరేట్ చేస్తున్న ఇద్దరు టర్కీ ఆపరేటర్లు దాడిలో చనిపోయారు!

సుక్కూర్ ఎయిర్ బేస్ లో ఉన్న రాడార్ ని కూడా ధ్వంసం చేసింది రాఫెల్!
రాఫెల్ తో పాటు Su-30MKI లు నాలుగు బ్రహ్మోస్ మిసైళ్ళని ప్రయోగిస్తేనే కానీ రీ ఇన్ఫోర్సెడ్ కాంక్రీట్ తో నిర్మించిన హ్యాంగర్ ధ్వంసం అయ్యింది!

6.రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్: Su-30MKI బ్రహ్మోస్ తో చేసిన దాడి వల్ల రన్ వే మీద పెద్ద గొయ్యి ఏర్పడింది!
రన్ వే తో పాటు రెండు బిల్డింగ్స్ కూడా ధ్వంసం అయ్యాయి.

7.ఆరిఫ్ వాలా ఎయిర్ బేస్: ఇక్కడ చైనా తయారీ యాంటి స్టెల్త్ రాడార్ అయిన YLC -84 రాడార్ ఉంది. చైనా రష్యా నుండి దొంగిలించిన టెక్నాలజీతో తయారుచేసిన YLC-84 యాంటీ స్టెల్త్ గ్రౌండ్ రాడార్ ని యాంటి రేడియేషన్ మిసైల్ అయిన రుద్రమ్ తో ధ్వంసం చేసింది Su-30MKI జెట్ ఫైటర్ తో.
DRDO తయారు చేసిన ANTI RADIATION మిసైల్ రుద్రమ్ కి ఇది ఫస్ట్ కిల్!

RUDRAM ANTI RADIATION మిసైల్ ప్రధానంగా సీడ్ ఆపరేషన్ ( SEAD – SUPPRESSION OF ENEMY AIR DEFENCE ) కోసం వాడతారు. SEAD ఆపరేషన్ లో భాగంగా DRDO RUDRAM ANTI RADIATION మిసైల్ 100% సమర్ధతతో పని పూర్తి చేసింది!

ఆపరేషన్ సిందూర్ తరువాత SEAD ఆపరేషన్ కోసం రుద్రమ్ మిసైల్ మీద ప్రపంచ దేశాల దృష్టి పడింది. కేవలం పశ్చిమ దేశాల ఆధిపత్యం ఉన్న యాంటి రేడియేషన్ మిసైల్ టెక్నాలజీకి ఇక కాలం చెల్లినట్లే!
రూపాయికి పది రూపాయలు ఎక్కువపెట్టి పశ్చిమ దేశాల నుండి ఈ  మిసైళ్ళని కొనే బదులు భారత్ నుండి రుద్రమ్ మిసైల్ కొనడమే మేలు అన్న స్థితికి తెచ్చింది DRDO!

So! Anti- Stealth రాడార్ అనేది రుద్రమ్ కి పెద్ద లెక్క కాదు.
SEAD మిషన్ అంటే రుద్రమ్! రుద్రమ్ అంటే SEAD మిషన్!

8.పశ్రూర్ ఎయిర్ బేస్: ఈ ఎయిర్ బేస్ లో అమెరికాకి చెందిన అత్యాధునిక AN-TPS – 77 గ్రౌండ్ రాడార్ ఉంది. మొత్తం 6 రాడార్లని కొన్నది పాకిస్తాన్! వీటిలో 3 రాడార్లని రుద్రమ్ మిసైల్ ధ్వంసం చేసింది! పస్రూర్ లో ఉన్న ఈ ఎయిర్ బేస్ AN-TPS -77 రాడార్ తో జమ్మూ మరియు పంజాబ్ లలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల కదలికలని పసిగడ్తున్నది పాకిస్థాన్.

*********************
పాకిస్తాన్ సంగతి పక్కన పెడితే పశ్చిమ దేశాల మిలిటరీ ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ కి భారత్ చేసిన దాడులు అదీ మిలిటరీ పరిభాషలో Precision Strikes అంటారు అలా దాడి చేయగలిగింది!
ఆపరేషన్ సిందూర్ కి ముందు కేవలం NATO దేశాలు మాత్రమే ప్రెసిషన్ స్ట్రైక్ చేయగలవు అనే అబద్ధాన్ని హాలీవుడ్ సినిమాల ద్వారా, వెస్ట్రన్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ వచ్చాయి!

అఫ్కోర్స్! అమెరికా, యూరోపు నుండి ఆయుధాలు కొనలేని దేశాలకి రష్యా, చైనా దేశాలు ప్రత్యామ్నాయంగా కనిపించేవి! రష్యా దగ్గర కొంటే స్పేర్ పార్ట్స్ తో ఇబ్బంది ఉంటుంది! చైనా దగ్గర కొంటే వాటి పనితీరు ఎలా వుంటుందో అనే సందేహం ఉంటుంది, కానీ చైనా చాలా తక్కువ ధరకి అమ్ముతుంది కాబట్టి కొన్ని ఆఫ్రికన్ దేశాలు కొంటున్నాయి!

చైనా తన ఆయుధాలు అమ్మడానికి డిమాన్స్ట్రేషన్ ఇచ్చేటప్పుడు అసలైన ఆయుధాలు చూపిస్తుంది కానీ ఆర్డర్ తీసుకోని డెలివరీ చేసివి నాశిరకంవి ఇస్తుంది!
ఇప్పుడు భారత్ ఆయుధాల పనితీరు ఏమిటో డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కి తెలిసింది!

అందుకే చెప్పేది… ముఖ్యంగా ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ విషయంలో భారత్ కి ముందు ముందు ఆర్దర్స్ వస్తాయి అనేది నిజం! మన దగ్గర నుండి అమెరికా కూడా ఆకాశ్ ని కొంటుంది వచ్చే రోజులలో!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పులివెందుల… అప్పటి వైఎస్సూ లేడు, అప్పటి చంద్రబాబూ కాడు…
  • 74 ఏళ్లొచ్చినా… రజినీలో అదే స్టయిల్… అదే ఎనర్జీ… దీనికీ అదే ప్రాణం…
  • ఉద్యమ సంధానకర్తగా రేవంత్ గౌరవించాడు కాబట్టి… బీఆర్ఎస్ ట్రోలింగ్..!!
  • War-2 review ….. జూనియర్ ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది…!!
  • ఇవే వీథికుక్కల గాట్లకు చిన్నారులు మరణిస్తే… ఒక్క గొంతూ ఏడవలేదు…
  • కేసీయార్ చేస్తే సరస శృంగారమట… ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారమట..?!
  • హార్డ్‌వర్క్ ఎవరిక్కావాలి… లక్కు కావాలి… లేదంటే ఏవో గిమ్మిక్కులు…
  • మయసభ… బాబు- వైఎస్ రాజకీయాల సీరీస్‌లో కొన్ని సీన్లపై ఆక్షేపణ..!!
  • బేరసారాల్లో మానవత్వం ఉండదు… మానవత్వంలో బేరసారాలు ఉండొద్దు…
  • కొత్త ఉప రాష్ట్రపతిగా ఆర్ఎస్ఎస్ మార్క్ శేషాద్రి రామానుజా చారి..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions