Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తక్కువ తింటూ… చలికి వణుకుతూ… బ్రిటన్‌లో అదుపుతప్పిన ద్రవ్యోల్బణం…

March 14, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ……….. బ్రిటన్ ద్రవ్యోల్బణం 17.1% శాతానికి చేరుకుంది ::  కాంటర్ రీసర్చ్ & ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ !  ఈ రీసర్చ్ [Kantar Research & Project Management ] అనేది బ్రిటన్ కేంద్రంగా సేవలు అందించే సంస్థ ! మానవ వనరులు మరియు వివిధ అంశాల మీద పరిశోధన చేసి సాక్ష్యాధారాలతో సహా తన రిపోర్ట్ ఇచ్చే సంస్థ ! ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో తన సేవలని అందిస్తుంది !

కంటర్ బ్రిటన్ దేశవ్యాప్తంగా రీసర్చ్ చేసి కొన్ని దిగ్భ్రాంతికర విషయాలని బయటపెట్టింది బ్రిటన్ దేశం గురించి !

1. బ్రిటన్ వాసులు ఆహార కొరతని ఎదుర్కొంటున్నారు ! వారానికి ఒకరోజు రోజువారీలాగా కాకుండా మితంగా ఆహారం తీసుకుంటున్నారు. ఇది పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా పొదుపు చర్యలో భాగంగా ఈ పని చేస్తున్నారు.

Ads

2. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా ఇంధన ధరలు విపరీతంగా పెరగడం వలన ఎక్కువ శాతం ప్రజలు ఇంధనం పొదుపు పేరుతో చలిలో ఉంటున్నారు కనీసం వారానికి రెండు రోజులు. రూమ్ హీటర్లు వాడకం తగ్గించడం పొదుపులో ఒక భాగంగా చేస్తున్నారు.

3. ప్రతి 10 మంది బ్రిటన్ వాసులలో ఒకరు తన కంటే తన కుటుంబ సభ్యులకి భోజనానికి ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వేలో తేలింది ! అంటే ప్రతి పది మంది బ్రిటన్ వాసులలో ఒకరు వారానికి ఒకసారి తమ భోజనాన్ని త్యాగం చేస్తున్నారు.

4. బ్రిటన్ లో పాలు, గుడ్ల ధరలు బాగా పెరిగి పోవడంతో ఈ నెల అమ్మకాలు తగ్గాయి. ద్రవ్యోల్బణం 17.1 % అంటే మాటలు కాదు అదీ బ్రిటన్ లాంటి దేశంలో…. ఇప్పటివరకు సింగిల్ డిజిట్ లో ఉంటూ వస్తున్న ఇన్ ఫ్లెషన్ డబుల్ డిజిట్ కి… అదీ 17.1% శాతానికి చేరుకోవడం అంటే వింతగానే ఉంది ! బహుశా రెండవ ప్రపంచ యుద్ధ సమయానికి కూడా ఇంతటి పరిస్తితి లేదు… ఎందుకంటే అప్పుడు రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం కదా ? తన ఆక్రమణలో ఉన్న దేశాల నుండి అక్కడి ప్రజలని వాళ్ళ చావుకి వాళ్ళని వదిలిపెట్టి… మరీ బ్రిటన్ తనకి కావాల్సిన నిత్యావసరాలని ఓడల ద్వారా తరలించింది. బెంగాల్ కరువు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు.

5. బ్రిటన్ వాసుల కిరాణా ఖర్చులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 811 పౌండ్లు పెరిగినట్లు కంటర్ సంస్థ తెలిపింది. 811 పౌండ్లు పెరుగుదల అనేది ఒక్కో కుటుంబానికి సంబంధించినది !

6. పెరుగుతున్న ఇంధన, నిత్యావసరాల ధరలని దృష్టిలో పెట్టుకొని బ్రిటన్ వాసులు పొదుపు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు రూమ్ హీటర్లని తక్కువగా వాడుతున్నారు. దాని బదులు ఒకటికి రెండు లేయర్లతో ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. దీని వలన చలి నుండి కాపాడుకోవచ్చు… తద్వారా విద్యుత్ లేదా గాస్ ఆదాచేసుకొని ఖర్చు తగ్గించుకుంటున్నారు ! ప్రతి 10 మందిలో ఒకరు స్నానానికి వేడి నీళ్ళు వాడడం లేదు. ప్రతి 5 మందిలో ఒకరు గ్యాస్ లేదా విద్యుత్ పొదుపు చేయడం కోసం వారానికి ఒక రోజు వంట చేయడం లేదు !

7. గత నెలలో అంటే ఫిబ్రవరి నెలకి గాను బ్రిటన్ లో 23 లక్షల మంది తమ మార్టిగేజ్ లోన్ కి సంబంధించి వాయిదాలు చెల్లించలేదు, అలాగే క్రెడిట్ కార్డ్ చెల్లింపులు కూడా చేయలేదు. ఇక అద్దెకి సంబంధించి చెల్లింపులు కూడా చేయని వారు ఈ 23 లక్షల మందిలో ఉన్నారు. ఇది బ్రిటన్ చరిత్రలో ఒక రికార్డ్ ! అయితే విద్యుత్, గ్యాస్ బిల్లులు కూడా కట్టని వారి సంఖ్య బాగా పెరిగిపోతున్నట్లు తెలిసింది !

8. పెరుగుతున్న ధరలకి అనుగుణంగా తమ జీతాలని పెంచాలని కోరుతూ బ్రిటన్ లో ఉన్న లేబర్ ఫోర్స్ మొత్తం దేశ వ్యాప్తంగా ఆందోళనకి దిగడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. మొదట ఒకరోజు ఆందోళనతో పనులు చేయకుండా చూసి, ప్రభుత్వం నుండి స్పందన వస్తే సరే, లేకపోతే తమ డిమాండ్లని ఆమోదించేవరకు ఆపకుండా బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు అక్కడి లేబర్ ఫోర్స్ !

***************************************

ఇంత జరుగుతున్నా బ్రిటన్ ఉక్రెయిన్ సమస్య ప్రాధాన్యత కలిగినదిగా భావిస్తున్నది తప్పితే తమ దేశ ప్రజల సంగతి ఏమిటన్నది పట్టింపు లేదు!

ఆలోచనలో లేదా సిద్ధాంత పరమయిన విషయాలలో తగిన విధంగా ఆలోచించడంలో విఫలం అయ్యింది బ్రిటన్ ! ఉక్రెయిన్ సమస్య ఒక కొలిక్కి వస్తే రష్యా నుండి కాకుండా ఉక్రెయిన్ నుండి గ్యాస్, ఆయిల్, గోధుమల సరఫరా మళ్ళీ మామూలుగా అయిపోతాయి కాబట్టి ముందు ఉక్రెయిన్ సమస్య మీద దృష్టి ఎక్కువగా ఉంది !

ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ముగిసేలా లేదు ! OK. ఒకవేళ ఉక్రెయిన్ యుద్ధం ముగిసినా అక్కడ మొత్తం శ్మశాన వాతావరణం ఉంది. మళ్ళీ మామూలు దశకి రావాలంటే కనీసం 10 ఏళ్లు పడుతుంది అలా అని పూర్వ వైభవం వస్తుందా ? ఇప్పటికీ మాజీ సోవియట్ రిపబ్లిక్ దేశాలలో రెండవ ప్రపంచ యుద్ధం తాలూకు ఆనవాళ్ళు కనపడుతూనే ఉంటాయి.

అమెరికా యూరోపు దేశాల ఉద్దేశ్యం ఏమిటో పసిగట్టిన పుతిన్ ఉక్రెయిన్ ని పూర్తిగా శ్మశానంగా మార్చేవరకు యుద్ధం విరమించడు ! ఈలోగా యూరోపు దేశాలు ఆర్ధికంగా దిగజారుతాయి కాబట్టి కనీసం 5 ట్రిలియన్ డాలర్లు ఖర్చు పెడితేనే కానీ ఉక్రెయిన్ కి పూర్వ వైభవం రాదు. అంత డబ్బుని ఉక్రెయిన్ మీద ఖర్చుపెట్టగల స్థితిలో యూరోపు, అమెరికా దేశాలు ఉన్నాయా ? పోనీ ఇంధనం, గోధుమలు, వంట నూనెలు చౌకగా వస్తాయిలే అని ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డా అక్కడ లేబర్ ఎక్కడ ఉంది ?

*********************

వచ్చే ఏప్రిల్ నెల బ్రిటన్ పాలిట మరింత సంక్షోభాన్ని తేనున్నది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు ! ఎందుకింత దురభిమానం ? చైనాని మొన్నటి వరకు నెత్తిన పెట్టుకొని, అసలు చైనా ప్రజలు మాట్లాడే మాండరీన్ భాషని బ్రిటన్ లోని అన్ని స్కూళ్ళలో ప్రవేశపెట్టాలి అనే డిమాండ్ చేసేదాకా వెళ్ళి, తీరా ఉక్రెయిన్ యుద్ధం వలన చైనాని పక్కన పెట్టి ఏం సాధిద్దామని ?

భారతదేశంలోని మార్కెట్ కావాలి కానీ తమకి అనుకూలంగా లేడని మోడీని పదవి నుండి దించేయాలని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నది బ్రిటన్ ! మరి అలాంటప్పుడు భారత్ ఎందుకు సహకరిస్తుంది ? G20 దేశాల సమావేశానికి వ్లాదిమిర్ పుతిన్ భారత దేశానికి వస్తున్నాడు ! పుతిన్ భారత పర్యటన తరువాత యూరోపు దేశాల అసలు రంగు ఏమిటో బయటపడుతుంది చూస్తూ ఉండండి !

పుతిన్ ని సాకుగా చూపించి భారత్ ని వదులుకుంటారా? భారత్ కి వ్యతిరేకంగా మరో కుట్రకి తెర లేపాయి యూరోపు దేశాలు ! భారత్ స్టాక్ మార్కెట్ల నుండి పెట్టుబడులు ఉపసంహరించి, మెల్లిగా బంగ్లాదేశ్ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు సంస్థాగత పెట్టుబడి దారులు మూకుమ్మడిగా! అంటే మళ్ళీ బంగ్లాదేశ్ ని జాకీలు పెట్టి లే,పి చూశారా భారత్ కంటే బంగ్లాదేశ్ ఆర్ధిక వ్యవస్థ బాగా ఉంది అని ప్రతిపక్షాల చేత విమర్శలు చేయిస్తారు వీళ్ళు మళ్ళీ ! ఆ దిశగా పావులు కదపడం ఇప్పటికే మొదలయ్యింది ! కానీ వీళ్ళ ప్రయత్నాలు సఫలం కావు, పైగా నష్టపోతూ ఉంటారు మళ్ళీ మళ్ళీ !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions