Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దూరపుకొండలు నునుపు..! భారీతనం వేరు- పనితనం వేరు ‘పుష్ప’ సుకుమారా..!!

December 19, 2021 by M S R

నిజమే… పుష్ప సినిమా గురించి రివ్యూ రాస్తూ ఒకాయన ‘‘పోస్ట్ ప్రొడక్షన్’’ మీద దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉండేదని అభిప్రాయపడ్డాడు… ఎంతసేపూ సుకుమార్ హీరో మీద కాన్సంట్రేట్ చేశాడే తప్ప మిగతా అంశాల్ని నెగ్లెక్ట్ చేశాడనే మాట నిజమే అనిపించినా… దూరపు కొండలు నునుపు అన్నట్టుగా, భారీ ఖర్చుకు వెనుకాడకుండా కొంతమంది టెక్నీషియన్స్ ఎంపిక జరిగిందనీ, కానీ ఆ కొందరు పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయారనీ విమర్శ..! పైగా ఇద్దరేసి..! ఉదాహరణకు ఎడిటింగ్… సినిమా ఫస్టాఫ్ స్లోగా నడవడానికి దర్శకుడు ఎంత కారకుడో, ఎడిటర్లు అంతే కారకులు… ఇద్దరు ఎడిటర్లు దీనికి… ఆంటోనీ రూబెన్, కార్తీక శ్రీనివాస్… వీరిలో కార్తీక శ్రీనివాస్ తెలుగువాడు… పదేళ్లుగా ఫీల్డులో ఉన్నాడు… తనను తీసుకున్నాక మళ్లీ ఆ తమిళ రూబెన్‌ను ఎందుకు తీసుకున్నారో తెలియదు… దానివల్ల క్వాలిటీ ఏమైనా పెరిగిందా, లేదు… పైగా సమన్వయం దెబ్బతింది… ఇప్పట్లో ఏ సినిమాకూ లేనంతగా 3 గంటల రన్‌టైమ్ ఫైనల్ చేశారు… దీనికి నిర్మాత, దర్శకులు, హీరో ఎలా అంగీకరించారో మరి… కనీసం పావుగంట, 20 నిమిషాలు కోసేస్తే సినిమా మరింత చిక్కగా వచ్చేది…

pushpa

సినిమా చూసిన ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది… ఆడియో అనేకచోట్ల అత్యంత నాసిరకంగా ఉందని..! ఓ పాన్ ఇండియా సినిమా, పైగా అంత ఖర్చు పెట్టగల సాధనసంపత్తి ఉన్న నిర్మాణ సంస్థ కనీసం ఆడియో విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయిందా అనిపిస్తుంది… కానీ స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో ఆస్కార్ కొట్టిన రెసుల్ పోకుట్టిని తీసుకొచ్చారు… లబ్దిప్రతిష్టుడే… కానీ ఈ సౌండ్ ఇంజనీర్, ఆడియో మిక్సర్, సౌండ్ డిజైనర్ అనుకున్నంత పనితనం చూపించలేకపోయాడు… తెలుగులోనే బోలెడు మంది పనిమంతులు ఉన్నారు… వాళ్లకు చాన్స్ ఇస్తే కదా, అద్భుతాలు చేసి చూపించేది…

Ads

pushpa

ఇక సినిమాటోగ్రఫీ… మిరోస్లా కూబా బ్రొజెక్… అడవుల నేపథ్యమున్న కథ… ఇక ఎంత రెచ్చిపోవాలి సినిమాటోగ్రాఫర్..? కానీ ఆ ప్రతిభ పెద్దగా ఎక్స్‌పోజ్ కాలేదు… పలుచోట్ల లైటింగ్ కూడా ఇబ్బందికరంగా కనిపించిందని ప్రొఫెషనల్ కెమెరామెన్ కూడా అంటున్నారు… మరి కూబా దాకా ఎందుకు పోయారు సార్..? ఇదేసమయంలో యాక్షన్ డైరెక్టర్, అదేనండీ స్టంట్స్ మాస్టర్ పీటర్ హెయిన్ కాస్త బాగానే ఒళ్లు వంచాడు… ఔట్‌పుట్ బాగానే వచ్చింది… చెన్నైకి వలస వచ్చిన వియత్నామీ కుటుంబానికి చెందిన పీటర్ మనకు కొత్తేమీ కాదు…

