నిజం చెప్పాలంటే బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ అనే షోను హోస్ట్ చేయడం నాకూ నచ్చలేదు మొదట్లో… హీరోలు టీవీ షోలు చేయడం ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తారనీ, తమ పాపులారిటీని సుస్థిరం చేసుకుంటారనీ భావించేవాళ్లలో నేనూ ఒకడిని… నాని, జూనియర్, నాగార్జున తదితరుల బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు షోల హోస్టింగును అందుకే ఇష్టపడ్డాను… చిరంజీవి ఇందులో ఫ్లాప్… ఐనాసరే, బాలయ్య ఆహాలో షో చేయడం నచ్చలేదు… ఎందుకంటే..? టీవీ వేరు, ఓటీటీ వేరు… టీవీ అన్నివర్గాల ప్రేక్షకుల్లోకి వెళ్తుంది… ఏమీ పే చేయాల్సిన పనిలేదు… టీవీ రీచ్ చాలా పెద్దది… ప్రతి నట్టింటికీ చేరుతుంది… ఓటీటీ, అందులోనూ ఆహా ఓటీటీ రీచ్ చాలా చాలా తక్కువ…
అఖండ రేంజ్ హీరోకు ఆ చిన్న ఓటీటీలో ఓ షో హోస్ట్ చేయాల్సిన ఖర్మేంటి అనేదే నా భావన… అలాగే బాలయ్యకు కోపం హఠాత్తుగా వస్తుంది, అంతే వేగంగా తగ్గిపోతుంది… బ్లడ్డు, బ్రీడు తాలూకు ధోరణి సరేసరి… తను వేరే సెలబ్రిటీని కూర్చోబెట్టి, గౌరవిస్తూ, వాళ్ల అహాలకు మర్యాదిస్తూ షో హోస్ట్ చేయగలడా అనే డౌటుండేది… అసలు ప్రపంచంలో ఎన్టీయార్, తను తప్ప వేరే సెలబ్రిటీలు ఎవడూ పుట్టలేదు అనుకునే తత్వం తనది… కానీ భలే క్లిక్కయ్యాడు… హోస్టింగు మీద తన ముద్ర వేశాడు… షో కూడా బాగా హిట్టయింది… ఇప్పుడు వచ్చే ఫస్ట్ సీజన్ కేవలం ప్రయోగాత్మకంగా తీసిన ఎపిసోడ్లు… బాలయ్యను హోస్ట్‌గా ప్రేక్షకులకు ఏమేరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలనుకున్నారు… సో, ఇప్పుడు ఫస్ట్ సీజన్ అయిపోయింది, చివరి ఎపిసోడ్‌ను మహేశ్‌బాబు చిట్‌చాట్‌తో ముగించాడు బాలయ్య… (మీలో ఎవరు కోటీశ్వరుడు మొన్నటి సీజన్ కూడా జూనియర్ ఎన్టీయార్ ఈ మహేశ్‌బాబుతోనే క్లోజ్ చేసినట్టు గుర్తు…)
ఆఫ్టరాల్, ఈ షో గురించి కథనం అవసరమా అంటారా..? అవసరమే అనిపించింది… ఎందుకంటే..? బాలయ్యను కొత్తగా చూపించింది… తనలోని జోవియల్ ధోరణిని, స్పాంటేనియస్ పంచులనూ ఆహ్లాదంగా పంచింది… తను హోస్ట్‌గా పనికొస్తాడా అనే సందేహాల్ని పటాపంచలు చేసింది… అంతేకాదు, చివరి ఎపిసోడ్‌తో హ్యూమన్ టచ్ ఉంది… మహేశ్‌ను ఓ పాపులర్ హీరోగాకన్నా హ్యూమన్ టచ్ ఉన్న ఓ మంచి వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసింది, అదీ నచ్చింది… (ఈనాడు సాధారణంగా వేరే టీవీలు, ఓటీటీల్లో వచ్చే షోల గురించి పట్టించుకోదు, కానీ ఈ ఎపిసోడ్ మీద ఓ వార్తను సైట్‌లో పబ్లిష్ చేసింది… విశేషమే, నచ్చింది… ఇదీ లింక్… https://www.eenadu.net/telugu-news/movies/unstoppable-season-finale-episode-balakrishna-with-mahesh-babu/0209/122014650)
Ads
మహేశ్‌బాబు, బాలయ్య మధ్య జరిగిన సరదా సంభాషణల మాటెలా ఉన్నా… తను ఇప్పటివరకూ 1000 వరకూ చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్లను చేయించినట్టు ప్రేక్షకులకు తెలియడం కూడా బాగుంది… చిన్నప్పుడు తన కొడుకు ‘‘ఎర్లీ డెలివరీ’’ దగ్గర నుంచి, తనకు ఈ ఆపరేషన్ల మీద ధ్యాస ఎందుకు పెరిగిందో మహేశ్‌బాబు చెప్పుకొచ్చిన తీరు కూడా బాగుంది… గతంలో ఏ ఇంటర్వ్యూలోనూ ఈ అంశాల జోలికి పోలేదు ఎవరూ… మహేశ్ కూడా పెద్దగా చెప్పలేదు… బాలయ్య ప్రధానంగా దాన్నే పట్టుకుని ఎక్స్‌పోజ్ చేశాడు… గుడ్… అలాగే కేబీఆర్ పార్కులో పాము కనిపిస్తే, మళ్లీ ఆ పార్కులో వాకింగ్ వెళ్లలేదంటూ ఏ భేషజమూ లేకుండా మహేశ్ చెప్పుకొచ్చాడు… ఇతర ఇంటర్వ్యూలకు పూర్తి భిన్నంగా సాగిన ఈ చిట్‌చాట్ ఎందుకో బాగున్నట్టనిపించింది… కనెక్టయింది…
అన్నింటికీ మించి ఒక సీన్ మాత్రం భలే నచ్చింది… మహేశ్ ఆర్థికసాయంతో కొడుక్కి గుండె ఆపరేషన్ చేయించుకున్న ఓ జంట వచ్చింది… పిల్లాడికి ఇవ్వడానికి గిఫ్టులు తెచ్చారు… ఒరేయ్, ఇవన్నీ నీకేరా అని బాలయ్య చూపిస్తున్నాడు… ఈలోపు ఆ పిల్లాడు వెనక నుంచి బాలయ్య వీపు మీద కొట్టాడు, బాలయ్య నవ్వుతూ… తనకు కోపం, ముందు వీటి సంగతేమిటో చూడు అంటున్నాడు చూశారా అన్నాడు… నిజమే మరి… బాలయ్య వీపు మీద కొట్టడం అంటే మజాకా..? హహహ… వదిలేస్తే, ఏయ్, అఖండ తాతా అని ఒడిలోకి ఎక్కేవాడేమో… నీది రికార్డురా బుడ్డోడా…!!
Share this Article