ఉపాసన… చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య… అపోలో వారసురాలు… తను సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గానే కనిపిస్తుంది… పలు పోస్టులు ఆలోచనాత్మకంగా ఉంటయ్… హుందాగానే ఉంటుంది… భేషజం కూడా ఏమీ ఉండదు… ఓసారి ఇండియన్ టాయిలెట్ ఎలా బెటరో చెబుతూ, తను ఆ ఫోజులో కూర్చుని ఫోటో పెట్టింది… తప్పులేదు, నచ్చింది… కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తప్పులో కాలేసింది… నిజంగా ఆమె టేస్ట్ ఏమిటో, ఈ పోస్ట్ ఎందుకు పెట్టిందో కూడా అర్థం కాదు… ఫలితంగా నెటిజన్లు ఫుల్లు తిట్టేస్తున్నారు… చివరకు మెగా అభిమానులు కూడా ఛిఛీ అనేస్తున్నారు…
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..? ఇంతమంది తిట్టిపోస్తున్నా సరే, ఆ ఫోటో మీద, తన పోస్టు మీద భలే ప్రేమ ఆమెకు… రిమూవ్ మాత్రం చేయడం లేదు… విషయం ఏమిటంటే..? ఆమె రిపబ్లిక్ డే సందర్భంగా ఓ ఫోటో పెట్టింది… అదొక దిక్కుమాలిన ఫోటో… అందులో ఏం క్రియేటివిటీ కనిపించిందో గానీ ఆమెకు… దీనికి పేరు పెట్టండి అంటూ, ఆహా ఓహో అంటూ.., ఇన్‌స్టా, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది… ఆమెకు కామినేని శోభన పంపించిందట… ఇందులో రాంచరణ్, ఉపాసన కూడా ఉన్నారట, ఎక్కడో కనిపెట్టగలరా అనడిగింది… ‘‘ప్రగతిశీల, సహనశీల భారతం దిశగా అడ్డంకుల్లేని సంయుక్త కృషి’’ అని వివరణ కూడా ఇంగ్లిషులో రాసింది… ఆ ఫోటో ఇదుగో ఇదీ…
Ads
ఓ గుడి గోపురం… దాని మీద బోలెడు మంది కనిపిస్తున్నారు… వాళ్లు ఎవరో, ఆ గోపురం మీద ఆ ఫోటోల్ని పేస్ట్ చేయడం వెనుక చిత్రకారుడి కవిహృదయం ఏమిటో జుత్తు పీక్కున్నా మనకు సమజ్ కాదు… (మనం ఆ చిత్రకారుడి వేవ్ లెంత్‌కు ఎదగలేదన్నమాట…) పైగా అలా చెప్పులు, బూట్లతో రకరకాల ఫోజుల్లో గోపురం మీద నిల్చుని, కూర్చుని రకరకాల వ్యక్తుల ఫోటోలు… నిజంగానే ఫోటో బాగాలేదు… ఏ టేస్టూ లేదు, అదసలు క్రియేటివ్ పీసే కాదు… మరి ఉపాసనకు ఎందుకు నచ్చిందో ఆమెకే తెలియాలి… (రాంచరణ్, తనను కూడా ఇరికించినందుకు నచ్చిందేమో…) ఇన్‌స్టాలో పది వేల లైకులున్నయ్ కదా అని ఫేస్ బుక్ చూస్తే, అందులో కామెంట్స్ అన్నీ నెగెటివే… ఇక ట్విట్టర్ కామెంట్ల పరిశీలనకు పోలేదు…
ఆ ఫేస్‌బుక్ కామెంట్స్‌లో బూతులు కూడా… ఫోటో వెంటనే డిలిట్ చేయాలని డిమాండ్లు, తిట్లు, ఫేస్‌బుక్‌కు రిపోర్ట్ చేయడం… నానా గందరగోళం… సరే, ఈ ట్రోలింగ్ సంగతి సరే, కానీ ఈ ఫోటో పోస్టు వల్ల ప్రయోజనం ఏమిటి..? అందులో ఏముందని..? నిజంగా ఒక పోస్టు బాగుంటే, ట్రోలింగ్ జరిగినా భరిస్తే తప్పులేదు… కానీ అక్కర లేని చోట సోషల్ తిట్లు తినడం దేనికి..? ఒకరిద్దరు ఏదో రాశారు, ఇది దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల్ని ఒక్కచోట చూపించడం అట… రిపబ్లిక్ సంకేతం అట… నిజంగా అలా కనిపిస్తోందా..? ఏమో…!! సారీ, ఉపాసనా… ఈ విషయంలో నీది పూర్ టేస్ట్… నచ్చలేదుఫో…!!
Share this Article