pushpa

దేవిశ్రీప్రసాద్‌కు మంచి స్వేచ్ఛను ఇచ్చాడు దర్శకుడు… దానికి తగ్గట్టుగానే తను కూడా పాటలు అదరగొట్టేశాడు… ఆ ట్యూన్స్ జనంలోకి విపరీతంగా వెళ్లిపోయాయి… బాగా హిట్… చంద్రబోస్ సాహిత్యం పెద్దగా ఆకట్టుకునేలా లేకపోయినా డీఎస్పీ ట్యూన్స్ క్యాచీగా అనిపించినయ్… సామీ, శ్రీవల్లీ, ఊ ఉంటావా… ప్రతి పాటా హిట్టే… తీరా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయానికొచ్చేసరికి తేలిపోయాడు… ఎందుకు అశ్రద్ధ వహించాడు..? సగటు ప్రేక్షకుడు కూడా అంగీకరిస్తాడు పుష్పలో బీజీఎం పూర్ అని…! నిజానికి ఇలాంటి కథల్ని బాగా ఎలివేట్ చేసే అంశాల్లో బీజీఎం కూడా ప్రధానమైందే… డీఎస్పీ నుంచి సరైన ఔట్‌పుట్ తీసుకోవడంలో దర్శకుడు ఫెయిల్…

pushpa

ఈ టెక్నికల్ వివరాల్లోకి ఎందుకు వెళ్తున్నామంటే,.. ఖర్చుకు వెనుకాడకుండా, భారీతనం పేరిట ఎవరెవరినో తీసుకొచ్చి పెడితే… ఆ దూరపుకొండలు ఏమిటో తెలిసొచ్చాయి వీళ్లకు అంతిమంగా…! పైగా ఒక్కో అంశంలో ఇద్దరేసి…! కొరియోగ్రఫీ విషయానికొస్తే బాలీవుడ్ పాపులర్ డాన్స్ ఎడిటర్, స్టెప్పుల డిజైనర్, అదేనండీ డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య… ఎంతసేపూ సమంత, రష్మికలను ఎక్స్‌పోజ్ చేసే ఫోజులే తప్ప పెద్దగా ‘‘బన్నీ రేంజ్’’ స్టెప్పుల్ని కంపోజ్ చేయలేకపోయాడనేది విమర్శ… నిజానికి బన్నీ సినిమాల్లో స్టెప్పులు భిన్నంగా, స్టయిల్‌గా, కొత్తగా ఉంటయ్… శేఖర్ మాస్టర్ కూడా ఈ సినిమాకు పనిచేశాడు… ప్చ్, ఇద్దరేసి, ముగ్గురేసి తీసుకుంటే… ఎవరూ సరిగ్గా ఓన్ చేసుకోరు, అదీ సమస్య…

pushpa

పీటర్ డ్రేపర్… విజువల్ ఎఫెక్ట్స్ డిజైనర్ కమ్ ఎడిటర్ కమ్ ఎక్స్‌పర్ట్… మీరు ఏ పేరైనా పెట్టుకొండి… ఇతనూ సిద్ధహస్తుడే… ట్రిపుల్ ఆర్, బాహుబలి, సైరా తదితర సినిమాల్లో గ్రాఫిక్స్ తన కృషే… మరి తనను సుకుమార్ సరిగ్గా వాడుకోగలిగాడా..? లేదు..! నటనలో చూడండి, ఫహద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ, రావురమేష్‌ సహా బోలెడు మంది నటీనటులు వస్తుంటారు, పోతుంటారు… థియేటర్ బయటికొచ్చాక సగం మంది గుర్తుండరు… సో, ఎంత ఖర్చుపెట్టాం, ఎవరిని తెచ్చుకున్నాం, ఎందరిని ఇన్వాల్వ్ చేశామనేది కాదు… ఔట్‌పుట్ క్వాలిటీ ఏమేరకు తీసుకోగలిగాం అనేదే ప్రధానం… నిజానికి ఇది పుష్ప టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ గురించిన సమీక్ష కాదు… అన్ని సినిమాలకూ వర్తిస్తుంది… పుష్ప ఉదాహరణ మాత్రమే..!! తక్కువ ఖర్చుతో మంచి నాణ్యతను అందించగల లోకల్ టాలెంట్ ఉందయ్యా సుకుమారా..? భారీతనం అంటే భారీ ఖర్చు కాదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions